AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: డ్రగ్స్ వినియోగిస్తూ దొరికిన 14 మందిని పోలీసులు ఏం చేశారంటే..?

హైదరాబాద్‌లో డ్రగ్స్‌ తీసుకున్నట్టు పోలీసుల ముందు అంగీకరించిన 14 మంది... ఇప్పుడు తమ జీవితాలను మార్చుకునే దిశగా ముందుకు అడుగులు వేస్తున్నారు. శిక్ష కాకుండా తాము మారే విధంగా చికిత్స అందించాలని వారు పోలీసులను అభ్యర్తించారు. పూర్తి వివరాలు కథనం లోపల తెలుసుకుందాం..

Hyderabad: డ్రగ్స్ వినియోగిస్తూ దొరికిన 14 మందిని పోలీసులు ఏం చేశారంటే..?
Drug Consumers
Ranjith Muppidi
| Edited By: |

Updated on: Jul 25, 2025 | 3:00 PM

Share

హైదరాబాద్‌లో డ్రగ్స్‌ తీసుకున్నట్టు అంగీకరించిన 14 మంది శిక్షకు బదులుగా చికిత్సను ఎంచుకున్నారు. వీరిలో ఒక మహిళ కూడా ఉన్నారు. తెలంగాణ పోలీసుల EAGLE టీమ్.. తెలిపిన ప్రకారం.. వీరంతా గవర్నమెంట్ గుర్తింపు పొందిన డీ-అడిక్షన్ కేంద్రాల్లో చికిత్సకు ముందుకు వచ్చారు. వారు కావాలనుకున్నది శిక్ష రద్దు కాదు, తమ తప్పును ఒప్పుకుని జీవితాన్ని మార్చుకునే అవకాశం అని పోలీసులు ఉన్నతాధికారులు తెలిపారు.

చిన్న మొత్తంలో డ్రగ్స్ తీసిన వారి కోసం… NDPS చట్టంలోని 64-A సెక్షన్‌ ఒక మార్గం చూపుతోంది. వ్యసనానికి లోనైనవారు తమపై కేసులు ఉన్నా సరే.. వాలంటరీగా చికిత్స కోరితే, శిక్ష నుంచి మినహాయింపు లభిస్తుంది. కానీ ఇక్కడో కండీషన్ ఉంది. తప్పకుండా పూర్తి చికిత్స తీసుకోవాలి. మధ్యలో ఆపేస్తే మళ్లీ కేసు రీఓపెన్ అవుతుంది.

ఇప్పుడు ఈ 14 మంది నెలరోజులపాటు ప్రభుత్వ గుర్తింపు పొందిన పునరావాస కేంద్రాల్లో చికిత్స పొందనున్నారు. డ్రగ్స్‌ను మానడం ఒక స్టెప్ మాత్రమే కాదు… పూర్తిగా జీవనశైలిని మార్చే ప్రయాణం అని మానిసిక నిపుణులు చెబుతున్నారు. ఇది కేవలం వ్యక్తిగత మార్పు కాదు, సమాజానికి పంపే శక్తివంతమైన సందేశం అంటున్నారు. ఒకసారి ఓ తప్పు చేశామంటే జీవితాంతం శిక్షించాల్సిన అవసరం లేదు. వారు తప్పు గుర్తించి మారాలంటే… చట్టమే రక్షణగా నిలబడుతుంది అన్నది పోలీసులు చెబుతున్న మాట.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 

కింగ్ స్నేక్ డ్యాన్స్..ఫిలిప్స్ అవుటయ్యాక విరాట్ సెలబ్రేషన్
కింగ్ స్నేక్ డ్యాన్స్..ఫిలిప్స్ అవుటయ్యాక విరాట్ సెలబ్రేషన్
ఈ బడ్జెట్‌లో అవి నెరవేరుతాయా? గంపెడు ఆశలు పెట్టుకున్న సిటిజన్లు
ఈ బడ్జెట్‌లో అవి నెరవేరుతాయా? గంపెడు ఆశలు పెట్టుకున్న సిటిజన్లు
Pongal: డేట్, టైమ్.. ప్రధాన వంటకాలు, స్టార్టప్స్ పూర్తి మెనూ ఇలా
Pongal: డేట్, టైమ్.. ప్రధాన వంటకాలు, స్టార్టప్స్ పూర్తి మెనూ ఇలా
ప్రభాస్‏ను అన్న అని పిలిచిన ఏకైక హీరోయిన్..
ప్రభాస్‏ను అన్న అని పిలిచిన ఏకైక హీరోయిన్..
హిట్ మ్యాన్ విధ్వంసం..650 సిక్సర్లతో రోహిత్ శర్మ వరల్డ్ రికార్డ్
హిట్ మ్యాన్ విధ్వంసం..650 సిక్సర్లతో రోహిత్ శర్మ వరల్డ్ రికార్డ్
ఓరి దేవుడా.. పండగకు ముందు బంగారం, వెండి ధర ఇంత పెరిగిందా?
ఓరి దేవుడా.. పండగకు ముందు బంగారం, వెండి ధర ఇంత పెరిగిందా?
హిస్టరీలోనే ఫస్ట్ టైమ్..మెన్స్ వరల్డ్ కప్‎కి ఉమెన్స్ ప్రచారం
హిస్టరీలోనే ఫస్ట్ టైమ్..మెన్స్ వరల్డ్ కప్‎కి ఉమెన్స్ ప్రచారం
2026 లో ఇస్రో తొలి ప్రయోగం..నింగిలోకి దూసుకెళ్లిన PSLV-C62 రాకెట్
2026 లో ఇస్రో తొలి ప్రయోగం..నింగిలోకి దూసుకెళ్లిన PSLV-C62 రాకెట్
ఆ సినిమా కోసం నన్నే అడిగారు.. అనిల్ రావిపూడి కామెంట్స్..
ఆ సినిమా కోసం నన్నే అడిగారు.. అనిల్ రావిపూడి కామెంట్స్..
ఆమెకు 34.. అతనికి 18.. అర్థరాత్రి రూమ్‌లోంచి గట్టిగా అరుపులు
ఆమెకు 34.. అతనికి 18.. అర్థరాత్రి రూమ్‌లోంచి గట్టిగా అరుపులు