Hyderabad: ప్రేమించడమే పాపమైంది.. ప్రియురాలి ముందే యువకుడి దారుణ హత్య.. నడిరోడ్డుపై..

హైదరాబాద్‌ పరిధిలోని పేట్‌బషీరాబాద్‌లో పరువు హత్య కలకలం రేపింది. కూతురు ఎదుటే.. ఆమె ప్రేమించిన వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. యువకుడిని దారుణ హత్య చేసిన షాకింగ్ ఘటన మేడ్చల్‌ జిల్లా దూలపల్లిలో చోటుచేసుకుంది.

Hyderabad: ప్రేమించడమే పాపమైంది.. ప్రియురాలి ముందే యువకుడి దారుణ హత్య.. నడిరోడ్డుపై..
Honour Killing
Follow us

|

Updated on: Mar 03, 2023 | 1:27 PM

హైదరాబాద్‌ పరిధిలోని పేట్‌బషీరాబాద్‌లో పరువు హత్య కలకలం రేపింది. కూతురు ఎదుటే.. ఆమె ప్రేమించిన వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. యువకుడిని దారుణ హత్య చేసిన షాకింగ్ ఘటన మేడ్చల్‌ జిల్లా దూలపల్లిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హరీశ్ అనే డీజే ఆపరేటర్.. కొన్ని నెలల క్రితం దూలపల్లి సూరారం కాలనీకి వచ్చి తన తల్లితో కలిసి నివాసం ఉంటున్నాడు. గతంలో హరీశ్ ఎర్రగడ్డ ప్రాంతంలోని ఎల్లారెడ్డి గూడలో నివాసం ఉండేవాడు. ఆ సమయంలో వేరే వర్గానికి చెందిన యువతిని ప్రేమించాడు. ఈ విషయంలో యువతి తల్లిదండ్రులు హరీశ్‌ను హెచ్చరించారు. అప్పుడు నివాసం మార్చిన హరిశ్.. యువతితో ప్రేమను కొనసాగించాడు. కొన్నాళ్ల తర్వాత ఆమెను పెళ్లి కూడా చేసుకున్నాడు. అయితే, పెద్దలకు తెలియకుండా వివాహం చేసుకున్న ఈ జంట.. ఎవరి ఇంట్లో వాళ్లు ఉంటూనే అప్పుడప్పుడూ కలుసుకుంటున్నారు. వీరిద్దరిపై నిఘా పెట్టిన యువతి కుటుంబసభ్యులకు పెళ్లి చేసుకున్నారన్న విషయం తెలిసింది.

ఈ క్రమంలో తమ బిడ్డను తమకు కాకుండా చేశాడన్న హరీష్ అడ్డు తొలగించుకోవాలని పథకం వేశారు. ఇందులో భాగంగా హరీష్, ఆ యువతి కదలి కలపై నిఘా పెట్టి అదును కోసం ఎదురు చూశారు. దూలపల్లి ఆంజనేయ స్వామి ఆలయం సమీపంలో వీరిద్దరిని చూసిన బంధువులు ఒక్కసారిగా ఎటాక్ చేశారు. దూలపల్లిలో నడిరోడ్డుపై ఆమె ముందే హరీష్‌ను పాశవికంగా హత్య చేసి.. అనంతరం ఆ యువతిని తమ వెంట తీసుకెళ్లిపోయారు.

వేరే వర్గానికి చెందిన యువతిని పెళ్లి చేసుకున్నాడన్న కారణంతోనే తమ కుమారుడిని హత్య చేశారని హరీశ్ కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో భాగంగా యువతి కుటుంబసభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అయితే, హరీశ్‌ను వారే హత్య చేసినట్లు పేర్కొంటున్నారు.

ఇవి కూడా చదవండి

కాగా, మృతుడు హరీశ్‌ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..