International Yoga Day 2022 Live: ‘యోగా ఫర్ హ్యుమానిటీ’.. ఈ ఏడాది ఇదే నినాదం: ప్రధాని మోడీ

Ravi Kiran

| Edited By: Team Veegam

Updated on: Jun 22, 2022 | 5:56 PM

PM Modi Speech on International Day of Yoga Live Updates: ప్రపంచ వ్యాప్తంగా ప్రజలందరూ యోగా చేస్తున్నారు. ప్రతి సంవత్సరం జూన్ 21వ తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించింది ఐక్యరాజ్యసమితి.

International Yoga Day 2022 Live: 'యోగా ఫర్ హ్యుమానిటీ'.. ఈ ఏడాది ఇదే నినాదం: ప్రధాని మోడీ
Modi

ప్రపంచ వ్యాప్తంగా ప్రజలందరూ యోగా చేస్తున్నారు. ప్రతి సంవత్సరం జూన్ 21వ తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించింది ఐక్యరాజ్యసమితి. యోగాతో శారీరక, మానసిక వ్యాధులను నయం చేసుకోవచ్చు. పతంజలి మహర్షి ప్రపంచ మానవాళికి అందించిన అపురూపమైన వైద్యకానుక యోగా. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రకటించాలంటూ భారత ప్రభుత్వం 2014లో ఒక ముసాయిదా తీర్మానాన్ని ఐక్యరాజ్యసమితికి ప్రతిపాదించింది. 175 దేశాలు దీన్ని ఆమోదించాయి. అదే సంవత్సరం డిసెంబరు 11న ప్రధాని మోదీ చొరవతో అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జూన్ 21ని ప్రకటించింది UNO. ఏడాదిలో ప్రపంచవ్యాప్తంగా పగటి సమయం ఎక్కువగా ఉండటం జూన్ 21 ప్రత్యేకత. మైసూర్‌లో యోగా దినోత్సవంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొంటుండగా.. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో జరగనున్న యోగా దినోత్సవంలో పాల్గొంటారు.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 21 Jun 2022 02:00 PM (IST)

    హిమవీరుల యోగాసనాలు..

    ఇండో టిబెట‌న్ బోర్డర్ పోలీసులు యోగా దినోత్సవాన్ని ఘ‌నంగా నిర్వహించారు. హిమాల‌య శ్రేణుల్లో త‌మ ఆస‌నాల‌తో యోగా డేలో పాల్గొన్నారు. ల‌డాఖ్‌, హిమాచ‌ల్ ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, సిక్కిమ్‌, అరుణాచ‌ల్ ప్రదేశ్‌లో ఐటీబీ పోలీసులు యోగాస‌నాల‌తో త‌మ శ‌రీర ధారుఢ్యాన్ని పెంచుకుంటున్నారు. యోగా దినోత్సవం సంద‌ర్భంగా ఐటీబీపీ ఓ పాట‌ను రాసి పాడారు.

  • 21 Jun 2022 01:30 PM (IST)

    యోగా దినోత్సవంలో రాందేవ్‌ బాబా..

    ఉత్తరాఖండ్‌ హరిద్వార్‌లో యోగా దినోత్సవం ఘనంగా జరిగింది..రాందేవ్‌ బాబా ఆశ్రమంలో ప్రత్యేక యోగా కార్యక్రమం నిర్వహించారు..ఇందులో వందల మంది ప్రజలు పాల్గొని ఆసనాలు వేశారు. ఇటు రిషికేశ్‌లో నిర్వహించిన యోగా కార్యక్రమంలో ఉత్తరాఖండ్​ సీఎం పుష్కర్​సింగ్​ధామి పాల్గొన్నారు.

  • 21 Jun 2022 01:07 PM (IST)

    యోగా చేసిన బాలయ్య..

    Balakrishna

    యోగా చేస్తే మనసు ఆధీనంలో ఉంటుంది అన్నారు నటసింహ నందమూరి బాలకృష్ణ.అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్లో నిర్వహించిన యోగా సెలబ్రేషన్స్‌లో బాలయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.యోగా సెలబ్రేషన్స్‌లో పార్టిసిపేట్ చేసిన వారికి అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియ చేశారాయన.

  • 21 Jun 2022 12:18 PM (IST)

    విజయవాడలో యోగా డే కార్యక్రమాలు..

    అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని విజయవాడలో ఏపీ ఆయుష్‌శాఖ యోగా డే నిర్వహించింది..ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజనీ హాజరైయ్యారు..ఆపై విద్యార్థులతో కలిసి ఆమె యోగా ఆసనాలు వేశారు.. ప్రతి ఒక్కరూ యోగా చేయాలన్నారు మంత్రి..యోగాతో పాజిటివ్ థింకింగ్ వస్తోందని అన్నారు..మన జీవన శైలిని విదేశీయులు కీర్తిస్తూ ఉంటారని అది భారతదేశ గొప్పతనమన్నారు మంత్రి..

