AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video : ఇదెక్కడి షాక్ రా బాబోయ్… ఫ్రెండ్స్ ఇచ్చిన గిఫ్ట్‌కు నోరెళ్లబెట్టిన వధూవరులు..

పెళ్లి వేడుకల్లో వినూత్న కానుక వైరల్‌గా మారింది. చెన్నైలోని పూనమల్లిలో వివేక్ - స్టెల్లా పెళ్లి వేడుకలు ఘనంగా జరిగాయి. పెళ్లికి వచ్చిన బంధుగణంతో ఆ ప్రాంతమంతా సందడి నెలకొంది.

Viral Video : ఇదెక్కడి షాక్ రా బాబోయ్... ఫ్రెండ్స్ ఇచ్చిన గిఫ్ట్‌కు నోరెళ్లబెట్టిన వధూవరులు..
Marriage
Rajeev Rayala
|

Updated on: Jun 21, 2022 | 8:52 AM

Share

Viral Video: పెళ్లి వేడుకల్లో వినూత్న కానుక వైరల్‌గా మారింది. చెన్నైలోని పూనమల్లిలో వివేక్ – స్టెల్లా పెళ్లి వేడుకలు ఘనంగా జరిగాయి. పెళ్లికి వచ్చిన బంధుగణంతో ఆ ప్రాంతమంతా సందడి నెలకొంది. ఈ క్రమంలో వధూవరులకు కానుకగా వివేక్ ఫ్రెండ్స్ ఇచ్చిన బహుమతి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పెరుగుతున్న గ్యాస్ సిలిండర్, పెట్రోల్, డీజిల్ రేట్లను నిరసిస్తూ వధూవరులకు కట్టెల పొయ్యిని బహుమతిగా ఇచ్చారు స్నేహితులు. ఈ వినూత్న కానుకతో ఆశ్చర్యానికి గురవడం అక్కడున్న వారి వంతైంది.

ఇటీవలి కాలంగా గ్యాస్‌ సిలిండర్‌ ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఒక్క సిలిండర్‌ ధర ప్రస్తుతం 1100 రూపాయలకు చేరింది. పెరుగుతున్న సిలిండర్‌ ధరలతో సామాన్యులు సతమతమవుతున్నారు. మధ్య తరగతి ప్రజలకు గ్యాస్‌ సిలిండర్‌ ధరలు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇటీవల ఉజ్వల పథకం లబ్ధిదారులకు కాస్త ఊరట కల్పించింది మోదీ ప్రభుత్వం. ఒక్క సిలిండర్‌పై 200 సబ్సిడీ ఇవ్వనున్నట్టు చెప్పింది. మిగతా గ్యాస్‌ కనెక్షన్‌దారులకు ఎలాంటి ఊరట దక్కలేదు.

మరోవైపు.. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు కూడా ఈ మధ్య కాలంలో సెంచరీ దాటేశాయి. ఇటీవల ఎక్సైజ్‌ డ్యూటీని తగ్గించినప్పటికీ.. ప్రస్తుతం లీటర్‌ పెట్రోల్‌ 109 రూపాయలుగా ఉంది. ఓవైపు గ్యాస్‌.. మరోవైపు ఇంధన ధరలతో కుదేలవుతున్నారు జనం. పెరుగుతున్న ధరల్ని నిరసిస్తూ.. వివిధ రూపాల్లో నిరసన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా పెళ్లి కానుకగా కట్టెల పొయ్యిని ఇవ్వడం నవ్వులు పూయిస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి