Viral Video: వీళ్లేం కొత్త జంటరా బాబు..! పెళ్లిని పక్కనపెట్టి.. వాటికోసం ఎగబడ్డారు.. వీడియో చూస్తే అవాక్కవ్వాల్సిందే..
ఓ నూతన జంటకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. వేదిక మీద ఉన్న వధూవరులు ఇష్టమైన పానీపూరిని చూసి కింద దిగివచ్చారు. ఆ తర్వాత ఇద్దరూ గుటకలేసుకుంటూ తిన్నారు.
Wedding Viral Video: సోషల్ మీడియా ప్రపంచంలో వివాహ వేడుకలకు సంబంధించిన పలు రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా.. మరికొన్ని ఆశ్చర్యకరంగా ఉంటాయి. తాజాగా ఓ నూతన జంటకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. వేదిక మీద ఉన్న వధూవరులు ఇష్టమైన పానీపూరిని చూసి కింద దిగివచ్చారు. ఆ తర్వాత ఇద్దరూ గుటకలేసుకుంటూ తిన్నారు. సాధారణంగా భారతదేశంలోని ప్రజలు స్పైసీ ఫుడ్ తినడానికి ఇష్టపడతారు. వాటిలో గోల్గప్ప (పానీపూరి) ఒకటి.. దీనిని స్నాక్స్‌గా తీసుకుంటారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ‘గోల్గప్పా లవర్స్’ కు సంబంధించిన వీడియో తెగ హల్‌చల్ చేస్తోంది. ఈ వీడియో చూస్తే మీ నోటిలో కూడా నీళ్లూరుతాయి.
వైరల్ అవుతున్న వీడియోలో.. గోల్గప్ప కోసం వధూవరులు వేదిక దిగి వచ్చారు. ఆ తర్వాత ఇద్దరూ పానీపూరి తీసుకోని ఛీర్స్ చెప్పుకుంటూ తింటారు. అయితే కొత్త జంటను చూసి నెటిజన్లు అందరూ ఆశ్చర్యపోతున్నారు. నిజంగా గోల్గప్ప లవర్స్ అంటూ తెగ కామెంట్లు చేస్తున్నారు.
వైరల్ వీడియో..
View this post on Instagram
వధూవరులు ఇద్దరూ పోటీపడి మరి పానీపూరిలను తింటుంటారు. ఈ రేసులో వరుడు.. వధువు చేతిలో ఓడిపోతాడు. ఎందుకంటే వధువు అతని కంటే ఎక్కువ పానీపూరీలను తింటుంది. ఈ వీడియోను నెటిజన్లు మళ్లీ మళ్లీ చూస్తూ పలు కామెంట్లు చేస్తున్నారు. జంట ముచ్చటగా ఉందని.. పెళ్లి వేడుక తర్వాత.. ముందు పానీ పూరీలను లాగించేద్దాం అన్నట్లు కనిపిస్తున్నారని పేర్కొంటున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..