ICC Test Rankings: ఐసీసీ టెస్ట్ ర్యాకింగ్స్‎లో రెండో స్థానానికి చేరిన అశ్విన్.. మెరుగైన మయాంక్ ర్యాంక్..

భారత సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఐసీసీ టెస్ట్ బౌలర్ ర్యాకింగ్స్‎లో రెండో స్థానానికి చేరుకున్నాడు. ఓపెనర్ మయాంక్ అగర్వాల్, న్యూజిలాండ్ స్పిన్నర్ అజాజ్ పటేల్ కూడా బుధవారం విడుదల చేసిన ICC టెస్ట్ ర్యాంకింగ్స్‌లో తమ స్థానాలను మెరుగుపరుచుకున్నారు...

ICC Test Rankings: ఐసీసీ టెస్ట్ ర్యాకింగ్స్‎లో రెండో స్థానానికి చేరిన అశ్విన్.. మెరుగైన మయాంక్ ర్యాంక్..
Ashwin
Follow us

|

Updated on: Dec 08, 2021 | 5:04 PM

భారత సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఐసీసీ టెస్ట్ బౌలర్ ర్యాకింగ్స్‎లో రెండో స్థానానికి చేరుకున్నాడు. ఓపెనర్ మయాంక్ అగర్వాల్, న్యూజిలాండ్ స్పిన్నర్ అజాజ్ పటేల్ కూడా బుధవారం విడుదల చేసిన ICC టెస్ట్ ర్యాంకింగ్స్‌లో తమ స్థానాలను మెరుగుపరుచుకున్నారు. ముంబైలో జరిగిన రెండో టెస్టులో అగర్వాల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్నాడు. అతను మొదటి ఇన్నింగ్స్‎లో 150, రెండో ఇన్నింగ్స్‎లో 62 పరుగులు చేశాడు. బ్యాట్స్‎మెన్ ర్యాకింగ్స్‎లో 30 స్థానాలు ఎగబాకి 11వ స్థానానికి చేరుకున్నాడు. ముంబైలో జన్మించిన పటేల్, జిమ్ లేకర్, అనిల్ కుంబ్లేల రికార్డులను సమం చేశాడు. ఒక టెస్టు ఇన్నింగ్స్‌లో మొత్తం 10 వికెట్లు తీసిన మూడో ఆటగాడిగా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో 14 వికెట్లు తీసిన అజాజ్ పటేల్ 23 స్థానాలు ఎగబాకి 38వ ర్యాంక్‌కు చేరుకున్నాడు.

భారత మరో ఓపెనర్ శుభ్‌మన్ గిల్ 21 స్థానాలు ఎగబాకి 45వ ర్యాంక్‎కు చేరుకున్నాడు. ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ నాలుగు స్థానాలు ఎగబాకి 41వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. న్యూజిలాండ్ బ్యాటర్ డారిల్ మిచెల్ 26 స్థానాలు ఎగబాకి 78వ స్థానం దక్కించుకున్నాడు. ముంబై మ్యాచ్‎‎లో నాలుగు వికెట్లు తీసిన తర్వాత అశ్విన్ అగ్రశ్రేణి బౌలర్ పాట్ కమిన్స్‌కు దగ్గరగా వెళ్లాడు. అశ్విన్ 43 రేటింగ్ పాయింట్లతో మొత్తం 883 పాయింట్లు సాధించాడు. మూడో స్థానంలో ఉన్న జోష్ హేజిల్‌వుడ్ కంటే 67 పాయింట్లు ఆధిక్యంలో ఉన్నాడు. ఆల్ రౌండర్లలో అతను ఒక స్థానం ఎగబాకి రెండవ స్థానంలో నిలిచాడు. రవీంద్ర జడేజా లీడ్‌లో నాల్గో స్థానానికి పడిపోయాడు. వెస్టిండీస్‌కు చెందిన జాసన్ హోల్డర్ బౌలర్లలో 1వ స్థానానికి చేరుకున్నాడు.

వెస్టిండీస్‌ ఆటగాళ్లు క్రైగ్ బ్రాత్‌వైట్ 10 స్థానాలు ఎగబాకి 39వ ర్యాంక్‌, న్క్రుమా బోన్నర్ 17 స్థానాలు ఎగబాకి 42వ ర్యాంక్‌కు చేరుకున్నారు.శ్రీలంక అటగాడు ధనంజయ డి సిల్వా 12 స్థానాలు ఎగబాకి 21వ స్థానానికి చేరుకున్నాడు. స్పిన్నర్లు లసిత్ ఎంబుల్దేనియా, రమేష్ మెండిస్ తమ ర్యాంకులను మెరుగు పరుచుకున్నారు. లసిత్ ఎంబుల్దేనియా ఐదు స్థానాలు మెరుగుపర్చుకుని 32వ ర్యాంక్‌కు చేరుకోగా, మెండిస్ 11 వికెట్ల ప్రదర్శనతో 18 స్థానాలు ఎగబాకి 39వ స్థానానికి చేరుకున్నాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వరుసగా ఐదు, ఆరో స్థానాల్లో కొనసాగుతున్నారు.

Read Also.. Virat Kohli: గవాస్కర్, సచిన్ చేసిన పనినే కోహ్లీ చేశాడు.. అందులో తప్పేం లేదు.. ఫలితాలతో కెప్టెన్సీని అంచనా వేయడం తప్పు: రవిశాస్త్రి

Latest Articles