Virat Kohli: వన్డే కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీని తప్పిస్తారా.. రోహిత్ శర్మకే బాధ్యతలు అప్పగిస్తారా..
వన్డే కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీని తప్పించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. 'హిట్‌మ్యాన్' రోహిత్ ఇప్పటికే టీ20 కెప్టెన్‌గా ఉన్నందున, ODI జట్టు నాయకత్వ బాధ్యతలను రోహిత్ శర్మకు ఇవ్వాలని బీసీసీఐ యోచిస్తోంది...
వన్డే కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీని తప్పించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ‘హిట్‌మ్యాన్’ రోహిత్ ఇప్పటికే టీ20 కెప్టెన్‌గా ఉన్నందున, ODI జట్టు నాయకత్వ బాధ్యతలను రోహిత్ శర్మకు ఇవ్వాలని బీసీసీఐ యోచిస్తోంది. అయితే వన్డే కెప్టెన్సీ ‘సున్నితమైన’ విషయమని పేర్కొనట్లు సమాచారం. సెలెక్టర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇద్దరితో చర్చలు జరుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
“వన్డే కెప్టెన్సీ అనేది చాలా సున్నితమైన సమస్య. టీ20 కెప్టెన్‌గా నియమితులైన తర్వాత రోహిత్ శర్మకు మొత్తం వైట్-బాల్ క్రికెట్‌కు బాధ్యత వహించాలని ఆలోచనలు ఉన్నాయి. అయితే అందుకు సెలక్టర్లు విరాట్ కోహ్లీతో కూర్చుని చర్చలు జరుపుతున్నారు.రోహిత్‌తో కూడా చర్చించాల్సి ఉంటుంది. ఎందుకంటే అతను కూడా తన పాత్రపై స్పష్టత కోసం ప్రయత్నిస్తున్నాడు.” అని టైమ్స్ ఆఫ్ ఇండియా తెలిపింది.
భారత సెలక్షన్ కమిటీ మొదటగా దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్ కోసం జట్టును మాత్రమే ప్రకటిస్తుంది. వన్డే జట్టు తర్వాత ప్రకటిస్తారు. 2021 టీ20 వరల్డ్ కప్ తర్వాత కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. కోహ్లీ టీ20 క్రికెట్‌లో భారత జట్టు కెప్టెన్‌గా వైదొలగడమే కాకుండా IPLలో కూడా కెప్టెన్సీని వదులుకున్నాడు. IPL 2022 నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టుకు నాయకత్వం వహించడు.
Read Also.. ICC Test Rankings: ఐసీసీ టెస్ట్ ర్యాకింగ్స్లో రెండో స్థానానికి చేరిన అశ్విన్.. మెరుగైన మయాంక్ ర్యాంక్..