క్యాషియర్‌ను కత్తితో బెదిరించి.. ఎస్‌బీఐ బ్యాంకులో రూ. 6.5 లక్షలు ఎత్తుకెళ్లాడు.!
ఆంధ్రప్రదేశ్‌లోని ఎస్బీఐ బ్రాంచీలో పగటిపూటే దోపిడీ జరిగింది. నర్సాపురం పట్టణంలో ఉన్న ఆ బ్రాంచీలోకి ఓ గుర్తు తెలియని వ్యక్తి కత్తితో క్యాష్ ఆఫీసర్‌ను బెదిరించి 6.5 లక్షలు ఎత్తుకెళ్లాడు. మాస్క్ పెట్టుకుని వచ్చిన ఆ వ్యక్తి మధ్యాహ్నం 3 గంటల సమయంలో క్యాషియర్‌ను బెదిరించి డబ్బుతో ఉడాయించాడు. క్యాష్ ఆఫీసర్ రూమ్‌కు నేరుగా వచ్చిన ఆ వ్యక్తి.. గోల్డ్ లోన్ కావాలన్న నెపంతో ఎంటర్ అయ్యాడు. ఆ తర్వాత దాచుకున్న కత్తిని తీసి ఆ ఆఫీసర్‌ను బెదిరించాడు.
ఆంధ్రప్రదేశ్‌లోని ఎస్బీఐ బ్రాంచీలో పగటిపూటే దోపిడీ జరిగింది. నర్సాపురం పట్టణంలో ఉన్న ఆ బ్రాంచీలోకి ఓ గుర్తు తెలియని వ్యక్తి కత్తితో క్యాష్ ఆఫీసర్‌ను బెదిరించి 6.5 లక్షలు ఎత్తుకెళ్లాడు. మాస్క్ పెట్టుకుని వచ్చిన ఆ వ్యక్తి మధ్యాహ్నం 3 గంటల సమయంలో క్యాషియర్‌ను బెదిరించి డబ్బుతో ఉడాయించాడు. క్యాష్ ఆఫీసర్ రూమ్‌కు నేరుగా వచ్చిన ఆ వ్యక్తి.. గోల్డ్ లోన్ కావాలన్న నెపంతో ఎంటర్ అయ్యాడు. ఆ తర్వాత దాచుకున్న కత్తిని తీసి ఆ ఆఫీసర్‌ను బెదిరించాడు. 6.5 లక్షల నగదుతో పరారీ అయినట్లు నర్సాపురం పోలీసు ఆఫీసర్ కే రవి మనోహరా చారి తెలిపారు. దోపిడీ చేసిన వ్యక్తి మాస్క్‌తో పాటు తలకు టోపీ పెట్టుకున్నట్లు పోలీసులు చెప్పారు. తన ఐడెంటిటీని దాచి పెట్టుకునేందుకు అతను క్యాప్‌తో వచ్చినట్లు అనుమానిస్తున్నారు. జోయ్‌సులా వీధి ఎస్‌బీఐ బ్యాంకులో దోపిడి చేయడానికి ముందు నిందితుడు మూడు గంటల పాటు రెక్కీ చేసినట్లు తెలుస్తోందని పోలీసులు చెప్పారు. కాగా బ్యాంకులో దోపిడీ జరిగిన సమయంలో ముగ్గురు మహిళలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. క్యాష్ ఆఫీసర్, అటెండెంట్‌తో పాటు మరో మహిళా ఆఫీసర్ తన క్యాబిన్‌లో ఉన్నారు. ఆ సమయంలో బ్యాంకు మేనేజర్ బ్యాంకులో లేరు. దోపిడీ చేసిన వ్యక్తి పై ఐపీసీ 392 సెక్షన్ కింద కేసు బుక్ చేసి అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.
రోడ్డు మీద దీపం పెట్టిన భారతీయ మహిళ.. క్షుద్రపూజ జరిగిందా?
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్‌లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?

