Sultanabad: శభాష్ భాగ్య.! స్ఫూర్తిగా నిలిచినా మహిళా.. ఇంటింటికి వాహనం నడుపుతూ..
మున్సిపాలిటీ చెత్త బండిని డ్రైవింగ్ చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది ఓ మహిళ డ్రైవర్. ఇంటింటికీ తిరుగుతూ చెత్తను సేకరించి, ప్రజలను రోగాల బారిన పడకుండా కాపాడుతోంది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపాలిటీ లోని పలు వార్డుల్లో తెల్లవారు జామునే చెత్త బండి వచ్చిందమ్మా.... చెత్తను బండికి ఇవ్వండమ్మా.. మీ పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోండి అంటూ మైక్ లో సౌండ్ చేస్తూ వాడవాడల తిరుగుతూ అందరి ఇంటి నుండి చెత్తను..
మున్సిపాలిటీ చెత్త బండిని డ్రైవింగ్ చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది ఓ మహిళ డ్రైవర్. ఇంటింటికీ తిరుగుతూ చెత్తను సేకరించి, ప్రజలను రోగాల బారిన పడకుండా కాపాడుతోంది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపాలిటీ లోని పలు వార్డుల్లో తెల్లవారు జామునే చెత్త బండి వచ్చిందమ్మా.. చెత్తను బండికి ఇవ్వండమ్మా.. మీ పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోండి అంటూ మైక్ లో సౌండ్ చేస్తూ వాడవాడల తిరుగుతూ అందరి ఇంటి నుండి చెత్తను సేకరించి డంపింగ్ యార్డ్ కు తీసుకెళ్తుంది సుల్తానాబాద్ మండలం గర్రెపల్లికి చెందిన భాగ్య. భాగ్య వరంగల్ జిల్లాలో ఇదే చెత్త సేకరణలో గతంలో పనిచేసింది, ఐదు సంవత్సరాల క్రితం డ్రైవింగ్ నేర్చుకుంది, అప్పటినుండి ఇప్పటివరకు ఉదయం ప్రతి ఇంటి నుండి చెత్తను సేకరిస్తూ చెత్త వాహనాన్ని తానే డ్రైవ్ చేస్తూ, అందరిని ఆశ్చర్యపరుస్తోంది భాగ్య. ఆమె పని తీరును చూసి అందరూ భాగ్యను శభాష్ భాగ్య అంటున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos