సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సతీష్ హత్య కేసులో మరో ట్విస్ట్.. ముందురోజు..

హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ సతీష్‌ బాబు హత్య కేసులో రోజు రోజుకో కొత్త కోణం వెలుగులోకి వస్తోంది. తన స్నేహితురాలు ప్రియాంకతో సతీష్‌ చనువుగా ఉండడం చూసి తుట్టుకోలేకే.. హేమంత్‌ ఈ హత్య చేశాడని పోలీసులు నిర్థారణకు వచ్చారు. అయితే కుటుంబ సభ్యులు మాత్రం ఇందుకు ఆర్థిక కారణాలు ఉన్నాయని ఆరోపిస్తున్నారు. హత్య జరిగిన రోజు హేమంత్‌ ఇంటికి సతీష్‌ వెళ్లాడని, అక్కడ ఇద్దరూ మద్యం సేవించారని పోలీసులు గుర్తించారు. మరోవైపు హత్యకు ముందు […]

సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సతీష్ హత్య కేసులో మరో ట్విస్ట్.. ముందురోజు..
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Sep 02, 2019 | 5:23 PM

హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ సతీష్‌ బాబు హత్య కేసులో రోజు రోజుకో కొత్త కోణం వెలుగులోకి వస్తోంది. తన స్నేహితురాలు ప్రియాంకతో సతీష్‌ చనువుగా ఉండడం చూసి తుట్టుకోలేకే.. హేమంత్‌ ఈ హత్య చేశాడని పోలీసులు నిర్థారణకు వచ్చారు. అయితే కుటుంబ సభ్యులు మాత్రం ఇందుకు ఆర్థిక కారణాలు ఉన్నాయని ఆరోపిస్తున్నారు. హత్య జరిగిన రోజు హేమంత్‌ ఇంటికి సతీష్‌ వెళ్లాడని, అక్కడ ఇద్దరూ మద్యం సేవించారని పోలీసులు గుర్తించారు. మరోవైపు హత్యకు ముందు రోజు ప్రియాంకను సతీష్‌ హాస్టల్‌ వద్ద డ్రాప్‌ చేసిన పుటేజ్‌ను పోలీసులు సేకరించారు. ఇక ప్రియాంకను హాస్టల్‌లో డ్రాప్‌ చేసిన తర్వాత సతీష్‌ ఎక్కడికి వెళ్లాడనేది మిస్టరీగా మారింది.

అయితే ఈ నెల 27న సతీష్ ఇంటి దగ్గరి నుంచి వెళ్లగా.. తన భర్త కన్పించడం లేదని సతీష్ భార్య…ఆ మరుసటి రోజు రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ సమయంలో ఆమెతో పాటు హేమంత్‌, మరి కొంతమంది స్నేహితులు కూడా పోలీస్ స్టేషన్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే 29వ తేదీన పోలీసులు ఎప్పుడైతే సతీష్‌ మృత దేహాన్ని గుర్తించారో అప్పటినుంచి హేమంత్‌ ఫోన్‌ స్విచ్ఛాప్‌ చేసి..పరారయ్యాడు. ఈ నేపథ్యంలో హేమంత్ ప్రధాన నిందితుడిగా తేలడంతో.. ఆయన కోసం పోలీసులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.