Indian Cricket Team: రిటైర్మెంట్ ప్రకటించనున్న మరో టీమిండియా ప్లేయర్? ఐపీఎల్‌లో కొత్త అవతారానికి సిద్ధమైన స్టార్ స్పిన్నర్..!

IPL 2022: మిండియా స్పిన్నర్‌‌ హర్భజన్‌‌ సింగ్‌‌ త్వరలో అన్ని ఫార్మాట్ల క్రికెట్‌‌కు రిటైర్మెంట్‌‌ ప్రకటించనున్నాడు. ప్లేయర్‌‌గా కాంపిటీటివ్‌‌ క్రికెట్‌‌కు పూర్తి స్థాయిలో దూరం కానున్నాడు. కానీ..

Indian Cricket Team: రిటైర్మెంట్ ప్రకటించనున్న మరో టీమిండియా ప్లేయర్? ఐపీఎల్‌లో కొత్త అవతారానికి సిద్ధమైన స్టార్ స్పిన్నర్..!
Team India Star Spinner Harbhajan Singh
Follow us
Venkata Chari

|

Updated on: Dec 08, 2021 | 1:10 PM

Harbhajan Singh: టీమిండియా స్పిన్నర్‌‌ హర్భజన్‌‌ సింగ్‌‌ త్వరలో అన్ని ఫార్మాట్ల క్రికెట్‌‌కు రిటైర్మెంట్‌‌ ప్రకటించనున్నాడు. ప్లేయర్‌‌గా కాంపిటీటివ్‌‌ క్రికెట్‌‌కు పూర్తి స్థాయిలో దూరం కానున్నాడు. కానీ ఎదో రకంగా మాత్రం క్రికెట్‌కి దగ్గరగానే ఉండేలా ప్లాన్ చేసుకున్నాడు బజ్జీ. ఐపీఎల్‌‌లో ఓ ఫ్రాంచైజీతో కలిసి సపోర్ట్‌‌ స్టాఫ్‌‌గా పని చేయనున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు ఇప్పటికే ఓ ఐపీఎల్ టీంతో టచ్‌లో ఉన్నట్లు సమాచారం. ఈమేరకు ఐపీఎల్ 2022లో కొత్త పాత్రలో కనిపించేందుకు రంగం సిద్ధమైందని తెలుస్తోంది. ఇందుకోసం అతి త్వరలో రిటైర్మెంట్‌‌ ప్రకటించనున్నాడని ఐపీఎల్‌‌కు చెందిన ఓ అధికారి తెలిపారు. అయితే కోల్‌‌కతా నైట్‌‌రైడర్స్‌‌, ముంబై ఇండియన్స్‌‌లో ఓ జట్టుకు భజ్జీ పని చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది

‘కన్సల్టెంట్‌‌, మెంటార్‌‌ లేదా అడ్వైజరీ గ్రూప్‌‌లో ఏదో ఒక పదవిని హర్భజన్‌‌కు ఇవ్వనున్నారు. భజ్జీ ఎక్స్‌‌పీరియన్స్‌‌ను ఓ ఫ్రాంచైజీ తగిన రీతిలో ఉపయోగించుకోవాలని‌ పట్టుదలగా ఉన్నాయి. మెగా ఆక్షన్‌‌లో ప్లేయర్ల కొనుగోలుకు సంబంధించి ఇప్పటికే యాక్టివ్‌‌గా పని చేస్తున్నాడు. ఆ ఫ్రాంచైజీతో ఒప్పందం పూర్తి అయిన తర్వాత భజ్జీ రిటైర్మెంట్‌‌ ప్రకటిస్తాడు. అది వచ్చే ఏడాది ప్రారంభంలో ఉండవచ్చు’ అని ఆ అధికారి పేర్కొన్నారు. దీంతో వచ్చే ఏడాది ఐపీఎల్ 2022లో హర్భజన్ సింగ్‌ను కొత్త పాత్రలో చూడొచ్చన్నమాట.

హర్భజన్ కెరీర్.. స్పిన్నర్‌గా టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన హర్భజన్ సింగ్.. 1998లో స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్‌ సిరీస్‌‌తో అరంగేట్రం చేశాడు. అలా మొత్తంగా 103 మ్యాచుల్లో 417 వికెట్లు పడగొట్టాడు. అదే ఏడాది అంటే 1998లో న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌‌తో ఎంట్రీ ఇచ్చి మొత్తం 236 వన్డేలు ఆడి 269 వికెట్లు పడగొట్టాడు. అలాగే టీ20ల్లో 2006న అరంగేట్రం చేసి మొత్తం 28 మ్యాచులు ఆడి 25 వికెట్లు పడగొట్టాడు.

Also Read: Ashes 2021-22: కెప్టెన్‌గా మారి ఇంగ్లండ్ వెన్ను విరిచాడు.. 127 సంవత్సరాల రికార్డును సమం చేసిన ఆసీస్ బౌలర్..!

Indian Origin Spinners: భారత్‌లో జన్మించి, టీమిండియాకే చుక్కలు చూపించారు.. విదేశాల్లో కీలక ప్లేయర్లుగా రాణిస్తోన్న స్పిన్నర్లు..!Preview (opens in a new tab)

సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట
ఇస్లాం మతంలోకి మారాలని అభిమాని సలహా.. బిగ్ బాస్ బ్యూటీ ఏమందంటే?
ఇస్లాం మతంలోకి మారాలని అభిమాని సలహా.. బిగ్ బాస్ బ్యూటీ ఏమందంటే?
అనిల్‌ అంబానీ లగ్జరీ ఇల్లు గురించి మీకు తెలుసా? దాని విలువ ఎంతంటే
అనిల్‌ అంబానీ లగ్జరీ ఇల్లు గురించి మీకు తెలుసా? దాని విలువ ఎంతంటే
మద్యం సేవించినా ఏమీ కాకూడదంటే పచ్చి మిర్చి తింటే చాలు..
మద్యం సేవించినా ఏమీ కాకూడదంటే పచ్చి మిర్చి తింటే చాలు..
వి వాంట్ స్టార్ స్టేటస్.. రూటు మార్చిన హీరోయిన్స్
వి వాంట్ స్టార్ స్టేటస్.. రూటు మార్చిన హీరోయిన్స్
విద్యార్థులకు శుభవార్త.. జనవరి 1 నుంచి 15 వరకు పాఠశాలలకు సెలవులు!
విద్యార్థులకు శుభవార్త.. జనవరి 1 నుంచి 15 వరకు పాఠశాలలకు సెలవులు!
ప్రభాస్ ను ఫాలో అవుతున్న చరణ్, ఎన్టీఆర్
ప్రభాస్ ను ఫాలో అవుతున్న చరణ్, ఎన్టీఆర్