Home Furniture Expo: మీ ఇంటి ఇంటీరియర్‌ను మార్చాలనుకుంటున్నారా.? అయితే ఇది మీకోసమే.!
హైదరాబాద్ మాదాపూర్‌లోని హైటెక్స్ హాల్‌లో హోం ఫర్నిచర్ ఎక్స్‌పో ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేశారు. కొత్త ఇంటికి కావలసిన గృహోపకరణాలకు, ఇంటీరియర్‌లు ఒకే చోట అందుబాటులో ఉండాలని హోం ఫర్నిచర్ ఎక్స్‌పోను ఏర్పాటు చేశామని..

హైదరాబాద్ మాదాపూర్‌లోని హైటెక్స్ హాల్‌లో హోం ఫర్నిచర్ ఎక్స్‌పో ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేశారు. కొత్త ఇంటికి కావలసిన గృహోపకరణాలు, ఇంటీరియర్‌లు ఒకే చోట అందుబాటులో ఉండాలని హోం ఫర్నిచర్ ఎక్స్‌పోను ఏర్పాటు చేశామని ఐ యాడ్స్ నిర్వాహకులు సతీష్ తెలిపారు. ఫిబ్రవరి 25 నుంచి 28 వరకు నాలుగు రోజుల పాటు జరుగనున్న ఈ ఎక్స్‌పో ఉదయం 10 గంటల నుండి రాత్రి 8:30 వరకు ఉండనుంది. ఈ ఎక్స్‌పోలో దేశంలోని బెంగళూరు, రాజస్థాన్, చెన్నై, ముంబైలతో పాటు ప్రధాన పట్టణాలకు చెందిన ఫర్నిచర్ అందుబాటులో ఉంటుంది.
ఇండియన్ ఫర్నిచర్‌తో పాటు ఇంపోర్టెడ్ ఫర్నిచర్ కూడా ఈ ఎక్స్‌పోలో ఉన్నాయని ఐ యాడ్స్ నిర్వాహకులు సతీష్ అన్నారు. సోఫాలు, డైనింగ్ టేబుల్స్, డ్రెస్సింగ్ టేబుల్స్, మంచాలు ప్రదర్శనలో ఉండనుండగా.. ఇంటిని డెకరేషన్ చేసుకోవాలనుకున్న, రెనోవేషన్ చేయాలనుకున్నా.. అందుకు కావాల్సిన గృహోపకరణాలు, ఇంటీరియర్ ఒక్క చోట కొలువు దీరాయి.. గార్డెనింగ్‌కు సంభందించిన వాటర్ ఫౌంటెన్స్, రకరకాల డిజైన్‌లు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. వివిధ మోడల్స్ పైన పది నుంచి డెబ్బై శాతం వరకు డిస్కౌంట్ లభిస్తుందన్నారు.




