Hyderabad: డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీ కోసం ఆటో డ్రైవర్‌ను ఆపిన పోలీసులు.. కట్ చేస్తే అతను
హైదరాబాద్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో ట్రాఫిక్ పోలీసులకు వింత అనుభవాలు ఎదురవుతున్నాయి. తాజాగా చాంద్రాయణగుట్టలో మద్యం మత్తులో ఆటో నడిపిన ఓ డ్రైవర్, ఆటోలో నుంచి పామును తీసి పోలీసులను బెదిరించడంతో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. చివరకు పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు.

హైదరాబాద్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ చేసే ట్రాఫిక్ పోలీసులకు విచిత్ర అనుభవాలు ఎదురవుతున్నాయి. కొందరు నా బ్యాగ్రౌండ్ తెలుసు అని బెదిరిస్తున్నారు. మరికొందరు చనిపోతామని రోడ్డు మీద పడుకుంటున్నారు. ఇంకొందరు ఇంట్లో తెలిస్తే గోల అవుతుందని పోలీసుల ముందు బోరున ఏడ్చేస్తున్నారు. అంతేకాదు.. ఏకంగా బ్రీత్ అనలైజర్ మీషన్లు ఎత్తుకుపోయిన మహానుభావులు కూడా ఉన్నారు. తాజాగా హైదరాబాద్ చాంద్రాయణగుట్టలో తాగుబోతు వీరంగం సృష్టించాడు. చౌరస్తా దగ్గర డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు పోలీసులు. ఈ సమయంలో మద్యం మత్తులో ఆటో నడుపుతున్న డ్రైవర్‌ను ఆపారు. దీంతో అతను రెచ్చిపోయాడు. ఏకంగా ఆటోలో నుంచి పామును తీసి ట్రాఫిక్ పోలీసులను బెదిరించేందుకు యత్నించాడు. దీంతో భయపడ్డ పోలీసులు అతడి నుంచి పక్కకు జరిగారు. కొద్దిసేపటి తర్వాత ధైర్యం తెచ్చుకుని.. జాగ్రత్తగా డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. పాముతో పోలీసులను బెదిరించిన కేసులో అతడిని అరెస్ట్ చేశారు.
వీడియో దిగునవ చూడండి…
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
