Hyderabad City Police: ఈ కొత్త వేరియంట్ రోగులకు సరైన IPC సెక్షన్లతో చికిత్స అందిస్తాం.. హైదరాబాద్ సిటీ పోలీసులు..
కరోనా మహమ్మారి నుంచి తమను తాము రక్షించుకోవడానికి అందరు మాస్కులు ధరిస్తున్నారు. ఇయితే ఇప్పుడు ఈ మాస్కులను నోటికి కాకుండా ట్రాఫిక్ చాలనలు నుంచి తప్పించుకోవడానికి ఉపయోగిస్తున్నారు...
కరోనా మహమ్మారి నుంచి తమను తాము రక్షించుకోవడానికి అందరు మాస్కులు ధరిస్తున్నారు. ఇయితే ఇప్పుడు ఈ మాస్కులను నోటికి కాకుండా ట్రాఫిక్ చాలనలు నుంచి తప్పించుకోవడానికి ఉపయోగిస్తున్నారు. నెంబర్ ప్లేట్ కనిపించకుండా మాస్క్‌తో కప్పెస్తున్నారు. ఇలా నెంబర్ ప్లేట్‌పై మాస్క్ కప్పిన వాహనం చిత్రాన్ని హైదరాబాద్ సిటీ పోలీసులు తమ అధికారిక ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ఈ చిత్రంలో ఒక వ్యక్తి హెల్మెట్ లేకుండా బైక్ నడుపుతున్నాడు. అతను హెల్మెట్ ధరించలేదు. అయితే పోలీసుల కెమెరా నుంచి తప్పించుకోవడానికి నెంబర్ ప్లేట్‌ను మాస్క్‌తో కప్పాడు. ఇలా చేస్తే “ఈ కొత్త వేరియంట్ రోగులకు సరైన IPC సెక్షన్లతో చికిత్స అందించబడుతుంది” అని పోలీసులు పోస్ట్‌లో రాసుకొచ్చారు.
— thotakura srikanth (@SrikanthAxiom) December 7, 2021
దీనిపై పలువురు నెటిజన్లు స్పందించారు. “క్వారంటైన్‌ను నివారించడానికి మీ ముఖానికి ముసుగు వేయండి, కానీ మీ నంబర్ ప్లేట్‌పై మాస్క్ మిమ్మల్ని మీ వాహనాన్ని ఎక్కువ కాలం నిర్బంధానికి (జైలు) తీసుకువెళుతుంది” అని ఒక వినియోగదారు రాశారు. “మాస్క్‌ను తప్పుడు చోట వేసే బదులు, అది ఉండాల్సిన చోట ఉంచితే మంచిది. అది ప్రాణాలను కాపాడుతుంది” అని మరొకరు రాశారు.
Yes I too saw this dangerous variant recently. It just became fashion. pic.twitter.com/J3bKqPjKq8
— Titus finny (@titusfinny) December 7, 2021
ఇటీవలి కాలంలో అనేక మంది ట్రాఫిక్ నేరస్థులు అనేక సృజనాత్మక మార్గాల్లో నంబర్ ప్లేట్‌లను కవర్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. అంకెలను కవర్ చేయడానికి బ్లాక్ టేప్‌ను ఉపయోగిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ప్లేట్‌ను కాస్త మడుస్తారు. ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న నగరవాసులను హైదరాబాద్ నగర పోలీసులు హెచ్చరిస్తున్నారు.
Read Also.. Virat Kohli: వన్డే కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీని తప్పిస్తారా.. రోహిత్ శర్మకే బాధ్యతలు అప్పగిస్తారా..