AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bharat Ratna: పీవీకి భారతరత్న ప్రదానం.. స్వీకరించిన కుమారుడు.. రేపు ఆడ్వాణీకి..

దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘భారతరత్న’ ప్రదానోత్సవం శనివారం ఘనంగా నిర్వహించారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భారతరత్న పురస్కరాలను ప్రదానం చేశారు. దివంగత మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు తరఫున ఆయన కుమారుడు ప్రభాకర్‌రావు ఈ పురస్కారాన్ని స్వీకరించారు. కాగా.. పలు రంగాల్లో అసాధారణ సేవలందించిన వారికి భారత ప్రభుత్వం భారతరత్నను ప్రదానం చేస్తోంది.

Bharat Ratna: పీవీకి భారతరత్న ప్రదానం.. స్వీకరించిన కుమారుడు.. రేపు ఆడ్వాణీకి..
Bharat Ratna
Shaik Madar Saheb
|

Updated on: Mar 30, 2024 | 12:31 PM

Share

దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘భారతరత్న’ ప్రదానోత్సవం శనివారం ఘనంగా నిర్వహించారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భారతరత్న పురస్కరాలను ప్రదానం చేశారు. దివంగత మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు తరఫున ఆయన కుమారుడు ప్రభాకర్‌రావు ఈ పురస్కారాన్ని స్వీకరించారు. కాగా.. పలు రంగాల్లో అసాధారణ సేవలందించిన వారికి భారత ప్రభుత్వం భారతరత్నను ప్రదానం చేస్తోంది. అయితే, ఈ ఏడాది ఐదుగురు ప్రముఖులకు మూడు విడతల్లో అత్యున్నత పురస్కారం ‘భారతరత్న’ను ప్రకటించింది.

ఈ ఏడాదికి బిహార్‌ మాజీ సీఎం కర్పూరీ ఠాకుర్‌, బీజేపీ అగ్రనేత ఎల్‌కే ఆడ్వాణీ, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, మాజీ ప్రధాని చౌదరీ చరణ్‌సింగ్‌, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్‌ స్వామినాథన్‌లకు భారతరత్నను ప్రకటించారు. ఒకే సంవత్సరంలో ఎక్కువమందికి దేశ అత్యున్నత పురస్కారం ప్రకటించడం ఇదే తొలిసారి.

ఇందులో నలుగురికి మరణానంతరం ఈ అవార్డు లభించగా.. నేడు వారి కుటుంబసభ్యులకు పురస్కారాన్ని ప్రదానం చేశారు. కర్పూరీ ఠాకుర్‌ తరఫున ఆయన కుమారుడు రామ్‌నాథ్‌, చౌదరీ చరణ్‌ సింగ్‌ తరఫున ఆయన మనవుడు జయంత్‌ సింగ్‌, స్వామినాథన్‌ తరఫున అవార్డును కుమార్తె నిత్యా రావు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ప్రదాని మోదీ, అమిత్ షా పలువురు కేంద్రమంత్రులు హాజరయ్యారు.

కాగా.. ఎల్‌కే ఆడ్వాణీ అనరోగ్య సమస్యలతో బాధపడుతూ అవార్డు ప్రదానోత్సవానికి హాజరుకాలేకపోయారు. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ఆడ్వాణీ ఇంటికెళ్లి ‘భారతరత్న’ ను ప్రదానం చేయనున్నారు.

తెలుగు ఠీవి.. మన పీవీ

తెలుగు ఠీవి అయిన పీవీ నరసింహారావుకు దేశ అత్యున్నత పౌర పురస్కారాన్ని గడిచిన నెల 9న ప్రకటించింది కేంద్రం. దేశాన్ని మలుపు తిప్పిన నాయకుడిగా PV నరసింహారావుకు ఈ దేశ ప్రస్థానంలో కీలకమైన స్థానం ఉంది. 1991లో దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు, ఆయన ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. ఆర్థికరంగ నిపుణుడు డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ను ఆర్థిక మంత్రిగా నియమించారు PV నరసింహారావు. పండితుడు, రాజనీతిజ్ఞుడు అయిన పీవీ నరసింహారావు దేశానికి పలు హోదాల్లో సేవలు అందించారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా, ఎంపీగా, అసెంబ్లీ సభ్యుడిగా ఎన్నో ఏళ్లు బాధ్యతలు నిర్వర్తించారు పీవీ నరసింహా రావు. దేశం ఆర్థికంగా పురోగమించడానికి ఆయన దార్శనిక నాయకత్వం ఉపయోగపడింది. దేశాభివృద్ధికి PV నరసింహారావు పటిష్ఠమైన పునాదులు వేశారు. సరళీకరణ విధానాలతో ప్రపంచ మార్కెట్లకు PV తలుపులు తెరిచారు. భారత విదేశాంగ విధానానికి, భాషకు, విద్యారంగానికి ఆయన సేవలు అపారమైనవని భారత రత్న ప్రకటించిన సందర్భంగా ప్రధాని మోదీ కొనియాడారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

డబ్ల్యూటీసీలో ఆసీస్‌కు గట్టి షాక్.. భారత్ అవుట్.!
డబ్ల్యూటీసీలో ఆసీస్‌కు గట్టి షాక్.. భారత్ అవుట్.!
పాకిస్తాన్‌కు భారీ షాక్.. టీ20 ప్రపంచకప్‌ నుంచి డేంజరస్ బౌలర్ ఔట్
పాకిస్తాన్‌కు భారీ షాక్.. టీ20 ప్రపంచకప్‌ నుంచి డేంజరస్ బౌలర్ ఔట్
రైతుల సమస్యలపై సర్కార్ స్పెషల్ ఫోకస్.. ఆ భూములపై వ్యవహారంపై..
రైతుల సమస్యలపై సర్కార్ స్పెషల్ ఫోకస్.. ఆ భూములపై వ్యవహారంపై..
డ్రగ్స్ కేసులో పదే పదే అమన్ సింగ్ పేరు..
డ్రగ్స్ కేసులో పదే పదే అమన్ సింగ్ పేరు..
పదో తరగతి అర్హతతో అంగన్‌వాడీ ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు
పదో తరగతి అర్హతతో అంగన్‌వాడీ ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు
తెలంగాణ అడవిలో దాగి ఉన్న ఒక మర్మమైన కోట- దీని రహస్యం మీకు తెలుసా?
తెలంగాణ అడవిలో దాగి ఉన్న ఒక మర్మమైన కోట- దీని రహస్యం మీకు తెలుసా?
ప్రభాస్ స్వాగ్ అదిరిపోతుంది. ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు.. మారుతి
ప్రభాస్ స్వాగ్ అదిరిపోతుంది. ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు.. మారుతి
Vaibhav Suryavanshi: టీమిండియా కెప్టెన్‌గా వైభవ్ సూర్యవంశీ..
Vaibhav Suryavanshi: టీమిండియా కెప్టెన్‌గా వైభవ్ సూర్యవంశీ..
ఇంటర్ విద్యార్ధులకు అలర్ట్.. మరో 3 రోజులే గడువు! ఇదే చివరి ఛాన్స్
ఇంటర్ విద్యార్ధులకు అలర్ట్.. మరో 3 రోజులే గడువు! ఇదే చివరి ఛాన్స్
మీరు రోజంతా నీరసంగా ఉండటానికి కారణం ఇదే.. వెంటనే మార్చుకోకపోతే..
మీరు రోజంతా నీరసంగా ఉండటానికి కారణం ఇదే.. వెంటనే మార్చుకోకపోతే..