Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TGPSC Group 3 Results 2025: తెలంగాణ గ్రూప్‌ 3 ఫలితాలు వచ్చేశాయ్‌.. రిజల్ట్స్ డైరెక్ట్‌ లింక్‌ ఇదే

తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్ (టీజీపీఎస్సీ) పోస్టులకు సంబంధించి ఫలితాలను కమిషన్‌ వరుసగా విడుదల చేస్తుంది. ఇప్పటికే గ్రూప్ 1, గ్రూప్ 2 ఫలితాలు వెల్లడించిందిన సంగతి తెలిసిందే. తాజాగా గ్రూప్ 3 పోస్టుల ఫలితాలను కూడా విడుదల చేసింది. ఈ పరీక్షకు హాజరైన అభ్యర్ధులు ఈ కింది డైరెక్ట్ లింక్‌ ద్వారా ఫలితాలను నేరుగా చెక్‌ చేసుకోవచ్చు..

TGPSC Group 3 Results 2025: తెలంగాణ గ్రూప్‌ 3 ఫలితాలు వచ్చేశాయ్‌.. రిజల్ట్స్ డైరెక్ట్‌ లింక్‌ ఇదే
TGPSC Group 3 Results
Follow us
Srilakshmi C

|

Updated on: Mar 14, 2025 | 3:56 PM

హైదరాబాద్‌, మార్చి 14: తెలంగాణ గ్రూప్‌ 3 సర్వీసు పోస్టుల ఫలితాలు శుక్రవారం (మార్చి 14) విడుదలయ్యాయి. టీజీపీఎస్సీ ఛైర్మన్‌ బుర్ర వెంకటేశం ఈ రోజు మధ్యాహ్నం ఫలితాలను విడుదల చేశారు. ఈ పరీక్షలు రాసిన అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చు. గ్రూప్ 3 ఫలితాలతోపాటు మాస్టర్ క్వశ్చన్ పేపర్, తుది ఆన్సర్ కీ, అభ్యర్ధుల OMR షీట్లను కూడా వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచింది. అభ్యర్ధులు తమ వివరాలు నమోదు చేసి వీటిని డౌన్ లోడ్ చేసుకోవచ్చు. మొత్తం 1365 గ్రూప్‌ 3 పోస్టుల భర్తీకి రాష్ట్రవ్యాప్తంగా 1401 పరీక్ష కేంద్రాల్లో గతేడాది నవంబర్‌ 17, 18 తేదీల్లో రాత పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే.

టీజీపీఎస్సీ గ్రూప్‌ 3 ఫలితాల 2025 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

రాష్ట్ర వ్యాప్తంగా 5,36,400 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. వారిలో 2,69,483 మంది మాత్రమే పరీక్షకు హాజరయ్యారు. అంటే సగం మంది (50.24శాతం మంది) మాత్రమే గ్రూప్‌ 3 పరీక్షలకు హాజరయ్యారన్నమాట. మొత్తం 3 పేపర్లకు ఈ పరీక్షలు జరిగాయి.

ఇవి కూడా చదవండి

కాగా ఇప్పటికే షెడ్యూలు ప్రకారం మార్చి 10, 11 తేదీల్లో గ్రూప్‌-1, గ్రూప్‌-2 రాతపరీక్షల మార్కులను వెల్లడించిన కమిషన్‌.. మార్చి 14న గ్రూప్‌ 3 జనరల్‌ ర్యాంకు జాబితాను కూడా వెల్లడించింది. ఆయా పోస్టులకు సంబంధించిన మార్కులతో కూడిన జనరల్ ర్యాంకింగ్‌ జాబితాలో అభ్యర్ధులు తమ మార్కులను చెక్‌ చేసుకోవచ్చు. 563 గ్రూప్ 1 సర్వీసు పోస్టులకు, 783 గ్రూప్ 2 సర్వీసు పోస్టులకు నియామక ప్రక్రియను అధికారులు వేగవంతం చేస్తున్నారు. ఇవి రెండూ పూర్తైన తర్వాత గ్రూప్‌ 3 పోస్టులకు తుది జాబితా వెల్లడిస్తారు.

టీజీపీఎస్సీ గ్రూప్‌ 3 జనరల్ ర్యాంకుల జాబితా కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.