Hyderabad company:డయాబెటిస్ రోగులకు శుభవార్త.. ఇక ఇన్సులిన్ ఇంజక్షన్ బాధ నుంచి విముక్తి.!
డయాబెటిస్ నేడు ప్రతి ఒక్కరికీ తీవ్రంగా ఎదురవుతున్న సమస్య. కుటుంబ వారసత్వం నుంచి ఆస్తులు వచ్చినట్లుగా ఈవ్యాధి సంక్రమిస్తోంది. దీనికి కారణాలు అనేకం ఉన్నప్పటికీ నివారణా మార్గాలు కూడా అన్నే ఉన్నాయి. మొదటి దశలో ఉంటే వ్యాయామం, ఆహారంలో డైట్ ఫాలో అయితే సరిపోతుంది. వ్యాధి కొంచం ముదిరితే మెడిసిన్ తప్పనిసరి. అధిక స్థాయిలో ఉంటే వారికి ఇన్సులిన్ ను రెకమెండ్ చేస్తారు డాక్టర్లు. దీంతో జీవన ఆదాయం కాస్త అప్పుగా మారిపోతుంది. పైగా రోజూ కాలు, చెయ్యి, పొట్ట

డయాబెటిస్ నేడు ప్రతి ఒక్కరికీ తీవ్రంగా ఎదురవుతున్న సమస్య. కుటుంబ వారసత్వం నుంచి ఆస్తులు వచ్చినట్లుగా ఈవ్యాధి సంక్రమిస్తోంది. దీనికి కారణాలు అనేకం ఉన్నప్పటికీ నివారణా మార్గాలు కూడా అన్నే ఉన్నాయి. మొదటి దశలో ఉంటే వ్యాయామం, ఆహారంలో డైట్ ఫాలో అయితే సరిపోతుంది. వ్యాధి కొంచం ముదిరితే మెడిసిన్ తప్పనిసరి. అధిక స్థాయిలో ఉంటే వారికి ఇన్సులిన్ ను రెకమెండ్ చేస్తారు డాక్టర్లు. దీంతో జీవన ఆదాయం కాస్త అప్పుగా మారిపోతుంది. పైగా రోజూ కాలు, చెయ్యి, పొట్ట భాగంలోని కండరాలకు ఇంజక్షన్ చేసుకోవాలి. దినదిన గండం నూరేళ్ల ఆయుష్షు అన్న చందంగా మరిపోయింది నేడి డయాబెటిక్ పేషెంట్ల తీరు. అయితే కొత్తగా అందుబాటులోకి రానున్న ప్రత్యమ్నాయ మార్గాలతో ఇన్సులిన్ ఇంజక్షన్ నొప్పి నుంచి విముక్తి కలగనుంది. ఆ సరికొత్త విధానం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
సాధారణంగా బీపీ, షుగర్ వ్యాధులు నేటి సమాజంలో అధికంగా కనిపిస్తున్నాయి. ఈ వ్యాధిగ్రస్తుల్లో సగం మంది ఇన్సులిన్ ద్వారా షుగర్ వ్యాధిని నియంత్రణలోకి తెచ్చుకుంటున్నారు. దీని స్థానంలో నోటితో, ముక్కు ద్వారా మెడిసిన్‌ను లోపలికి పీల్చుకునే పరికరాన్ని తయారుచేస్తున్నారు. హైదరాబాద్‌కి చెందిన నీడిల్ ఫ్రీ టెక్నాలజీస్, ఏపీఐ ఫార్ములేషన్స్ సౌకర్యంతో మధుమేహాన్ని నియంత్రించే మార్గాన్ని కనుగొంటున్నారు. దీనిని ఓజులిన్ స్ప్రేగా పేర్కొన్నారు. 2025-26 నాటికల్లా మార్కెట్లోకి తమ సేవలను అందించాలనే లక్ష్యంతో ప్రణాళికలు రచిస్తున్నారు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకు భారీ ఉపశమనం లభించినట్లైంది. క్యాన్సర్‌తో పాటూ ఆల్జీమర్స్ వంటి వ్యాధులకు కూడా ఇదే తరహాలో మెడికేషన్ అందించేందుకు సిద్దమైంది. ఈ విషయాన్ని స్వయంగా నీడిల్ ఫ్రీ డైరెక్టర్ డాక్టర్ కె. కోటేశ్వరరావు ప్రకటించారు. డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నొప్పిలేకుండా ఉండటమే కాకుండా మరింత సౌకర్యవంతంగా ఉంటుందని ఆయన అన్నారు.
పాలమూరు బయోసైన్సెస్ ఆధ్వర్యంలో నోటి ఇన్సులిన్ సానుకూల ఫలితాలను ఇచ్చాయని ఇటీవల ముగిసిన కుక్కల అధ్యయనంలో వెల్లడైనట్లు తెలిపారు. అవసరమైనంత మోతాదులో ద్రవరూపంలో స్ప్రేని నోటిలోకి పంపిచేందుకు వీలు పడుతుంది. ప్రపంచవ్యాప్తంగా డయాబెటిస్ ద్వారా వచ్చిన మొత్తం ఆదాయం రూ. 6,24,000 కోట్లుగా పేర్కొన్నారు. ఇది టైప్ 1, టైప్ 2 డయాబెటిస్ ద్వారా వచ్చిన ఆదాయమని వివరించారు. మధుమేహం ద్వారా ప్రపంచ పెట్ కేర్ మార్కెట్ 2022లో దాదాపు రూ. 16వేల కోట్లు ఖర్చు చేసినట్లుగా అంచనా వేసింది. ఈ విప్లవాత్మక ప్రయోగాన్ని ట్రాన్స్ జీన్ బయోటెక్ లిమిటెడ్ రెండు దశాబ్దాల క్రితమే ప్రారంభించినట్లు స్పష్టం చేసింది. ఈ ప్రాజెక్టును ఇటీవల నీడిల్ ఫ్రీ కంపెనీ చేపట్టినట్లు వెల్లడించింది.
మరిన్ని తాజా ఆరోగ్య కథనాల కోసం క్లిక్ చేయండి.