Viral Video: దెబ్బకు దూలతీరింది..! వేట కోసం వెళ్లిన చిరుతకు దిమ్మతిరిగే షాకిచ్చిన హిప్పో.. వీడియో..

సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా.. మరికొన్ని ఆశ్చర్యకరంగా ఉంటాయి. వైరల్ అయ్యే వీడియోల్లో ఎక్కువగా జంతువులకు సంబంధించినవే ఉంటాయి.

Viral Video: దెబ్బకు దూలతీరింది..! వేట కోసం వెళ్లిన చిరుతకు దిమ్మతిరిగే షాకిచ్చిన హిప్పో.. వీడియో..
Viral Video
Follow us
Rajeev Rayala

|

Updated on: Jun 21, 2022 | 7:10 AM

Leopard – Hippo Viral Video: సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా.. మరికొన్ని ఆశ్చర్యకరంగా ఉంటాయి. వైరల్ అయ్యే వీడియోల్లో ఎక్కువగా జంతువులకు సంబంధించినవే ఉంటాయి. తాజగా.. ఓ చిరుత పులి.. హిప్పోకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. వేట కోసం వెళ్లిన చిరుతకు హిప్పో అకస్మాత్తుగా షాకిస్తుంది. దీన్ని చూసి నెటిజన్లు అస్సలు ఊహించలేదు అంటూ కామెంట్లు చేస్తున్నారు. సాధారణంగా.. అటవీ ప్రపంచంలో బతికేందుకు చిన్న జీవులను పెద్ద జంతువులు.. పెద్ద వాటిని క్రూర మృగాలు వేటాడుతుంటాయి. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. జంతువులు తమ కడుపు నింపడానికి ఆలోచించకుండా ఎవరిపైనైనా దాడి చేస్తాయి. సింహం, చిరుతపులి లాంటి జంతువులను (ఆకలి) అవసరమైనప్పుడు మాత్రమే వేటాడుతాయి. అయితే.. దీనిలో చిరుత ఆకలితో వేటకు బయలుదేరింది. ఈ క్రమంలో ఊహించనని పరిణామం జరిగింది.

వైరల్ అవుతున్న వీడియోలో.. ఆహారం కోసం వేటకు వెళ్లిన చిరుత బురదలో చేపల కోసం వేటాడుతుంటుంది. ఈ క్రమంలో నీటిగుర్రం (హిప్పో) దానిలోనే నిద్రిస్తూ ఉంటుంది. దాన్ని చూసుకోకుండా చిరుత.. దాని దగ్గరకు వెళుతుంది. దీంతో హిప్పో కోపంతో అకస్మాత్తుగా పైకి లేస్తుంది. దాన్ని ఆగ్రహంతో చిరుత అక్కడి నుంచి పరుగులు తీసింది. ఆ తర్వాత మరుసటి రోజు కూడా చిరుత అదే ప్రాంతానికి వేటకు వెళుతుంది. ఈ సారి దాని ఆశ ఫలిస్తుంది. చిరుతకు చేప దొరుకుంది. దాన్ని నోట కరుచుకొని.. చిరుత బురదలోనుంచి బయటపడేందుకు ఆపసోపాలు పడుతుంది.

వీడియో చూడండి..

ఈ వైరల్ వీడియోను Latest Sightings అనే యూట్యూబ్ ఛానెల్‌లో షేర్ చేయగా.. దీనిని 43 లక్షల మందికి పైగా నెటిజన్లు వీక్షించారు. అదే సమయంలో 10 వేల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేసారు. దీంతోపాటు నెటిజన్లు పలు రకాల కామెంట్లు చేస్తున్నారు.