Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Elections: కొన్నాళ్లుగా సైలెంట్‌ మోడ్‌లో వైఎస్‌ షర్మిల.. కాంగ్రెస్‌తో కలిసి పనిచేసేలా..

కొన్ని రోజులుగా ఆమె యాక్టివ్‌ మోడ్‌లో లేకపోవడంతో కేడర్‌ అంతా కన్ఫ్యూజన్‌లో ఉన్నారట. అసలు ఈ ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌టీపీ పోటీ చేస్తుందా..? కాంగ్రెస్‌ నేతలు ఇచ్చిన సలహాతో సైలెంట్‌గా ఉండాలని డిసైడైపోయారా? ఇంతకీ..షర్మిల మనస్సులో ఏముంది..? అవును.. వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల కొన్ని రోజులుగా నిజంగానే సైలెంట్ మోడ్‌లో ఉన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం..పార్టీ గుర్తు కేటాయించిన తర్వాత ఇక ఆమె ఎన్నికల రణ రంగంలోకి దూకేస్తారని అంతా భావించారు.

Telangana Elections: కొన్నాళ్లుగా సైలెంట్‌ మోడ్‌లో వైఎస్‌ షర్మిల.. కాంగ్రెస్‌తో కలిసి పనిచేసేలా..
Sharmila
Follow us
Sanjay Kasula

|

Updated on: Nov 03, 2023 | 8:53 AM

వైఎస్‌ షర్మిల సైలెంట్‌ మోడ్‌లోకి వెళ్లిపోయారా..? కొన్ని రోజులుగా ఆమె యాక్టివ్‌ మోడ్‌లో లేకపోవడంతో కేడర్‌ అంతా కన్ఫ్యూజన్‌లో ఉన్నారట. అసలు ఈ ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌టీపీ పోటీ చేస్తుందా..? కాంగ్రెస్‌ నేతలు ఇచ్చిన సలహాతో సైలెంట్‌గా ఉండాలని డిసైడైపోయారా? ఇంతకీ..షర్మిల మనస్సులో ఏముంది..? అవును.. వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల కొన్ని రోజులుగా నిజంగానే సైలెంట్ మోడ్‌లో ఉన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం..పార్టీ గుర్తు కేటాయించిన తర్వాత ఇక ఆమె ఎన్నికల రణ రంగంలోకి దూకేస్తారని అంతా భావించారు.

కానీ.. కేడర్‌ ఊహించినంతా వేగంగా ఎక్కడా ఆమె కనిపించలేదట. అంతేకాదు..కనీసం ప్రెస్‌మీట్‌ కూడా పెట్టలేదు. కాంగ్రెస్‌ పార్టీలో విలీనం లేదని క్లారిటీ వచ్చాక ఆమె రాష్ట్ర కార్యవర్గం సమావేశం ఏర్పాటు చేశారు. కార్యకర్తలు, అభిమానుల కోరిక మేరకు రెండు చోట్ల నుంచి పోటీ చేస్తానని షర్మిల ప్రకటించారు. కానీ ఆ తర్వాతే..అసలు పోటీ చేయాలా..? వద్దా? అనే డైలామాలో ఉండిపోయారట షర్మిల.

ఆశించిన స్థాయిలో ముందుకు రాని అభ్యర్థులు!

తెలంగాణలోని మొత్తం 119 నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులను బరిలో దించాలని మొదట షర్మిల భావించారు. అయితే ఆమె ఆశించిన స్థాయిలో అభ్యర్థులు ఎవరు ముందుకు రాలేదట. కొందరు పోటీ చేస్తామని ముందుకొచ్చినప్పటికీ.. ఎవరికంటే వారికి టికెట్లు ఇస్తే..కనీసం చెప్పుకోదగ్గ ఓట్లు కూడా రాకపోతే తన ఇమేజ్‌ డ్యామేజ్‌ అవుతుందని షర్మిల భావించారట. దాంతో ఆమె అభ్యర్థులను నిలిపే విషయంలో కాస్తా ఆలోచనలో పడినట్లు సమాచారం.

పాలేరు పోటీ చేయాలని భావించిన షర్మిల

ఇక ఖమ్మంజిల్లా పాలేరు నుంచి పోటీ చేయాలని వైఎస్‌ షర్మిల మొదటి నుంచి భావిస్తున్నారు. అందుకోసం గత రెండేళ్ల నుంచి గ్రౌండ్‌ వర్క్‌ ప్రిపేర్‌ చేసుకున్నారు. కేడర్‌ను కూడా ఎప్పటికప్పుడూ కలుస్తూ ..పోటీలో ఉంటానని భరోసా ఇస్తూ వచ్చారు. ఇక నామినేషన్‌ కూడా వేయడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం ఉంది. అయితే అధికారికంగా స్పష్టత రాలేదు. అటు వైఎస్‌ఆర్‌ అభిమాని, ఈ మధ్యే కాంగ్రెస్‌లో చేరిన పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కూడా మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో పాలేరు నుంచి బరిలో దిగుతున్నారు.

పొంగులేటికి, వైఎస్‌ షర్మిలకు మధ్య సత్సంబంధాలు ఉన్నాయి. దాంతో పాలేరు నుంచి వైఎస్‌ షర్మిలను పోటీ చేయవద్దని కొందరు సన్నిహితులు చెప్పినట్లు సమాచారం. అదే సమయంలో షర్మిల మిర్యాలగూడ నుంచి పోటీ చేయాలని చెబుతున్నారట. అదీ కాకపోతే..సికింద్రాబాద్‌ నుంచి బరిలో దిగాలని సలహాలు ఇస్తున్నారట. అయితే దీనిపై ఇంకా ఆమె ఓ క్లారిటీకి రాలేదని తెలుస్తోంది.

అధికారంలోకి వస్తే ఎంపీ పదవి, మరో కీలక పదవి ఇస్తామని ఆశ

మరోవైపు వైఎస్‌ షర్మిలకు కొందరు కాంగ్రెస్‌ నేతలు సలహాలు ఇస్తున్నారట. ఈ ఎన్నికలు అయ్యిపోయే వరకూ సైలెంట్‌గా ఉండాలని చెబుతున్నారట. ఎన్నికల్లో పోటీ చేయకుండా సైలెంట్‌గా ఉంటే…ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక ఎంపీ లేదా మరో కీలక పదవి ఇస్తామని చెబుతున్నారట. అటు కాంగ్రెస్‌ పెద్దలతో వైఎస్‌ షర్మిల మళ్లీ టచ్‌లోకి వచ్చినట్లు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్‌ టీవీ9 బిగ్‌న్యూస్‌ బిగ్‌డిబేట్‌లో స్పష్టం చేశారు. కాంగ్రెస్‌తో కలిసి షర్మిల పనిచేసేలా ప్రయత్నాలు జరుగుతున్నాయని అద్దంకి దయాకర్‌ చెప్పారు.

బలమైన సెగ్మెంట్లలో బరిలో అభ్యర్థులను నిలపాలని ప్లాన్‌!

వైఎస్‌ షర్మిల కాంగ్రెస్‌తో కలిసి పని చేస్తారా? లేదా అనే విషయాన్ని పక్కన పెడితే..ఈ ఎన్నికల్లో కొన్ని స్థానాల్లో మాత్రం పోటీ చేసే యోచనలో ఉన్నట్లు విశ్వనీయ సమాచారం. వైఎస్సార్‌ అభిమానులు పెద్దసంఖ్యలో ఉన్న కొన్ని బలమైన సెగ్మెంట్లలో అభ్యర్థులను బరిలో దింపాలని ప్లాన్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి నల్లగొండజిల్లాల్లో కాంగ్రెస్‌కు పట్టున్న స్థానాలే లక్ష్యంగా ముందుకెళ్లాలని భావిస్తున్నారట. ఎన్నికల టైమ్‌ దగ్గరపడేకొద్దీ..ఇప్పటివరకూ ఒక్క లిస్టు కూడా ఆమె ప్రకటించలేదు. రెండు మూడు నెలలుగా సైలెంట్‌గానే ఉన్నా షర్మిల..ఇప్పటివరకూ ఓ ప్రెస్‌మీట్‌ కూడా పెట్టలేదు. అలాంటిది..ఎప్పుడు అభ్యర్థులను ఖరారు చేస్తారు.. ఎప్పుడు ప్రకటిస్తారు..? అని కేడర్‌ అంతా అయోమయంలో ఉందట.

ఇక ఇవాళ్టి నుంచే నామినేషన్‌ల పర్వం కూడా మొదలవుతుంది. మరి..షర్మిల అభ్యర్థుల జాబితాను ప్రకటించి, బరిలో దించుతారా..? లేక సైలెంట్‌గా ఉండిపోతారా? వేచి చూడాలి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..