International Yoga Day 2022: ప్రధాని నరేంద్ర మోడీ కర్ణాటక పర్యటన.. యోగా దినోత్సవ వేడుకలకు హాజరు..!

International Yoga Day 2022: ప్రపంచ వ్యాప్తంగా ఈ రోజు యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇక యోగా డే వేడుకలో సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ కర్ణాటకలోని..

International Yoga Day 2022: ప్రధాని నరేంద్ర మోడీ కర్ణాటక పర్యటన.. యోగా దినోత్సవ వేడుకలకు హాజరు..!
Follow us
Ganesh Mudavath

|

Updated on: Jun 21, 2022 | 5:37 PM

International Yoga Day 2022: ప్రపంచ వ్యాప్తంగా ఈ రోజు యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇక యోగా డే వేడుకలో సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ కర్ణాటకలోని మైసూరులో పాల్గొన్నారు. మైసూరు ప్యాలెస్ మైదానంలో ప్రధానితో పాటు 15 వేల మందికి పైగా యోగా వేడుకల్లో పాల్గొననున్నారు. అయితే మోడీ అంతకు ముందు మైసూర్‌లోని చాముండి కొండకు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మోడీతో పాటు గవర్నర్‌ థావర్‌చంద్‌ గెహ్లాట్‌, ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై, కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషిలు కూడా ఉన్నారు. చాముండేశ్వరి దేవిని పూజించే ముందు నాద దేవత అని పిలువబడే గణేషుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు మోడీ. అనంతరం యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.

ప్రపంచ వ్యాప్తంగా ప్రజలందరూ యోగా చేస్తున్నారు. ప్రతి సంవత్సరం జూన్ 21వ తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించింది ఐక్యరాజ్యసమితి. యోగాతో శారీరక, మానసిక వ్యాధులను నయం చేసుకోవచ్చు. పతంజలి మహర్షి ప్రపంచ మానవాళికి అందించిన అపురూపమైన వైద్యకానుక యోగా. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రకటించాలంటూ భారత ప్రభుత్వం 2014లో ఒక ముసాయిదా తీర్మానాన్ని ఐక్యరాజ్యసమితికి ప్రతిపాదించింది. 175 దేశాలు దీన్ని ఆమోదించాయి. అదే సంవత్సరం డిసెంబరు 11న ప్రధాని మోదీ చొరవతో అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జూన్ 21ని ప్రకటించింది UNO. ఏడాదిలో ప్రపంచవ్యాప్తంగా పగటి సమయం ఎక్కువగా ఉండటం జూన్ 21 ప్రత్యేకత. మైసూర్‌లో యోగా దినోత్సవంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొంటుండగా.. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో జరగనున్న యోగా దినోత్సవంలో పాల్గొంటారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి