Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Election 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల.. తొలి నామినేషన్ ఎవరు వేశారంటే..

నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. నామినేషన్ల స్వీకరణ కోసం 119 నియోజకవర్గాల్లో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు అధికారులు. ఈరోజు నుంచి నవంబర్‌ పది వరకు నామినేషన్ల ప్రక్రియ సాగనుంది. ఈనెల 13న నామినేషన్ల పరిశీలన చేస్తారు. ఈనెల 15వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. ఇక, ఈనెల 30న పోలింగ్‌ నిర్వహించి, డిసెంబర్‌ 3న ఓట్ల లెక్కింపు చేపడతారు. అయితే, ఖమ్మంలో నామినేషన్‌ దాఖలు చేశారు కాంగ్రెస్‌ అభ్యర్ధి తుమ్మల నాగేశ్వరరావు.

Telangana Election 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల.. తొలి నామినేషన్ ఎవరు వేశారంటే..
Election Commission of India
Follow us
Sanjay Kasula

|

Updated on: Nov 03, 2023 | 12:16 PM

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్‌ రిలీజైంది. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. నామినేషన్ల స్వీకరణ కోసం 119 నియోజకవర్గాల్లో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు అధికారులు. ఈరోజు నుంచి నవంబర్‌ పది వరకు నామినేషన్ల ప్రక్రియ సాగనుంది. ఈనెల 13న నామినేషన్ల పరిశీలన చేస్తారు. ఈనెల 15వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. ఇక, ఈనెల 30న పోలింగ్‌ నిర్వహించి, డిసెంబర్‌ 3న ఓట్ల లెక్కింపు చేపడతారు.

ఇవాళ్టి నుంచి ఈనెల 10వరకు మొత్తం 8రోజులపాటు నామినేషన్ల ప్రక్రియ సాగనుంది. దాంతో, శుభ ముహూర్తాల కోసం పండితులను ఆశ్రయిస్తున్నారు అభ్యర్ధులు. ఏ రోజు, ఎప్పుడు నామినేషన్‌ దాఖలు చేస్తే మంచిదో తెలుసుకుంటున్నారు. అయితే, ఈ ఎనిమిది రోజుల్లో కేవలం నాలుగు తేదీల్లోనే మంచి ముహూర్తాలు ఉన్నాయంటున్నారు పండితులు. ఈరోజు, రేపు… అలాగే 8, 9 తేదీల్లో నామినేషన్లు దాఖలు చేసుకుంటే మంచిదంటున్నారు.

తొలి రోజు నుంచే అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించడం ప్రారంభమయ్యింది. నవంబర్ 30న ఎన్నికలు జరగనుండగా.. ప్రచారానికి సంబంధించి అధికార బీఆర్‌ఎస్ ఇతరులకన్నా ముందున్నప్పటికీ అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి.

ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించింది బీఆర్‌ఎస్‌. బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు మూడు అసెంబ్లీ సెగ్మెంట్లలో రోజుకు మూడు సమావేశాల్లో ప్రసంగించడంతో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించింది. బీజేపీ తన అభ్యర్థుల మూడో జాబితాను గురువారం విడుదల చేయగా.. మరో రెండు మూడు రోజుల్లో కాంగ్రెస్ తన తదుపరి జాబితాను ప్రకటించనుంది. కాంగ్రెస్‌తో ఎన్నికల పొత్తు ఒప్పందం కుదరకపోవడంతో సీపీఎం ఒంటరిగానే పోటీ చేయాలని నిర్ణయించుకుంది.

రాహుల్ గాంధీ సహా కాంగ్రెస్ అగ్రనేతలు రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఇతర నేతలు రానున్న రోజుల్లో బీజేపీ తరఫున ప్రచారం చేయనున్నారు.

తొలి నామినేషన్‌ దాఖలు…

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తొలి నామినేషన్‌ దాఖలైంది. ఖమ్మంలో నామినేషన్‌ దాఖలు చేశారు కాంగ్రెస్‌ అభ్యర్ధి తుమ్మల నాగేశ్వరరావు. నామినేషన్‌ ప్రక్రియ మొదలైన వెంటనే ఖమ్మం మున్సిపల్‌ ఆఫీస్‌కి వచ్చిన తుమ్మల… రిటర్నింగ్‌ అధికారికి నామినేషన్‌ పత్రాలు సమర్పించారు.

చాలా సింపుల్‌గా నామినేషన్‌ ప్రక్రియ ముగించేశారు తుమ్మల నాగేశ్వరరావు. కేవలం ఐదారు మంది అనుచరులతో రెండే రెండు కార్లలో నామినేషన్‌ వేయడానికి వచ్చారు. ఎలాంటి హడావిడి లేకుండా నామినేషన్‌ దాఖలుచేసి వెళ్లారు తుమ్మల.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి