AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad : భారీ వర్షాలు కురిసే అవకాశం.. అప్రమత్తంగా ఉండాలంటూ అధికారుల హెచ్చరిక

Hyderabad Rains: హైదరాబాద్ లో వర్షం దంచి కొట్టింది. వేసవి తాపంతో వివవిలలాడుతోన్న నగరవాసులను చల్లబరిచింది వర్షం. అయితే భారీగా కురిసిన వర్షం కారణంగా హైదరాబాద్ రోడ్లన్నీ జలమయం అయ్యాయి.

Hyderabad : భారీ వర్షాలు కురిసే అవకాశం.. అప్రమత్తంగా ఉండాలంటూ అధికారుల హెచ్చరిక
Rains In Hyderabad
Rajeev Rayala
|

Updated on: Jun 21, 2022 | 8:08 AM

Share

హైదరాబాద్ లో వర్షం దంచి కొట్టింది. వేసవి తాపంతో వివవిలలాడుతోన్న నగరవాసులను చల్లబరిచింది వర్షం. అయితే భారీగా కురిసిన వర్షం కారణంగా హైదరాబాద్ రోడ్లన్నీ జలమయం అయ్యాయి. వర్షం నీటితో నాళాలన్నీ పొంగిపొర్లుతున్నాయి. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యం లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జి.హెచ్.ఎం.సి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తెలిపారు. హైదరాబాద్ నగరం నేటి రాత్రి నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలియ జేసిన నేపథ్యం లో ప్రజలు అత్యవసర పనులు తప్ప ఎక్కడికి ఎవ్వరూ బటకి వెళ్ళ వద్దని జి.హెచ్.ఎం.సి తెలిపింది. అనవసరంగా బయట తిరిగి ఇబ్బందులకు గురి కావ వద్దని  అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. ఏమైనా ఇబ్బందులు ఎదురైన పక్షం లో జి హెచ్ ఎం సి ప్రధాన కార్యాలయం లో ఏర్పాటు చేసిన సహాయక కేంద్ర నంబర్ 040-21111111 కు సంప్రదించాలని ప్రజలను కోరారు.

ఇక నగరంలో ఈ సీజన్ లో తొలిసారి 10 సెంటీమీటర్ల దాటింది వర్షం. మాదాపూర్ లో రాత్రి 10.2 సెం.మీ. వర్షపాతం నమోదుకాగా బాలానగర్ 7.6 సెం.మీ. , ఫిరోజ్ గూడ 7.3 సెం.మీ, క్కుత్బుల్లాపూర్, జీడిమెట్ల లో 7.1 సెం.మీ. వర్షపాతం, ఆర్ సి పురం 7. HCU 6.9 సెం.మీ, మూసాపేట్ 6.8, షాపూర్ నగర్ 6.6 సెం.మీ. వర్షపాతం నమోదు అయ్యింది. ఇక రానున్న రోజులు వర్షాలు విస్తారంగా కురిసే అవకాశాలు ఉండటంతో లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రజలను హెచ్చరిస్తున్నారు అధికారులు.

Whatsapp Image 2022 06 21 At 6.22.15 Am

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి