AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Congress: కాంగ్రెస్‌లో చేరిన జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి.. ఆహ్వానించిన మున్షి, సీఎం రేవంత్ రెడ్డి..

కాంగ్రెస్ పార్టీలో జోష్ మరింత పెరిగింది. చేరికల పర్వం కొనసాగుతుండటంతో ఆ పార్టీ నేతల్లో ఉత్సహాం నెలకొంది. కాంగ్రెస్‌ గేట్లు ఎత్తేశాం అని.. రేవంత్ రెడ్డి చెప్పడంతోనే.. ఆ పార్టీలోకి ఒక్కసారిగా చేరికల పర్వం మొదలైంది. ముఖ్యంగా హైదరాబాద్ ప్రాంతంలో చేరికలపై దృష్టిసారించిన సీఎం.. ఆ దిశగా ప్రయత్నాలను మొదలుపెట్టారు.

Telangana Congress: కాంగ్రెస్‌లో చేరిన జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి.. ఆహ్వానించిన మున్షి, సీఎం రేవంత్ రెడ్డి..
Cm Revanth Reddy
Shaik Madar Saheb
|

Updated on: Mar 30, 2024 | 1:41 PM

Share

కాంగ్రెస్ పార్టీలో జోష్ మరింత పెరిగింది. చేరికల పర్వం కొనసాగుతుండటంతో ఆ పార్టీ నేతల్లో ఉత్సహాం నెలకొంది. కాంగ్రెస్‌ గేట్లు ఎత్తేశాం అని.. రేవంత్ రెడ్డి చెప్పడంతోనే.. ఆ పార్టీలోకి ఒక్కసారిగా చేరికల పర్వం మొదలైంది. ముఖ్యంగా హైదరాబాద్ ప్రాంతంలో చేరికలపై దృష్టిసారించిన సీఎం.. ఆ దిశగా ప్రయత్నాలను మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే ఇవాళ.. GHMC మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కాంగ్రెస్‌లో చేరారు. టీపీసీసీ ఇన్‌ఛార్జ్ దీపాదాస్‌ మున్షి, టీపీసీసీ చీఫ్, సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో శనివారం విజయలక్ష్మి కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా విజయలక్ష్మికి పార్టీ కండువా కప్పి మున్షి, రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. అయితే, కాంగ్రెస్‌లో విజయలక్ష్మి తండ్రి కే కేశవరావు (కేకే) చేరికపై ఇంకా క్లారిటీ రాలేదు. ఆయన రాజ్యసభ పదవీకాలం రెండేళ్లు ఉండటంతో చేరికపై డైలమాలో ఉన్నట్లు చెబుతున్నారు. శుక్రవారం రేవంత్ రెడ్డిని కలిసిన కేకే.. సోనియా గాంధీ సమక్షంలోనే కాంగ్రెస్‌లో చేరుతానని చెప్పారు.

ఇదిలాఉంటే.. కడియం శ్రీహరి, ఇంద్రకరణ్ రెడ్డి.. తదితరులు చేరేందుకు కూడా మూహుర్తం ఖారరైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో స్టేషన్‌ ఘన్‌పూర్ కార్యకర్తలతో కడియం శ్రీహరి భేటీ అయ్యారు. హైదరాబాద్ మినిస్టర్ క్వార్టర్స్‌లో సమాలోచనలు జరుపుతున్నారు. పార్టీలోకి రావాలని కాంగ్రెస్ తనను ఆహ్వానించిందని కడియం శ్రీహరి చెప్పారు. భవిష్యత్ కార్యాచరణను కార్యకర్తలు తనకే వదిలేశారని కడియం వివరించారు. సాయంత్రం మీడియా సమావేశంలో అన్ని వివరాలు చెప్తానని కడియం శ్రీహరి తెలిపారు.

మరోవైపు కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీలోకి రాకను స్టేషన్‌ఘన్‌పూర్‌ కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జ్‌ సింగాపురం ఇందిర పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. 40 ఏళ్లు కాంగ్రెస్‌ను వ్యతిరేకించిన వ్యక్తిని ఎలా పార్టీలో చేర్చుకుంటారని ఆమె ప్రశ్నించారు.

రేవంత్ రెడ్డిని కలిసిన నందమూరి సుహాసిని

Revanth Reddy

Revanth Reddy

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో నందమూరి సుహాసిని మర్యాదపూర్వకంగా కలిశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..