Revanth Reddy – Sai Dharam Tej: సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన హీరో సాయి ధరమ్‌ తేజ్‌.

టాలీవుడ్‌ యంగ్ హీరో సాయిధరమ్‌తేజ్‌.. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిని ఈరోజు కలిశారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి నివాసంలో రేవంత్‌తో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు సాయిధరమ్‌. సోషల్‌ మీడియాలో చిన్నపిల్లలపై జరుగుతోన్న దుష్ప్రచారాన్ని సాయిధరమ్‌ ఖండించిన సంగతి తెలిసిందే. దీనిపై మా అస్సోసియేషన్ కూడా స్పందించింది.

Revanth Reddy - Sai Dharam Tej: సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన హీరో సాయి ధరమ్‌ తేజ్‌.
Revanth Reddy Sai Dharam Tej
Follow us

| Edited By: Shaik Madar Saheb

Updated on: Jul 14, 2024 | 6:37 PM

టాలీవుడ్‌ యంగ్ హీరో సాయి ధరమ్‌ తేజ్‌.. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిని ఈరోజు కలిశారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి నివాసంలో రేవంత్‌తో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు సాయిధరమ్‌. సోషల్‌ మీడియాలో చిన్నపిల్లలపై జరుగుతోన్న దుష్ప్రచారాన్ని సాయిధరమ్‌ ఖండించిన సంగతి తెలిసిందే. దీనిపై మా అస్సోసియేషన్ కూడా స్పందించింది. పిల్లలపై జుగుప్సాకరమైన కామెంట్లు చేస్తోన్న రాక్షసులపై చర్యలు తీసుకోవాలంటూ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కోరారు. ఫన్‌ అండ్‌ డ్యాంక్‌ పేరుతో పిల్లలపై ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతోన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు సాయిధరమ్‌తేజ్‌. ఆ విషయంపైనే ఇప్పుడు సీఎం రేవంత్‌ను సాయిధరమ్‌తేజ్‌ కలిసినట్టు తెలుస్తోంది.

ప్రణీత్ హనుమంతు అనే ఓ తెలుగు యూట్యూబర్‌ ఆన్‌లైన్‌లో ఓ డిబేట్‌ను చేపట్టాడు. ఇందులో కొందరు వ్యక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తండ్రీ, కూతుళ్ల మధ్య సాగే ఓ వీడియోపై నోటికొచ్చినట్లు వాగారు. అసభ్య కామెంట్స్‌ చేసి, అదేదో గొప్ప పని చేస్తున్నట్లు విరగబడి మరీ నవ్వారు. దీంతో ఈ వీడియో కాస్త సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌గా మారింది.ఈ వీడియో చూసిన హీరో సాయి ధరమ్ తేజ్‌ అగ్రహం వ్యక్తం చేశారు. సోషల్‌ మీడియాలో ఉండే మృగాల నుంచి పేరెంట్స్‌ తమ పిల్లల్ని కాపాడుకోవాలంటూ విజ్ఙప్తి చేశారు తేజ్‌. సదరు వీడియోను పోస్ట్ చేస్తూ సుదీర్ఘంగా ఓ పోస్ట్‌ చేశారు. దీంతో ఈ వీడియో తెగ వైరల్‌ అయ్యింది. దీనిపై ఏకంగా తెలంగాణ సీఎం రేవంత్‌తో పాటు డిప్యూటీ సీం మల్లు భట్టి విక్రమార్క సైతం స్పందించారు. . ఈ క్లిష్టమైన సమస్యను లేవనెత్తినందుకు సాయి  తేజ్‌ కు ధన్యవాదాలు తెలిపారు. పిల్లల భద్రత నిజానికి అత్యంత ప్రాధాన్యత అంశం అన్నారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫమ్‌లలో పిల్లల ఫొటోలు, వీడియోలు దుర్వినియోగాన్ని నిరోధించడానికి తెలంగాణ ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు.