Telangana: పోలీసులే నిందితులైన వేళ.. సస్పెన్షన్‌లతో సతమతమవుతున్న డిపార్ట్‌మెంట్..!

తెలంగాణ పోలీస్ శాఖకు గ్రహణం పట్టింది. రక్షించాల్సిన పోలీసులే రాంగ్ రూట్​లోకి వెళుతున్నారు. రకరకాల కారణాలతో వివిధ హోదాల్లో ఉన్న పోలీసులు వివాదాల్లో చిక్కుకుంటున్నారు. యువతిపై అత్యాచారం, ప్రజాప్రతినిధి కుమారుడిని తప్పిన కేసు, ఫోన్ ట్యాపింగ్ కేసు, విధినిర్వహణలో అలసత్వం ఇలా తెలంగాణ పోలీస్ శాఖకు చెరగని మచ్చ తెచ్చిపెట్టాయి. మామూలు పోలీస్ నుంచి ఉన్నతాధికారుల వరకు సస్పెండ్, అరెస్టులు, ఏకంగా జైలు పాలవుతున్నారు.

Telangana: పోలీసులే నిందితులైన వేళ.. సస్పెన్షన్‌లతో సతమతమవుతున్న డిపార్ట్‌మెంట్..!
Telangana Police
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: Mar 30, 2024 | 12:29 PM

తెలంగాణ పోలీస్ శాఖకు గ్రహణం పట్టింది. రక్షించాల్సిన పోలీసులే రాంగ్ రూట్​లోకి వెళుతున్నారు. రకరకాల కారణాలతో వివిధ హోదాల్లో ఉన్న పోలీసులు వివాదాల్లో చిక్కుకుంటున్నారు. యువతిపై అత్యాచారం, ప్రజాప్రతినిధి కుమారుడిని తప్పిన కేసు, ఫోన్ ట్యాపింగ్ కేసు, విధినిర్వహణలో అలసత్వం ఇలా తెలంగాణ పోలీస్ శాఖకు చెరగని మచ్చ తెచ్చిపెట్టాయి. మామూలు పోలీస్ నుంచి ఉన్నతాధికారుల వరకు సస్పెండ్, అరెస్టులు, ఏకంగా జైలు పాలవుతున్నారు. అసలు తెలంగాణ పోలీసు శాఖలో ఏం జరుగుతోందన్న చర్చ మొదలైంది..!

క్రమ శిక్షణకు మారుపేరుగా చెప్పుకునే పోలీస్‌ శాఖలో కొందరి తీరు కంచే చేను మేసిన చందంగా మారుతోంది. ఉన్నతాధికారుల హెచ్చరికలు, సస్పెన్షన్‌ చర్యలను కొందరు పోలీసులు పెడచెవిన పెడుతున్నారు. ఇంకొందరు బినామీ పేర్లతో కోట్లు గడిస్తూ దర్జాగా కాలం వెళ్ళదీస్తున్నారు. దొరికితే దొంగ.. లేదంట దొర అన్నట్లుగా మారింది. ఈ క్రమలో పలు వివాదాల్లో చిక్కుకున్న పోలీసులు సస్పెన్షన్ వేటుకు గురవుతున్నారు. దీంతో ఆ శాఖలో పెద్ద ఎత్తున ఖాళీలు విపరీతంగా ఏర్పడుతున్నాయి.

మహిళపై అత్యాచారం చేసిన కేసులో అప్పటి టాస్క్‌ఫోర్స్‌లో పని చేసిన మారేడుపల్లి ఇన్స్‌పెక్టర్ నర్సింగ్ రావు సస్పెన్షన్ వేటుకు గురై అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే! ఇక మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు కేసులో లక్షల రూపాయల లంచం తీసుకుంటూ పంజాగుట్ట ఇన్స్‌పెక్టర్ దుర్గారావు ఉద్యోగం పోగొట్టుకున్నారు. డ్యూటీలో నిర్లక్ష్యం సివిల్ మ్యాటర్‌లో తలదూర్చి సైబరాబాద్, హైదరాబాద్ కమిషనరేట్ పరధిలోని పలు పోలీస్ స్టేషన్లలో పని చేసిన సీఐలు, ఎస్ఐలు అధికారుల ఆగ్రహానికి గురై ఇంటి బాటపట్టారు.

ఇక ఫోన్ ట్యాపింగ్ కేసు అందరికి తెలిసిందే..! పోలీస్ అధికారి ప్రణీత్ రావు అరెస్ట్ నుండి మొదలుకుని, అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న జైలు పాలయ్యారు. తాజాగా ఆ లిస్టులోకి మాజీ టాస్క్‌ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ చేరారు. ఈ కేసులో ఇంకా చాలా మంది పోలీస్ అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. దర్యాప్తులో ఒక్కో పోలీస్ అధికారి విషయాలు బయటకు రావడంతో తెలంగాణలో అనేక ప్రాంతాల్లో ప్రస్తుతం డ్యూటీలో ఉన్న పోలీస్ బాస్ లు విచారణ ఎదురుకుంటున్నారు. ఇంకా ఎంత మంది అధికారులు అరెస్ట్ అవుతారో అర్ధం కాని పరిస్థితి నెలకొంది.

తాజాగా నయీమ్ కేసుపై కూడా పోలీస్ ఉన్నతాధికారులు ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇక ఈ కేసు కూడా ఇన్వెస్టిగేషన్ మొదలైతే చెప్పాల్సిన పని లేదు.. అప్పట్లో నయీమ్‌తో చెట్టాపట్టాలేసుకుని అక్రమ ఆస్తులు కూడాబెట్టారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి కష్టకాలమేనట. సస్పెండ్‌కు గురై మళ్ళీ క్లిన్ చిట్ తో డ్యూటీలో జాయిన్ అయిన అధికారులను మరోసారి విచారించేందుకు పోలీస్ యంత్రాంగం సిద్ధమవుతుందట. ఇలా అనేక అవినీతి, నేర కేసుల్లో పోలీస్ బాసులు జైలుకు వెళ్లడం, జాబ్ పోగొట్టుకోవడం కలవరానికి గురి చేస్తోంది. దీంతో ఆయా పోస్టులకు ఖాళీలు కూడా ఏర్పడుతోంది. భవిష్యత్తులో పోలీస్ శాఖ ఇంకా ఎంత అప్రతిష్ట మూట కట్టుకుంటుందో అని జనం విమర్శలు గుప్పిస్తున్నారు. వడ్డించే వాడు మనవాడు అని తెలిసి అడ్డగోలుగా తింటే అజీర్తి అవ్వడం ఖాయం అంటూ మరికొందరు కరెప్టెడ్ పోలీసులపై కామెంట్లు చేస్తున్నారు. ఏదిఏమైనా జరుగుతున్న పరిణామాలు అరెస్ట్ అవుతున్న పోలీస్ అధికారుల పరిస్థితి చూస్తే చట్టం ఎవరికి చుట్టం కాదు అన్న మాట నిజంలా అనిపిస్తోంది..!

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

Latest Articles
పళ్ళు తోముకోకుండా ఉదయాన్నే నీళ్లు తాగడం మంచిదేనా?
పళ్ళు తోముకోకుండా ఉదయాన్నే నీళ్లు తాగడం మంచిదేనా?
బరువు తగ్గాలని రాత్రి డిన్నర్‌ చేయడం మానేస్తున్నారా.?
బరువు తగ్గాలని రాత్రి డిన్నర్‌ చేయడం మానేస్తున్నారా.?
క్యాచ్ ఆఫ్ ది సీజన్! కేకేఆర్ ప్లేయర్ ఊహించని విన్యాసం.. వీడియో
క్యాచ్ ఆఫ్ ది సీజన్! కేకేఆర్ ప్లేయర్ ఊహించని విన్యాసం.. వీడియో
మీ ఇంట్లో ఒక గది ఉంటే చాలు.. ఈ వ్యాపారంతో నెలకు 30 వేలు పక్కా.!
మీ ఇంట్లో ఒక గది ఉంటే చాలు.. ఈ వ్యాపారంతో నెలకు 30 వేలు పక్కా.!
ఎఫ్‌డీ చేయాలనుకుంటున్నారా? వీటిల్లో బ్యాంకులన్నా అధిక వడ్డీ..
ఎఫ్‌డీ చేయాలనుకుంటున్నారా? వీటిల్లో బ్యాంకులన్నా అధిక వడ్డీ..
వెయిట్ లాస్‌కు ట్రై చేస్తున్నారా.. వెల్లుల్లి చక్కగా సహాయపడుతుంది
వెయిట్ లాస్‌కు ట్రై చేస్తున్నారా.. వెల్లుల్లి చక్కగా సహాయపడుతుంది
తెలుగు మహిళా అభ్యర్థి శ్రీకళారెడ్డికి షాక్.. చివరి నిమిషంలో
తెలుగు మహిళా అభ్యర్థి శ్రీకళారెడ్డికి షాక్.. చివరి నిమిషంలో
పనివాడి ఇంట్లో అంత సొమ్మా..? అసలు ఎవరీ మంత్రి అలంగీర్‌ ఆలం
పనివాడి ఇంట్లో అంత సొమ్మా..? అసలు ఎవరీ మంత్రి అలంగీర్‌ ఆలం
గర్భధారణ సమయంలో చేతులు, కాళ్ళు ఎందుకు ఉబ్బుతాయి?
గర్భధారణ సమయంలో చేతులు, కాళ్ళు ఎందుకు ఉబ్బుతాయి?
ఛాతీలో నొప్పితో పాటు ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా..? వామ్మో..
ఛాతీలో నొప్పితో పాటు ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా..? వామ్మో..
శ్రీశైలం రోడ్డు మార్గంలో నల్లటి వింత ఆకారం.. దగ్గరికెళ్లి చూస్తే
శ్రీశైలం రోడ్డు మార్గంలో నల్లటి వింత ఆకారం.. దగ్గరికెళ్లి చూస్తే
రెండు రోజుల వ్యవధిలోనే మరో 200 మందికి గూగుల్ ఉద్వాసన.!
రెండు రోజుల వ్యవధిలోనే మరో 200 మందికి గూగుల్ ఉద్వాసన.!
అపర కుబేరుడు ఈ ఖైదీ.. సంపద విలువ రూ.3.60 లక్షల కోట్లు.
అపర కుబేరుడు ఈ ఖైదీ.. సంపద విలువ రూ.3.60 లక్షల కోట్లు.
ఆంధ్రాలో డబ్బు రాజకీయం.బస్సుల్లో తరలిపోతున్న కోట్లలో నోట్ల కట్టలు
ఆంధ్రాలో డబ్బు రాజకీయం.బస్సుల్లో తరలిపోతున్న కోట్లలో నోట్ల కట్టలు
విమానం టేకాఫ్‌ అయిన 10 నిమిషాలకే ఊహించని ప్రమాదం.. 170 మంది.!
విమానం టేకాఫ్‌ అయిన 10 నిమిషాలకే ఊహించని ప్రమాదం.. 170 మంది.!
మండుతున్న ఎండలనుంచి ఉపశమనం.. పుదుచ్చేరి ప్రభుత్వం వినూత్న ఆలోచన..
మండుతున్న ఎండలనుంచి ఉపశమనం.. పుదుచ్చేరి ప్రభుత్వం వినూత్న ఆలోచన..
తలనొప్పిగా ఉందన్నాడు.. మరుక్షణంలోనే ప్రాణాలు కోల్పోయాడు.!
తలనొప్పిగా ఉందన్నాడు.. మరుక్షణంలోనే ప్రాణాలు కోల్పోయాడు.!
గ్యాంగ్‌స్టర్‌ గోల్డీబ్రార్‌ బ్రతికే ఉన్నాడు.! వీడియో..
గ్యాంగ్‌స్టర్‌ గోల్డీబ్రార్‌ బ్రతికే ఉన్నాడు.! వీడియో..
రజనీకాంత్ బయోపిక్ వార్త వైరల్‌.. హీరో ఎవరంటే.!
రజనీకాంత్ బయోపిక్ వార్త వైరల్‌.. హీరో ఎవరంటే.!
16 కేజీలు తగ్గిన రిషబ్‌ పంత్.! కేవలం 5 ml ఆయిల్‌తో వంట..
16 కేజీలు తగ్గిన రిషబ్‌ పంత్.! కేవలం 5 ml ఆయిల్‌తో వంట..