AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IIT-BHU Student Molestation: బెనారస్‌ హిందూ వర్సిటీలో విద్యార్ధినిపై ఆఘాయిత్యం.. బట్టలు విప్పించి, వీడియోలు చిత్రించి..

వారణాసిలోని ఐఐటీ-బీహెచ్‌యూకి చెందిన విద్యార్ధిని బుధవారం రాత్రి స్నేహితుడితో కలిసి హాస్టల్‌కు సమీపంలోని కర్మన్‌బాబా ఆలయం వద్దకు వెళ్లింది. అప్పుడే ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు బైక్‌పై అక్కడికి వచ్చారు. గురువారం తెల్లవారుజామున విద్యార్థిని తన స్నేహితుడితో కలిసి హాస్టల్ నుంచి బయటకు వెళ్తున్న క్రమంలో క్యాంపస్‌లోకి బైక్‌పై వచ్చిన ఆ ముగ్గురు ఆకతాయిలు విద్యార్ధిని వేధింపులకు గురిచేశారు. బైక్‌పై వచ్చిన ముగ్గురు వ్యక్తులు ఆమెను అడ్డుకుని, స్నేహితులతో వెళ్తున్న తనను వారి నుంచి వేరుపరచి..

IIT-BHU Student Molestation: బెనారస్‌ హిందూ వర్సిటీలో విద్యార్ధినిపై ఆఘాయిత్యం.. బట్టలు విప్పించి, వీడియోలు చిత్రించి..
IIT-BHU Student Molestation Case
Srilakshmi C
|

Updated on: Nov 03, 2023 | 10:45 AM

Share

వారణాసి, నవంబర్‌ 3: బెనారస్‌ హిందూ యూనివర్సిటీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. విద్యార్థినిపై కొందరు ఆకతాయిలు అఘాయిత్యానికి పాల్పడ్డారు. బైక్‌పై వచ్చిన ముగ్గురు దుండగులు విద్యార్థినిని వేధించడంతోపాటు బట్టలు విప్పించి, వీడియోలు చిత్రీకరించారు. ఐఐటీ–బీహెచ్‌యూలో చోటుచేసుకున్న ఈ అమానుష ఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. దీంతో వందలాది మంది విద్యార్థులు ఆందోళనకు దిగారు. వారణాసిలోని ఐఐటీ-బీహెచ్‌యూ గురువారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది.

వారణాసిలోని ఐఐటీ-బీహెచ్‌యూకి చెందిన విద్యార్ధిని బుధవారం రాత్రి స్నేహితుడితో కలిసి హాస్టల్‌కు సమీపంలోని కర్మన్‌బాబా ఆలయం వద్దకు వెళ్లింది. అప్పుడే ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు బైక్‌పై అక్కడికి వచ్చారు. గురువారం తెల్లవారుజామున విద్యార్థిని తన స్నేహితుడితో కలిసి హాస్టల్ నుంచి బయటకు వెళ్తున్న క్రమంలో క్యాంపస్‌లోకి బైక్‌పై వచ్చిన ఆ ముగ్గురు ఆకతాయిలు విద్యార్ధిని వేధింపులకు గురిచేశారు. బైక్‌పై వచ్చిన ముగ్గురు వ్యక్తులు ఆమెను అడ్డుకుని, స్నేహితులతో వెళ్తున్న తనను వారి నుంచి వేరుపరచి ఓ చోటుకు తీసుకెళ్లారు. ఆ తర్వాత వారు ఆమెను వివస్త్రను చేసి, వీడియోలు, ఫోటోలు తీశారని విద్యార్థిని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.15 నిమిషాల తర్వాత నిందితులు ఆమె ఫోన్ నంబర్ తీసుకుని, విడిచిపెట్టారని ఫిర్యాదులో వెల్లడించింది. విద్యార్థి ఫిర్యాదు ఆధారంగా ఐపీసీ సెక్షన్ 354 ప్రకారం ఉద్దేశ్యపూర్వకంగా మహిళపై దాడి చేసి, అవమానపరచడం వంటి పలు నేరాల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుల కోసం తీవ్రంగా గాలిస్తున్నట్లు తెలిపారు.

మరోవైపు ఈ ఘటనతో ఐఐటీ-బీహెచ్‌యూ అట్టుడికిపోయింది. బీహెచ్‌యూ విద్యార్థులు క్యాంపస్‌లోని స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్ వద్ద గుమిగూడి నిరసన తెలిపారు. ఈ ఘటనలో బయటి వ్యక్తుల ప్రమేయం ఉందని, బయటి వ్యక్తులు క్యాంపస్‌లోకి ప్రవేశించకుండా నిషేధించాలని డిమాండ్ చేశారు. క్యాంపస్‌ను ఐఐటీ క్యాంపస్ నుంచి వేరు చేయాలని డిమాండ్ చేశారు. దీంతో పాటు సీసీటీవీ కెమెరాలు, సజావుగా పనిచేయని ఎలక్ట్రిసిటీపై విద్యార్థులు మెమోరాండం కూడా ఇచ్చారు. డీసీపీ ఆర్‌ఎస్ గౌతమ్ మాట్లాడుతూ.. నిందితులను పట్టుకునేందుకు ఓ బృందాన్ని ఏర్పాటు చేశామన్నారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా వారిని పట్టుకునేందుకు యత్నిస్తున్నట్లు తెలిపారు. వేధింపులకు గురైన విద్యార్థిని వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే చర్యలు తీసుకుంటామని డీసీపీ మీడియాకు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.