Lok Sabha Elections 2024: ఎగ్జిట్ పోల్స్‌పై ఎంతకాలం నిషేధం ఉంటుంది? ఈసీ ఏం చెబుతోంది..!
ఏప్రిల్ 19 ఉదయం 7 గంటల నుండి జూన్ 1 సాయంత్రం 6:30 గంటల మధ్య ఎగ్జిట్ పోల్స్ నిర్వహించడం, ప్రచురించడం లేదా ప్రచారం చేయడం నిషేధిస్తూ ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇదే సమయంలో లోక్‌సభతో పాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కూడా వివిధ దశల్లో ఓటింగ్ జరగనుంది.

ఏప్రిల్ 19 ఉదయం 7 గంటల నుండి జూన్ 1 సాయంత్రం 6:30 గంటల మధ్య ఎగ్జిట్ పోల్స్ నిర్వహించడం, ప్రచురించడం లేదా ప్రచారం చేయడం నిషేధిస్తూ ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇదే సమయంలో లోక్‌సభతో పాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కూడా వివిధ దశల్లో ఓటింగ్ జరగనుంది.
ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌లో ఏం చెప్పింది?
18వ లోక్‌సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం రాష్ట్రాల శాసనసభలకు కూడా ఎన్నికలు జరగనున్నాయి. అదే సమయంలో 12 రాష్ట్రాల్లోని 25 అసెంబ్లీ స్థానాలకు వేర్వేరుగా ఉప ఎన్నికలు కూడా జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే గురువారం (మార్చి 28) జారీ చేసిన నోటిఫికేషన్‌లో, ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని నిబంధనల ప్రకారం, పోలింగ్ ముగియడానికి నిర్ణయించిన సమయంతో ముగిసే 48 గంటల వ్యవధిలో ఏదైనా ఎలక్ట్రానిక్ మీడియాలో ఏదైనా అభిప్రాయ సేకరణ లేదా అలాంటి వాటిని ప్రదర్శించాలని స్పష్టం చేసింది. ఇతర ఎన్నికల సర్వే ఫలితాలతో సహా ఎన్నికల అంశాలు నిషేధిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ఒక ప్రకటనలో తెలిపింది.
లోక్‌సభ ఎన్నికలు ఎంతకాలం కొనసాగుతాయి?
దేశంలో 18వ లోక్‌సభకు ఏప్రిల్ 19 నుంచి ఎన్నికలు ప్రారంభం కానున్నాయి. దీని తర్వాత ఏప్రిల్ 26, మే 7, మే 13, మే 20, 25 మే , జూన్ 1 తేదీల్లో పోలింగ్ జరుగనుంది. మొత్తం ఏడు దశల్లో ఓటింగ్ జరగనుంది. లోక్‌సభలోని 543 నియోజకవర్గాల్లో దాదాపు 97 కోట్ల మంది నమోదైన ఓటర్లు 10.5 లక్షల పోలింగ్ కేంద్రాల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది.
అదే సమయంలో, ఎన్నికల నమూనా ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన కేసులను నమోదు చేసేందుకు, లోక్‌సభ ఎన్నికల ప్రకటన నుండి ‘సి-విజిల్’ మొబైల్ అప్లికేషన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది కేంద్ర ఎన్నికల సంఘం. ఈ యాప్ సమర్థవంతమైన సాధనంగా మారిందని ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. ఇక ఇప్పటి వరకు ప్రజలు ఈ యాప్ ద్వారా 79,000 కంటే ఎక్కువ ఫిర్యాదులు చేశారని ఈసీ వెల్లడించింది. వీటిలో 99 శాతానికి పైగా ఫిర్యాదులను పరిష్కరించామని, 89 శాతం ఫిర్యాదులను 100 నిమిషాల్లో పరిష్కరించామని కమిషన్ తెలిపింది. 58,500 ఫిర్యాదులు అంటే మొత్తం ఫిర్యాదులలో 73 శాతం అక్రమ హోర్డింగ్‌లు, బ్యానర్‌లకు వ్యతిరేకంగా ఉన్నాయని, 1,400 కంటే ఎక్కువ ఫిర్యాదులు డబ్బు, బహుమతులు, మద్యం పంపిణీకి సంబంధించినవని కమిషన్ తెలిపింది. దాదాపు మూడు శాతం ఫిర్యాదులు అంటే 2,454 ఆస్తుల నష్టంసంబంధించినవేనని ఎన్నికల సంఘం తెలిపింది. కమిషన్ ప్రకారం, ఆయుధ ప్రదర్శన, బెదిరింపులకు సంబంధించి 535 ఫిర్యాదులలో 529 పరిష్కరించామని పేర్కొంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…
