అప్పట్లో పుష్ప.. ఇప్పుడు క్రికెట్ బుకీ.! విశాఖ పోలీసులకు చిక్కిన బెట్టింగ్ డాన్..
నెల్లూరు జిల్లా వాసి మాగుంట విశ్వనాథరెడ్డి.. పాత నేరస్థుడు. గతంలో ఎర్ర చందనం స్మగ్లింగ్ తో పాటు అనేక నేరాల్లో నిందితుడుగా ఉన్నాడు. అటవీ శాఖ అధికారులపై దాడికి ప్రయత్నించాడన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. చాలా సార్లు జైలుకు కూడా వెళ్లొచ్చాడు. నెల్లూరులో ఉంటూ రాయలసీమ జిల్లాల్లో నేరాలు చేస్తూ ఉండేవాడు. ఇప్పుడు.. కాస్త రూట్ మార్చాడు. ఎర్రచందనం స్మగ్లింగ్‌లకు బదులు క్రికెట్ బెట్టింగ్‌ల వైపు దృష్టి సారించాడు.
నెల్లూరు జిల్లా వాసి మాగుంట విశ్వనాథరెడ్డి.. పాత నేరస్థుడు. గతంలో ఎర్ర చందనం స్మగ్లింగ్ తో పాటు అనేక నేరాల్లో నిందితుడుగా ఉన్నాడు. అటవీ శాఖ అధికారులపై దాడికి ప్రయత్నించాడన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. చాలా సార్లు జైలుకు కూడా వెళ్లొచ్చాడు. నెల్లూరులో ఉంటూ రాయలసీమ జిల్లాల్లో నేరాలు చేస్తూ ఉండేవాడు. ఇప్పుడు.. కాస్త రూట్ మార్చాడు. ఎర్రచందనం స్మగ్లింగ్‌లకు బదులు క్రికెట్ బెట్టింగ్‌ల వైపు దృష్టి సారించాడు. మకాం నెల్లూరు నుంచి విశాఖకు మార్చాడు. క్రికెట్ వరల్డ్ కప్ నేపథ్యంలో.. విశాఖలో వాలిపోయిన ఈ మాగుంట విశ్వనాథరెడ్డి.. చీపురుపల్లి కి చెందిన లండ రామకృష్ణ, నెల్లూరుకు చెందిన ఎస్‌కె సంధాని భాషా లను అసిస్టెంట్లుగా పెట్టుకున్నాడు. విశాఖలోని బిర్లా ప్రాంతంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు. ప్రధాన బుకీగా క్రిక్ ఎక్స్చేంజిలో చూపిన రేటింగ్ ఆధారంగా లైవ్ గురు అప్లికేషన్ తో బెట్టింగ్ వ్యవహారాలు నడిపించాడు. ప్లే, ఈట్ అనే కోడ్ లాంగ్వేజ్ ద్వారా పంటర్లకు తక్కువ లాభం వచ్చేలా.. నిర్వాహకులు ఓడిపోయినప్పటికీ ఎక్కువ లాభం వచ్చేలా ప్లాన్ చేసుకొని సంపాదించాడు. ఇలా రోజు లక్షల్లో వ్యవహారం చెక్కబెట్టాడు. వరల్డ్ కప్ నేపథ్యంలో క్రికెట్ బెట్టింగులపై కూపీ లాగిన పోలీసులకు.. కీలక సమాచారం అందింది. దీంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు మాగుంట ఇంటిపై దాడులు చేశారు. రెడ్ హ్యాండెడ్ గా ముగ్గురు పట్టుబడిపోయారు. వారి నుంచి సెల్ ఫోన్లు లాప్ టాప్ లతో పాటు బెట్టింగ్ కు వినియోగించే వస్తువులను కూడా సిజ్ చేశారు. ప్రధాన నిండితుడు మాగుంట విశ్వనాథరెడ్డికి బెంగళూరు నెల్లూరులతోపాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లోని వ్యక్తులతో లింకులు ఉన్నట్లు గుర్తించారు. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నామని విశ్వనాథరెడ్డిని కస్టడీకి తీసుకుని విచారిస్తామని పోలీసులు తెలిపారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos