AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: న్యూ ఇయర్ వేళ డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికితే 15 వేల ఫైన్.. అంతేకాదు..

క్యాబ్‌లు, టాక్సీలు, ఆటో-రిక్షాల డ్రైవర్లు తప్పనిసరిగా యూనిఫాం ధరించాలని.. డాక్యుమెంట్ నిబంధనలకు లోబడి ఉండాలన్నారు. రైడ్‌ను తిరస్కరిస్తే రూ. 500 ఫైన్ వేస్తామని తెలిపారు. ఓవర్ స్పీడ్, రాంగ్ రూట్లు, సిగ్నల్ జంపింగ్, ర్యాష్ డ్రైవింగ్, హెల్మెట్‌లెస్ రైడింగ్ చేసేవారిని ప్రత్యేక కెమెరాల ద్వారా గుర్తిస్తామన్నారు.

Hyderabad: న్యూ ఇయర్ వేళ డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికితే 15 వేల ఫైన్.. అంతేకాదు..
Drunk And Drive
Ram Naramaneni
|

Updated on: Dec 28, 2023 | 4:53 PM

Share

పాత సంవత్సరానికి గుడ్ బై చెప్పి.. కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించేందుకు నగర ప్రజానీకం సిద్దమైంది. పబ్బులు, క్లబ్బులు, బాంకెట్ హాల్స్ ఆల్రెడీ బుక్ అయిపోయాయి. అయితే కొత్త సంవత్సరం వేడుకల వేళ సంయమనం అవసరం. హద్దుమీరితే ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. అందుకే పోలీసులు కూడా అలెర్ట్ అయ్యారు.  కొత్త సంవత్సరం సందర్భంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన వ్యక్తులకు రూ.15000 వరకు జరిమానా విధించాలని నగర పోలీసులు నిర్ణయించారు. మొదటిసారి డ్రంక్ అండ్ చేసినవారికి రూ. 10,000 ఫైన్ ఉంటుంది. గరిష్టంగా 6 నెలల జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉంది. రెండు లేదా అంతకంటే ఎక్కువసార్లు డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడితే వారికి రూ.15,000 జరిమానా విధిస్తారు. 2 సంవత్సరాల వరకు జైలు శిక్షను పడొచ్చు. ప్రయాణికుల నుంచి అదనపు ఛార్జీలు వసూలు చేస్తే క్యాబ్ డ్రైవర్లకు కూడా జరిమానా విధిస్తామని పోలీసులు హెచ్చరించారు. డిసెంబర్ 31 రాత్రి 8 గంటల నుంచి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ముమ్మరం చేస్తామని తెలిపారు. జరిమానాలు,  జైలు శిక్షతో పాటు తీవ్రతను బట్టి డ్రైవింగ్ లైసెన్స్‌లు కూడా స్వాధీనం చేసుకుంటామని.. అతి చేస్తే శాశ్వతంగా లైసెన్స్  రద్దు చేస్తామని తెలిపారు.

ఫ్లై ఓవర్లు మూసివేత

కొత్త సంవత్సరం సందర్భంగా.. ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా.. డిసెంబర్ 31 రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు పది ప్రధాన ఫ్లై ఓవర్లు, కొన్ని రహదారులను మూసివేస్తున్నట్లు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రకటించారు. మూసివేయనున్న ఫ్లై ఓవర్లు ఇవే:

  • శిల్పా లేఅవుట్ ఫ్లై ఓవర్
  • గచ్చిబౌలి ఫ్లై ఓవర్
  • బయోడైవర్సిటీ ఫ్లై ఓవర్‌లు (1 & 2)
  • షేక్‌పేట ఫ్లై ఓవర్
  • మైండ్ స్పేస్ ఫ్లై ఓవర్
  • రోడ్ నెం.45 ఫ్లై ఓవర్
  • దుర్గం చెరువు కేబుల్ వంతెన
  • సైబర్ టవర్ ఫ్లై ఓవర్
  • ఫోరమ్ మాల్-JNTU ఫ్లై ఓవర్
  • ఖైత్లాపూర్ ఫ్లై ఓవర్
  • బాబు జగ్జీవన్ రామ్ ఫ్లై ఓవర్ (బాలానగర్)

ఇవి కాకుండా, ఔటర్ రింగ్ రోడ్, PVNR ఎక్స్‌ప్రెస్‌వేలు మూసివేయనున్నారు. ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లే వాహనాలను మాత్రమే అనుమతించనున్నారు. క్యాబ్‌లు, టాక్సీలు, ఆటో-రిక్షాల డ్రైవర్లు తప్పనిసరిగా యూనిఫాం ధరించాలని.. డాక్యుమెంట్ నిబంధనలకు లోబడి ఉండాలన్నారు. రైడ్‌ను తిరస్కరిస్తే రూ. 500 ఫైన్ వేస్తామని తెలిపారు. ఓవర్ స్పీడ్, రాంగ్ రూట్లు, సిగ్నల్ జంపింగ్, ర్యాష్ డ్రైవింగ్, హెల్మెట్‌లెస్ రైడింగ్ చేసేవారిని ప్రత్యేక కెమెరాల ద్వారా గుర్తిస్తామన్నారు. సరైన డాక్యుమెంటేషన్ లేని, నంబర్ ప్లేట్లు లేని వాహనాలను  తాత్కాలికంగా సీజ్ చేస్తామన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి