AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: విద్యార్థులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. ఫిబ్రవరి 19 నుంచి హాఫ్ డే స్కూల్స్.. కానీ..

పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలోని ముస్లిం విద్యార్థులు, ఉపాధ్యాయులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు చేపట్టే వారి సౌకర్యార్థం ఉర్దూ మీడియం పాఠశాలల పనివేళలను మారుస్తూ విద్యాశాఖ డైరెక్టర్ డాక్టర్ కీలక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 19 నుండి మార్చి 20 వరకు ఈ కొత్త వేళలు అమలులో ఉండనున్నాయి.

Telangana: విద్యార్థులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. ఫిబ్రవరి 19 నుంచి హాఫ్ డే స్కూల్స్.. కానీ..
Telangana Govt Announces Half Day For Urdu Medium Schools
Vidyasagar Gunti
| Edited By: |

Updated on: Feb 17, 2026 | 12:09 PM

Share

తెలంగాణలోని ఉర్దూ మీడియం పాఠశాలల టైమింగ్స్‌కు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలోని ఉర్దూ మీడియం పాఠశాలల పనివేళలను మారుస్తూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ డాక్టర్ నవీన్ నికోలస్ కీలక ఉత్తర్వులు జారీ చేశారు. రంజాన్ మాసం సందర్భంగా ముస్లింల సౌకర్యార్థం ఈ మార్పులు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 01.30 గంటల వరకు మాత్రమే పాఠశాలలు కొనసాగుతాయి. ఈ కొత్త వేళలు ఫిబ్రవరి 19 నుండి మార్చి 20 వరకు అమల్లో ఉంటాయి. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్ ఉర్దూ మీడియం పాఠశాలలు ఈ మార్పును అమలు చేయాలి. అలాగే సాధారణ పాఠశాలల్లోని ఉర్దూ మీడియం సెక్షన్ల కు కూడా ఇదే వర్తిస్తుందని విద్యాశాఖ స్పష్టం చేసింది. ఉర్దూ మీడియం డైట్ కళాశాలలు ఇదే తరహాలో నడుస్తాయి

పనివేళలు తగ్గించడం వల్ల కలిగే పని గంటల నష్టాన్ని పూడ్చేందుకు విద్యాశాఖ ప్రత్యేక సూచనలు చేసింది అప్పర్ ప్రైమరీ, హైస్కూల్స్ ఒక అదనపు రోజు పని చేయాల్సి ఉంటుంది. ప్రైమరీ స్కూల్స్ గతేడాది మాదిరిగానే రెండు పని దినాల్లో అదనంగా అర గంట పని చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు హైదరాబాద్, వరంగల్ ప్రాంతీయ జాయింట్ డైరెక్టర్లు , రాష్ట్రంలోని అన్ని జిల్లాల విద్యాశాఖాధికారులకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు అందాయి. వివిధ ఉపాధ్యాయ సంఘాల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం ఈ సానుకూల నిర్ణయం తీసుకుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఇదేం పుకార్లురా నాయనా.. అంతా అబద్దమే.. బంగారంపై అసలు నిజం ఇదే..!
ఇదేం పుకార్లురా నాయనా.. అంతా అబద్దమే.. బంగారంపై అసలు నిజం ఇదే..!
మహిళలకు పచ్చి బొప్పాయి వరప్రసాదం.. ఆ సమస్యలన్నింటికీ చెక్ పెట్టే
మహిళలకు పచ్చి బొప్పాయి వరప్రసాదం.. ఆ సమస్యలన్నింటికీ చెక్ పెట్టే
కాలేజీలో ఏడాదిగా మూసి ఉన్న గది తెరిచి చూస్తే షాక్!
కాలేజీలో ఏడాదిగా మూసి ఉన్న గది తెరిచి చూస్తే షాక్!
ఒకప్పుడు ఇండస్ట్రీలో తోపు హీరో. క్యాటరింగ్ బిజినెస్‏లో..
ఒకప్పుడు ఇండస్ట్రీలో తోపు హీరో. క్యాటరింగ్ బిజినెస్‏లో..
5300 ఏళ్ల నాటి మమ్మీలో ఇంకా జీవం! శాస్త్రవేత్తలకు ఓట్జీ షాక్
5300 ఏళ్ల నాటి మమ్మీలో ఇంకా జీవం! శాస్త్రవేత్తలకు ఓట్జీ షాక్
రోహిత్-విరాట్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. ఎందుకో తెలుసా?
రోహిత్-విరాట్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. ఎందుకో తెలుసా?
భారత్‌లో ఆ ఒక్క కారణంతోనే 70 శాతం పడిపోయిన బంగారం కొనుగోళ్లు..
భారత్‌లో ఆ ఒక్క కారణంతోనే 70 శాతం పడిపోయిన బంగారం కొనుగోళ్లు..
పుట్టినరోజుపై ఇరువురి వెర్షన్స్ ఎలా ఉన్నాయంటే..?
పుట్టినరోజుపై ఇరువురి వెర్షన్స్ ఎలా ఉన్నాయంటే..?
వైభవ్ సూర్యవంశీపై ఐఐఎమ్ అధ్యయనం.. అసలు కారణం ఏంటంటే!
వైభవ్ సూర్యవంశీపై ఐఐఎమ్ అధ్యయనం.. అసలు కారణం ఏంటంటే!
బుధుడి కటాక్షం.. వారికి వ్యాపార పెట్టుబడులతో భారీ లాభాలు ఖాయం..!
బుధుడి కటాక్షం.. వారికి వ్యాపార పెట్టుబడులతో భారీ లాభాలు ఖాయం..!