Singh Tenure: పవర్‌ఫుల్‌ డీజీపీ.. ఈ డీజీపీ హయాంలో 1000 మంది మిలిటెంట్లు హతం.!

Singh Tenure: పవర్‌ఫుల్‌ డీజీపీ.. ఈ డీజీపీ హయాంలో 1000 మంది మిలిటెంట్లు హతం.!

Anil kumar poka

|

Updated on: Nov 03, 2023 | 9:14 AM

జమ్మూ కశ్మీర్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌గా పనిచేసిన దిల్‌బాగ్‌ సింగ్‌ ఇటీవలే రిటైర్‌ అయ్యారు. అయితే, ఆయన కాలంలో జమ్మూ కశ్మీర్‌లో దాదాపు 1000 మందికిపైగా మిలిటెంట్లు హతమైనట్లు పోలీసు శాఖ తెలిపింది. నిత్యం ఎన్నో సవాళ్లు ఉండే ఆ ప్రాంతంలో ఆయన సుదీర్ఘ కాలం పనిచేశారని.. భద్రతా వ్యవస్థలో ఎన్నో మార్పులు తెచ్చారని కొనియాడింది. ‘దిల్‌బాగ్‌ సింగ్‌ పదవిలో ఉన్న కాలంలో జమ్మూ కశ్మీర్‌లో 1055 మంది ఉగ్రవాదులు హతమయ్యారు.

జమ్మూ కశ్మీర్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌గా పనిచేసిన దిల్‌బాగ్‌ సింగ్‌ ఇటీవలే రిటైర్‌ అయ్యారు. అయితే, ఆయన కాలంలో జమ్మూ కశ్మీర్‌లో దాదాపు 1000 మందికిపైగా మిలిటెంట్లు హతమైనట్లు పోలీసు శాఖ తెలిపింది. నిత్యం ఎన్నో సవాళ్లు ఉండే ఆ ప్రాంతంలో ఆయన సుదీర్ఘ కాలం పనిచేశారని.. భద్రతా వ్యవస్థలో ఎన్నో మార్పులు తెచ్చారని కొనియాడింది. ‘దిల్‌బాగ్‌ సింగ్‌ పదవిలో ఉన్న కాలంలో జమ్మూ కశ్మీర్‌లో 1055 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. 58 మంది లొంగిపోగా.. 1448 మంది మిలిటెంట్‌ మద్దతుదారులు అరెస్టయ్యారు. మాదక ద్రవ్యాల వ్యాపారంలో ఉన్న 11వేల మంది అరెస్టయ్యారు’ అని పోలీసు అధికారులు తెలిపారు. ఆయన సర్వీసులో ఉన్న కాలంలోనే సిబ్బందికి ఒక అశోకచక్ర, మూడు కీర్తిచక్ర, 13 శౌర్యచక్ర, 887 పోలీసు పతకాలు వచ్చాయన్నారు. బంద్‌లకు పిలుపునివ్వకపోవడం, విద్య, వ్యాపారాలకు ఆటంకం కలగడం వంటివి ఈ ప్రాంతంలో జరగలేదన్నారు. దాంతో జమ్మూ కశ్మీర్‌ భద్రతా పరిస్థితుల్లో మార్పులు వచ్చాయని జమ్మూ పోలీసులు అన్నారు. జమ్మూ కశ్మీర్‌ డీజీపీగా దిల్‌బాగ్‌ సింగ్‌ సెప్టెంబర్‌ 7, 2018లో బాధ్యతలు తీసుకున్నారు. అప్పటి నుంచి సుదీర్ఘ కాలం ఆ హోదాలో కొనసాగిన ఆయన.. మంగళవారం పదవీ విరమణ చేశారు. ఆయన డీజీపీగా ఉండగానే ఆర్టికల్‌ 370 రద్దు, పునర్విభజన వంటి కీలక పరిణామాలు జరిగాయి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos