Virat Kohli: గవాస్కర్, సచిన్ చేసిన పనినే కోహ్లీ చేశాడు.. అందులో తప్పేం లేదు.. ఫలితాలతో కెప్టెన్సీని అంచనా వేయడం తప్పు: రవిశాస్త్రి
ఈ టోర్నీ తర్వాత పొట్టి ఫార్మాట్‌లో టీమిండియా కెప్టెన్సీ నుంచి తప్పుకుంటానని విరాట్ కోహ్లి టీ20 ప్రపంచకప్‌కు ముందే చెప్పాడు.
Indian Cricket Team: విరాట్ కోహ్లీ ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌గా పేరుగాంచాడు. తన బ్యాటింగ్‌తో ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. కానీ, కెప్టెన్‌గా తన నుంచి ఆశించిన విజయాన్ని జట్టుకు అందించలేకపోయాడు. కోహ్లి కెప్టెన్సీలో దేశానికి ఒక్క ఐసీసీ టైటిల్ కూడా అందుకోలేకపోయాడనేది కెప్టెన్‌గా ఉన్న విమర్శ. తాజాగా టీమిండియా టీ20 జట్టు కెప్టెన్సీ నుంచి కోహ్లీ తప్పుకున్నాడు. ప్రపంచకప్‌లో ఫార్మాట్ ఫార్మాట్‌లో జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించి, ఆపై వీడ్కోలు పలికాడు. కోహ్లీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి సమర్థించారు. సచిన్ టెండూల్కర్, సునీల్ గవాస్కర్‌లు తమ బ్యాటింగ్‌పై దృష్టి పెట్టడానికి కెప్టెన్సీని విడిచిపెట్టిన ఉదాహరణను శాస్త్రి ఉదహరించారు.
ఫలితాల ఆధారంగా ఒకరి పనిలో తప్పులను గుర్తించడం చాలా సులభం అని శాస్త్రి పేర్కొన్నాడు. అయితే అతని కెప్టెన్సీలో కోహ్లీ సాధించిన విజయాలు గర్వించదగినవి. శాస్త్రి ది వీక్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, “అతను చాలా గొప్ప కెప్టెన్, వ్యూహాత్మకంగా తెలివైనవాడు. ప్రజలు ఎల్లప్పుడూ ఫలితాల ఆధారంగా అంచనా వేస్తుంటారు. ఎన్ని పరుగులు సాధించారనే దానిపై లెక్కలు వేస్తుంటారు. మీరు ఆ పరుగులను ఎలా సాధించారనే దానిపై మాత్రం ఆలోచించరు. తనలో తాను చాలా మెరుగుపడ్డాడు. ఆటగాడిగా చాలా పరిణతి సాధించాడు. టీమ్‌ఇండియా కెప్టెన్‌గా ఉండటం అంత ఈజీ కాదు. అది సాధించినందుకు గర్వపడాలి” అంటూ చెప్పుకొచ్చారు.
ఉత్తమ వ్యక్తులకే ఇలా జరుగుతోంది.. బ్యాటింగ్‌పై ఎక్కువ దృష్టి పెట్టేందుకు పనిభారం కారణంగా టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు కోహ్లీ చెప్పాడు. సచిన్, గవాస్కర్ లాంటి ఆటగాళ్లు కూడా తమ బ్యాటింగ్‌పై దృష్టి పెట్టేందుకు కెప్టెన్సీని వదులుకున్నారని శాస్త్రి పేర్కొన్నాడు. “100 శాతం. ఇది ఉత్తమ వ్యక్తులకు మాత్రమే జరుగుతుంది. గవాస్కర్ తన బ్యాటింగ్‌పై దృష్టి సారించడం కోసం కెప్టెన్సీని విడిచిపెట్టినట్లు నాకు గుర్తుంది. సచిన్ టెండూల్కర్ కూడా తన కెరీర్‌ను మెరుగుపరుచుకోవడానికి ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారు’ అని తెలిపాడు.
అత్యంత విజయవంతమైన రెండవ కెప్టెన్.. టీ20ల్లో భారత్‌కు అత్యంత విజయవంతమైన రెండో కెప్టెన్‌గా కోహ్లీ నిలిచాడు. కోహ్లీ ముందు మహేంద్ర సింగ్ ధోని పేరు వస్తుంది. కోహ్లి 50 మ్యాచ్‌ల్లో టీమిండియాకు కెప్టెన్‌గా వ్యవహరించగా అందులో 30 గెలిచాడు. 16 మ్యాచ్‌ల్లో ఓడిపోయాడు. ఈ సమయంలో కోహ్లీ విజయ శాతం 64.58గా ఉంది. టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా తన చివరి మ్యాచ్‌ని నమీబియాతో ఆడింది. అందులో జట్టు విజయం సాధించింది.
Also Read: IND vs SA: కోహ్లీ సేనకు భారీ షాక్.. నలుగురు స్టార్ ప్లేయర్లకు గాయాలు.. దక్షిణాఫ్రికా టూర్‌కు డౌటే?