Meru International School: మేరు ఇంటర్నేషనల్ స్కూల్ లో రక్తదాన శిబిరం.. చురుగ్గా పాల్గొన్న డోనర్స్
వరల్డ్ బ్లడ్ డోనర్స్ డే సందర్భంగా మేరు ఇంటర్నేషనల్ స్కూల్(Meru International School).. వాలంటరీ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ను నిర్వహించింది. రెడ్ క్రాస్ సొసైటీతో కలిపి స్కూల్ క్యాంపస్ లో ఏర్పాటు చేసిన ఈ క్యాంప్ లో 53 యూనిట్ల రక్తాన్ని....
వరల్డ్ బ్లడ్ డోనర్స్ డే సందర్భంగా మేరు ఇంటర్నేషనల్ స్కూల్(Meru International School).. వాలంటరీ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ను నిర్వహించింది. రెడ్ క్రాస్ సొసైటీతో కలిపి స్కూల్ క్యాంపస్ లో ఏర్పాటు చేసిన ఈ క్యాంప్ లో 53 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. 11,12 తరగతుల విద్యార్థులే ఈ క్యాంప్ ను నిర్వహించారు. స్కూల్ యాజమాన్యం విద్యార్థులకు రక్తదానం ఆవశ్యకతను వివరించారు. సమాజ శ్రేయస్సు కోసం మేరు సంస్థ ఎప్పుడూ ఆలోచిస్తుందని మేరు ఇంటర్నేషనల్ స్కూల్ డైరెక్టర్ జూపల్లి మేఘనారావు అన్నారు. ఈ మహత్తర కార్యక్రమానికి తమ విద్యాసంస్థ వేదిక అవడం సంతోషంగా ఉందని చెప్పారు. స్వచ్ఛందంగా రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.