Cheetah: బెంగళూరులో చిరుత కథ విషాదాంతం.! బంధించి తరలిస్తుండగా చిరుత ఏం చేసిందంటే.

Cheetah: బెంగళూరులో చిరుత కథ విషాదాంతం.! బంధించి తరలిస్తుండగా చిరుత ఏం చేసిందంటే.

Anil kumar poka

|

Updated on: Nov 03, 2023 | 9:07 AM

నాలుగు రోజులుగా బెంగళూరును హడలెత్తించిన చిరుత కథ విషాదాంతమైంది. దాన్ని పట్టుకొని, తరలించే క్రమంలో మృతి చెందింది. వైట్ ఫీల్డ్‌, బొమ్మనహళ్లి, కూడ్లు, సింగసంద్ర, సోమసుందర;i ప్రాంతాల్లో ఆదివారం నుంచి సంచరించిన చిరుత స్థానికులకు కంటి మీద కునుకు లేకుండా చేసింది. బండేపాళ్య వద్ద బుధవారం కనిపించిన చిరుతను బంధించేందుకు వెళ్లిన అటవీ శాఖ ఉద్యోగి ధనరాజ్‌పై దాడి చేసింది.

నాలుగు రోజులుగా బెంగళూరును హడలెత్తించిన చిరుత కథ విషాదాంతమైంది. దాన్ని పట్టుకొని, తరలించే క్రమంలో మృతి చెందింది. వైట్ ఫీల్డ్‌, బొమ్మనహళ్లి, కూడ్లు, సింగసంద్ర, సోమసుందర;i ప్రాంతాల్లో ఆదివారం నుంచి సంచరించిన చిరుత స్థానికులకు కంటి మీద కునుకు లేకుండా చేసింది. బండేపాళ్య వద్ద బుధవారం కనిపించిన చిరుతను బంధించేందుకు వెళ్లిన అటవీ శాఖ ఉద్యోగి ధనరాజ్‌పై దాడి చేసింది. ఆయన కాలు, పొట్ట, గొంతు భాగం వద్ద గాయాలయ్యాయి. బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. అనంతరం థర్మల్‌ డ్రోన్‌ సహాయంతో గాలించగా, బొమ్మనహళ్లి సమీపంలో ఓ లేఅవుట్లో అది ఉన్నట్లు గుర్తించారు. చిరుతపైకి మత్తు ఇంజక్షన్‌ ప్రయోగించగా రెండుసార్లు గురి తప్పింది. మూడోసారి తగిలినా, స్పృహ తప్పేందుకు 20 నిమిషాల సమయం పట్టింది. మత్తు ఇంజక్షన్‌ తగిలిన తర్వాత స్థానికంగా ఉన్న ఒక పాత భవంతిలోకి వెళ్లి తలదాచుకుంది. ఎట్టకేలకు అటవీ శాఖ సిబ్బంది చిరుతను బంధించి, బోనులోకి ఎక్కించారు. తర్వాత కొంత సమయానికే అది చనిపోయినట్లు అధికారులు తెలిపారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos