హైదరాబాద్ పంజాగుట్టలోని జాయాలుక్కాస్ షోరూంలో ఒక కిలో బంగారు బిస్కెట్ల చోరీ జరిగింది. ఫిర్యాదు అందిన 24 గంటల్లోనే పోలీసులు నిందితుడైన షోరూం సేల్స్‌మెన్ కారంపూడి గోపాలకృష్ణను అరెస్ట్ చేసి, చోరీకి గురైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేసి ఈ కేసును ఛేదించారు.