YS Sharmila: మళ్లీ తెరపైకి పొత్తు పంచాయితీ.. కాంగ్రెస్ ప్రతిపాదనకు షర్మిల ‘సై’ అంటారా..?
తెలంగాణలో వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు ఎన్నికల బరిలో ఒంటరిగా పోటీ చేయనున్న విషయం మనకు తెలిసిందే. ఇందులో భాగంగా కొన్ని స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులను కూడా సిద్దం చేసుకున్నట్లు సమాచారం. గతంలో కాంగ్రెస్‌లో పార్టీని విలీనం చేసేందుకు ముందుకు వచ్చినప్పటికీ ఢిల్లీ పెద్దల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు. నేడు మళ్ళీ కాంగ్రెస్ నేతలు షర్మిలతో కాసేపట్లో లోటస్ పాండ్‌లో భేటీ కానున్నారు. ఎన్నికల్లో వైఎస్ఆర్టీపీ పోటీ

తెలంగాణలో వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు ఎన్నికల బరిలో ఒంటరిగా పోటీ చేయనున్న విషయం మనకు తెలిసిందే. ఇందులో భాగంగా కొన్ని స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులను కూడా సిద్దం చేసుకున్నట్లు సమాచారం. గతంలో కాంగ్రెస్‌లో పార్టీని విలీనం చేసేందుకు ముందుకు వచ్చినప్పటికీ ఢిల్లీ పెద్దల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు. నేడు మళ్ళీ కాంగ్రెస్ నేతలు షర్మిలతో కాసేపట్లో లోటస్ పాండ్‌లో భేటీ కానున్నారు. ఎన్నికల్లో వైఎస్ఆర్టీపీ పోటీ చేయకుండా.. కాంగ్రెస్‌కి సహకరించాలని కోరనున్న నేతలు. గతంలో పొత్తు, సయోధ్య కుదరని నేపథ్యంలో ఈ భేటీ చాలా ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ నేతలతో చర్చించిన తరువాత వారి ప్రతిపాదనకు షర్మిల ఎలా స్పందిస్తారు అన్నది తీవ్ర ఉత్కంఠను కలిగిస్తోంది.
తెలంగాణలో తన పార్టీని ఎలాగైనా ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు వైఎస్ తనయ షర్మిల. ఇందలో భాగంగానే వైఎస్ఆర్టీపీని స్థాపించారు. గత కొన్నేళ్లుగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా తన గళాన్ని వినిసిస్తూ వచ్చారు. అయితే గత కొంత కాలం క్రితం కాంగ్రెస్లో తన పార్టీని విలీనం చేస్తారని జోరుగా ప్రచారంతో పాటూ పావులుకూడా కదిపారు. కానీ అవన్నీ ఆశించినంత మేర సఫలం అవ్వలేదు. దీంతో తానే సొంతంగా తెలంగాణ ఎన్నికల బరిలో దిగాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగానే గతంలో పార్టీ నేతలతో చర్చించారు. ఎక్కడ ఎవరు పోటీ చేయాలి. నియోజకవర్గాల్లో బలాబలాపై తీవ్రమైన చర్చ జరిగింది.
పాలేరు నుంచి తాను బరిలో దిగనున్నట్లు గతంలో ప్రకటించారు. అందులో భాగంగా 6న నామినేషన్ వేసేందుకు సిద్ధమయ్యారు షర్మిల. అయితే మరో వైపు నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించాలని కార్యకర్తలు ఆందోళన చేస్తున్నారు. పైగా నవంబర్ 3 నుంచి నామినేషన్ ప్రక్రియ ప్రారంభమవుతున్న తరుణంలో కాంగ్రెస్ నేతలు షర్మిలను కలవడం హాట్ టాపిక్‌గా మారింది. ఆమెను ఎన్నికల బరిలో దిగకుండా తమ పార్టీకి మద్దతు ఇచ్చేలా చూడాలని కోరనున్నారు కాంగ్రెస్ నేతలు. ఓట్లు చీలిపోకుండా షర్మిలతో కాంగ్రెస్ నేతల చర్చలు జరుపనున్నట్లు సమాచారం.
ఇదిలా ఉంటే పాలేరు బరిలో కాంగ్రెస్ నుంచి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పోటీ చేస్తున్నారు. షర్మిల కుటుంబంతో ఆయనకు సత్సంబంధాలు ఉన్నాయి. నేడు కాంగ్రెస్ నేతలతో చర్చల అనంతరం షర్మిల మీడియా సమావేశం ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఎన్నికల్లో పోటీపై షర్మిల క్లారిటీ ఇవ్వనున్నట్లు సమాచారం. అయితే కాంగ్రెస్‌లో తన పార్టీ విలీనం చేస్తుందా.. లేకుంటే ఒంటరిగా బరిలో దిగుతుందా తెలియాలంటే మరి కొన్ని గంటలు వేచి చూడక తప్పదు.
మరిన్ని తెలంగాణ ఎన్నికల వార్తల కోసం..