Ashes 2021-22: కెప్టెన్‌గా మారి ఇంగ్లండ్ వెన్ను విరిచాడు.. 127 సంవత్సరాల రికార్డును సమం చేసిన ఆసీస్ బౌలర్..!

ENG Vs AUS: వివాదాల కారణంగా ఆస్ట్రేలియన్ జట్టు టెస్టు కెప్టెన్సీ నుంచి టిమ్ పైన్ తప్పుకోవడంతో యాషెస్‌ సిరీస్‌లో పాట్ కమిన్స్‌కు కెప్టెన్సీ అవకాశం లభించింది.

Ashes 2021-22: కెప్టెన్‌గా మారి ఇంగ్లండ్ వెన్ను విరిచాడు.. 127 సంవత్సరాల రికార్డును సమం చేసిన ఆసీస్ బౌలర్..!
Pat Cummins
Follow us
Venkata Chari

|

Updated on: Dec 08, 2021 | 12:35 PM

Australian Cricket Team: పాట్ కమిన్స్ ప్రపంచంలోని అత్యుత్తమ బౌలర్లలో ఒకటిగా పేరుగాంచిన సంగతి తెలిసిందే. అతని పదునైన బౌలింగ్ ప్రపంచంలోని అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టింది. ఈరోజు ప్రారంభమైన యాషెస్ సిరీస్‌లో తొలి టెస్టు మ్యాచ్‌లో తొలి రోజునే మరోసారి తన బౌలింగ్ ఎడ్జ్‌ని ప్రదర్శించి ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. తొలి రోజు ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌ 147 పరుగులకు ఆలౌటైంది. కమిన్స్ ఐదు వికెట్లు తీసి ఇంగ్లండ్‌ బ్యాటింగ్‌ వెన్ను విరిచాడు. కెప్టెన్‌గా తొలి టెస్టు మ్యాచ్‌ ఆడుతున్న కమిన్స్‌కు ఈ ప్రదర్శన ప్రత్యేకం. టిమ్ పైన్ తర్వాత టెస్టు జట్టుకు కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించి తొలి మ్యాచ్‌లో కెప్టెన్సీలో అద్భుత ఆటతీరును ప్రదర్శించి ఎన్నో రికార్డులు సృష్టించాడు.

కెప్టెన్‌గా కమిన్స్ ఐదు వికెట్లు తీయడం తొలిసారి. యాషెస్ సిరీస్‌లో కమిన్స్ ఈ పని చేశాడు. 1982 తర్వాత యాషెస్ సిరీస్‌లో ఐదు వికెట్లు తీసిన తొలి కెప్టెన్‌గా కమిన్స్ రికార్డు నెలకొల్పాడు. అతని కంటే ముందు ఇంగ్లండ్‌కు చెందిన బాబ్ విల్లీస్ 1982లో ఈ పని చేశాడు. అలాగే, 1962 తర్వాత యాషెస్ సిరీస్‌లో ఐదు వికెట్లు తీసిన తొలి ఆస్ట్రేలియన్ కెప్టెన్ కూడా కమిన్స్ కావడం విశేషం. అతనికి ముందు, 1962లో, ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు, స్పిన్నర్ రిచీ బెనౌ యాషెస్ సిరీస్‌లో కెప్టెన్‌గా ఐదు వికెట్ల హాల్‌ను కైవసం చేసుకున్నాడు.

దీంతో, కెప్టెన్‌గా పురుషుల టెస్టు మ్యాచ్‌లో ఒక ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసిన రెండో ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్‌గా కమిన్స్ నిలిచాడు. అతని కంటే ముందు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ జార్జ్ గిఫెన్ ఈ పని చేశాడు. అతను మూడుసార్లు కెప్టెన్‌గా 5 వికెట్లు పడగొట్టాడు.

ఇది కెప్టెన్‌గా కమ్మిన్స్‌కి మొదటి టెస్ట్ మ్యాచ్. కెప్టెన్‌గా తన మొదటి టెస్ట్ మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీసిన ఘనత సాధించిన రెండవ ఆస్ట్రేలియన్ ఫాస్ట్ బౌలర్ అయ్యాడు. అతనికి ముందు, 1894లో, జార్జ్ గిఫెన్ మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో మొదటిసారిగా ఈ పని చేశాడు. అంటే 127 ఏళ్ల రికార్డును కమిన్స్ సమం చేశాడు.

Also Read: Indian Origin Spinners: భారత్‌లో జన్మించి, టీమిండియాకే చుక్కలు చూపించారు.. విదేశాల్లో కీలక ప్లేయర్లుగా రాణిస్తోన్న స్పిన్నర్లు..!

Ashes 2021: 85 ఏళ్ల తరువాత తొలి బంతికే వికెట్.. యాషెస్ చరిత్రలో నాలుగో సారి.. ఇంగ్లండ్‌కు సొంతమైన 23 ఏళ్ల చెత్త రికార్డు..!