Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: భారీ భద్రత నడుమ హైదరాబాద్‌లో హోలీ వేడుకలు

సంతోషాల కేళి.. సంబరాల హోలీ.. ఏటా దేశవ్యాప్తంగా హోలీ పండుగను ఘనంగా నిర్వహిస్తారు. ప్రతి ఏడాది ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి నాడు హోలీ పండుగను జరుపుకుంటాం. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు రంగులు పూసుకుని ఎంతో ఆనందంగా పండుగ జరుపుకుంటున్నారు. జీవితాల్లో ఆనందాన్ని నింపడమే ఈ పండుగ ముఖ్య ఉద్దేశం. రంగులతోనే కాకుండా డీజే పాటలు, రెయిన్ డ్యాన్స్‌లతో ఎంజాయ్ చేస్తున్నారు. హోలీ వేడుకల సందర్భంగా హైదరాబాద్‌ పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

Hyderabad: భారీ భద్రత నడుమ హైదరాబాద్‌లో హోలీ వేడుకలు
Holi Celebration
Follow us
Vijay Saatha

| Edited By: Ram Naramaneni

Updated on: Mar 14, 2025 | 1:55 PM

హోలీ వేడుకలు అంటేనే హైదరాబాద్‌. సెలబ్రేషన్‌ నెక్ట్స్‌ లెవల్‌లో ఉంటుంది. ఈసారి కూడా ఈసారి కూడా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కో స్టైల్‌లో సెలెబ్రేట్‌ చేసుకున్నారు. పాటలకు స్టెప్పులు వేస్తూ సందడి చేశారు. చిన్నా, పెద్దా అన్న తేడా లేకుండా అందరూ ఒక చోట చేరి పండుగ జరుపుకున్నారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ ఉల్లాసంగా గడిపారు.

ఓ వైపు రంగులు విరజిమ్ముతూ సంగీతానికి అనుగుణంగా చిందులేశారు. యువత నృత్యాలు చేస్తూ…. ఆనందపు జల్లులో పరవశించిపోయారు. బేగంపేట కంట్రీక్లబ్‌, నెక్లెస్‌రోడ్‌లోని పీపుల్స్ ప్లాజా సహా పలు ప్రాంతాల్లో ప్రాంతాల్లో వసంత హేలను ఆస్వాదించారు.

నెక్లెస్ రోడ్​లోని పీపుల్స్ ప్లాజాలో యువత సందడి చేశారు. కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ఒకరిపై ఒకరు రంగులు చల్లుకున్న వారితో ఆ ప్రాంతమంతా కోలాహలంగా మారింది. వారి ఉత్సాహానికి సంగీతం ఇంకాస్త జోష్ పెంచింది. హుషారెత్తించే డీజే సాంగ్స్ స్టెప్పులతో హోరెత్తించారు.

బేగంబజార్‌లో యూత్​ హోలీ ఆడి చిందేస్తున్నారు. రంగు జల్లుకుంటూ కేరింతలు కొడుతున్నారు. ప్రతి గల్లీలో కుర్రకారు డీజే సాంగ్స్​.. రెయిన్​ డ్యాన్స్​లతో ఉర్రూతలూగిస్తారు. కూకట్‌పల్లిలో మస్త్‌ గ్రాండ్‌గా హోలీ పండుగ సెలెబ్రేట్‌ చేసుకుంటారు. అమ్మాయిలు, అబ్బాయిలు మస్త్‌ ఎంజాయ్‌ చేశారు.

నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్​లోనూ హోలీ సెలబ్రేషన్స్‌ నెక్ట్స్‌ లెవల్‌లో జరిగాయి. డీజే సాంగ్స్​కు చిందులు వేస్తూ యూత్‌ సందడి చేశారు. ఆనందోత్సాహాల మధ్య ఉస్మానియా విశ్వవిద్యాలయంలో హోలీ వేడుకలు జరిగాయి. రంగుల పండుగ హోలీలో ఓయూ విద్యార్థులు పాల్గొని చిందేశారు. ఆర్ట్స్‌ కళాశాల వద్ద ఏర్పాటుచేసిన వేడుకల్లో వేలాది మంది విద్యార్థులు పాల్గొని రంగులు చల్లుకుంటూ ఉత్సాహంగా పాల్గొన్నారు. డీజే పాటలకు డ్యాన్స్‌లతో హోరెత్తించారు.

హోలీ సందర్భంగా  ఈసారి పోలీస్ సందర్భంగా పోలీసులు కూడా చాలా అలర్ట్ గా ఉన్నారు. అందుకు కారణం రంజాన్ మాసంలో వచ్చే రెండో శుక్రవారం కూడా కావటమే. గతంలో 35 సంవత్సరాల క్రితం ఈ తరహా రోజు వచ్చింది. రంజాన్ మాసంలో అత్యంత పవిత్రంగా ముస్లింలు ప్రార్థనలు చేస్తుంటారు. అయితే మసీదులపై రంగులు పడితే దాని పవిత్రత దెబ్బతింటుందని పెద్దలు అంటారు. ఇలాంటి సందర్భంలో హోలీ పండుగ రావటంతో పోలీసులు చాలా అలర్ట్ గా ఉంటున్నారు. ఏ చిన్న ఘటన జరిగినా సరే దాని ప్రభావం హైదరాబాద్ పైనే కాకుండా ఇతర ప్రాంతాలకు విస్తరించి అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కడ ఎలాంటి అవాంఛనీయం ఘటన జరగకుండా పోలీసులు గట్టి చర్యలు తీసుకున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..