Viral: రక్తపుమడుగులో ఫిల్మ్‌మేకర్.. కెమెరా, మొబైల్‌ ఫోన్ చోరీ.! చోద్యం చూసిన జనం..

Viral: రక్తపుమడుగులో ఫిల్మ్‌మేకర్.. కెమెరా, మొబైల్‌ ఫోన్ చోరీ.! చోద్యం చూసిన జనం..

Anil kumar poka

|

Updated on: Nov 03, 2023 | 12:23 PM

సభ్య సమాజం తలదించుకునే ఘటన ఢిల్లీలో జరిగింది. ఓ ద్విచక్ర వాహనదారుడు ప్రమాదానికి గురై రోడ్డుపై రక్తపు మడుగులో పడి ఉన్నాడు. చుట్టూ ఉన్న జనం అతడిని ఆసుపత్రికి తరలించడమో, పోలీసులకు సమాచారం అందించడమో చేయకుండా చోద్యం చూస్తూ వీడియోలు తీశారు. అంతటితో ఆగలేదు. అతడి ‘గోప్రో’ను చోరీ చేసి తీసుకెళ్లిపోయారు. సౌత్ ఢిల్లీలో జరిగిందీ ఘటన.

సభ్య సమాజం తలదించుకునే ఘటన ఢిల్లీలో జరిగింది. ఓ ద్విచక్ర వాహనదారుడు ప్రమాదానికి గురై రోడ్డుపై రక్తపు మడుగులో పడి ఉన్నాడు. చుట్టూ ఉన్న జనం అతడిని ఆసుపత్రికి తరలించడమో, పోలీసులకు సమాచారం అందించడమో చేయకుండా చోద్యం చూస్తూ వీడియోలు తీశారు. అంతటితో ఆగలేదు. అతడి ‘గోప్రో’ను చోరీ చేసి తీసుకెళ్లిపోయారు. సౌత్ ఢిల్లీలో జరిగిందీ ఘటన. బాధితుడిని డాక్యుమెంటరీ ఫిల్మ్ ‌మేకర్ పీయూష్ పాల్‌గా గుర్తించారు. తీవ్రంగా గాయపడిన పీయూష్.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. అక్టోబరు 28న రాత్రి 10 గంటల సమయంలో జరిగిందీ ఘటన. ఘటనా స్థలంలో ఉన్న సీసీటీవీ కెమెరాలో ఈ యాక్సిడెంట్ రికార్డైంది. పంచశీల్ ఎన్‌క్లేవ్ సమీపంలో పీయూష్ బైక్‌ పై వెళ్తుండగా వెనక నుంచి వచ్చిన మరో బైక్ ఢీకొట్టింది. దీంతో పీయూష్ అల్లంత దూరం ఎగిరిపడ్డాడు. గురుగ్రామ్‌లో ఫ్రీలాన్స్ ఫిల్మ్ మేకర్‌గా పీయూష్ పనిచేస్తున్నాడు. ప్రమాదం జరిగిన వెంటనే చుట్టుపక్కలవారు స్పందించి ఉంటే ఆయన బతికి ఉండేవాడని పీయూష్ స్నేహితుడు తెలిపారు. రక్తమోడుతూ రోడ్డుపై విలవిల్లాడుతున్న పీయూష్ చుట్టూ మూగిన జనం ఫొటోలు, వీడియోలు తీయడంలో మునిగిపోయారని ఆవేదన వ్యక్తంచేశాడు. దాదాపు 20 నిమిషాలపాటు పీయూష్ అలాగే రోడ్డుపై పడి వున్నాడని, ఆయన శరీరంలోని రక్తం మొత్తం పోయిందని అన్నారు.. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా వెనక నుంచి వచ్చి పీయూష్‌ను బైక్ ను ఢీకొట్టిన బైకర్‌‌ను బంటీగా గుర్తించారు పోలీసులు. ఈ విషయంలో సీసీటీవీ ఫుటేజ్ వారికి ఉపయోగపడింది. అందుకే ర్యాష్‌ డ్రైవింగ్ కింద బంటీపై పోలీసులు కేసు నమోదు చేశారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.

Published on: Nov 03, 2023 09:34 AM