  • 21 Jun 2022 11:46 AM (IST)

    యోగా కార్యక్రమంలో రాష్ట్రపతి..

    8వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్రపతి రామ్‌ నాథ్‌ కోవింద్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘మన ప్రాచీన భారతీయ వారసత్వంలో యోగా ఒక భాగం. యోగా మానవాళికి భారత్‌ ఇచ్చిన గొప్ప వరం. శరీరం, ఆత్మలను పరిపూర్ణం చేసే అద్భుత సాధనం యోగా’ అంటూ రాష్ట్రపతి చెప్పుకొచ్చారు.

  • 21 Jun 2022 11:12 AM (IST)

    పార్లమెంటు ఆవరణలో లోక్‌సభ స్పీకర్, ఎంపీలు యోగాసనాలు

    అంతర్జాతీయ యోగా డే వేడుకలను పార్లమెంటు ఆవరణలో నిర్వహించారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాతో పలు పార్టీలకు అతీతంగా పలువురు ఎంపీలు ఈ కార్యక్రమంలో పాల్గొని యోగా చేశారు.

  • 21 Jun 2022 11:07 AM (IST)

    కురుక్షేత్రలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ యోగా..

    హర్యానా‌లోని కురుక్షేత్రలో జరిగిన యోగా డే వేడుకల్లో కేంద్ర మంత్రి పియూష్ గోయల్ పాల్గొన్నారు. ఉత్సాహంగా యోగాసనాలు వేశారు.

  • 21 Jun 2022 11:05 AM (IST)

    పశ్చిమ బెంగాల్ గవర్నర్ యోగాసనాలు

    కొల్‌కత్తాలోని రాజ్‌భవన్‌లో అంతర్జాతీయ యోగా డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగ్‌దీప్ ధన్కర్ యోగాసనాలు వేశారు.

  • 21 Jun 2022 11:03 AM (IST)

    రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ యోగాసనాలు

    ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ యోగాసనాలు వేశారు.

  • 21 Jun 2022 11:02 AM (IST)

    ముంబైలో పండుగలా యోగా డే వేడుకలు..

    ముంబైలో అంతర్జాతీయ యోగా డే వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ముంబైలోని గేట్ వే ఆఫ్ ఇండియా వద్ద పలువురు ప్రజలు ఉదయాన్నే యోగాసనాలు వేశారు.

  • 21 Jun 2022 11:00 AM (IST)

    నేడు తాజ్‌మహల్‌ ఎంట్రీ ఉచితం..

    8వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం పర్యాటకులకు శుభవార్త తెలిపారు. ఈరోజు తాజ్‌ మహల్‌ను సందర్శించే వారు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని ఆర్కియాలజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా సోమవారం ఈ విషయాన్ని తెలిపింది. తాజ్‌మహల్‌తో పాటు ఆగ్రా ఫోర్ట్‌లో కూడా ఉచితంగా ఎంట్రీకి అవకాశం ఇచ్చారు.

  • 21 Jun 2022 11:00 AM (IST)

    హైదరాబాద్‌లో యోగా డే వేడుకలు.. పాల్గొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

    హైదరాబాద్‌లో జరిగిన యోగా దినోత్సవ వేడుకల్లో కేంద్ర మంత్రి జీ.కిషన్ రెడ్డి, స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు తదితరులు పాల్గొని యోగాసనాలు వేశారు.

  • 21 Jun 2022 10:46 AM (IST)

    అమర్నాథ్ గృహ వద్ద భద్రతా సిబ్బంది యోగాసనాలు..

    జమ్ముకశ్మీర్: అమర్నాథ్ గృహ వద్ద బందోబస్తు విధుల్లో ఉన్న భద్రతా బలగాలు మంగళవారం ఉదయం యోగా చేశారు. దాదాపు 450 మంది జవాన్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

  • 21 Jun 2022 10:43 AM (IST)

    యోగా చేసిన కేరళ గవర్నర్ అరీఫ్ మొహమ్మద్ ఖాన్

    తిరువనంతపురంలోని రాజ్ భవన్‌లో యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కేరళ గవర్నర్ అరీఫ్ మొహమ్మెద్ ఖాన్ యోగాసనాలు వేశారు.

  • 21 Jun 2022 10:39 AM (IST)

    హరిద్వార్‌లో యోగా చేసిన బాబా రాందేవ్

    ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ హరిద్వార్‌లో తన అనుచరులు 10 వేల మందితో కలిసి యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా యోగాతో ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాల గురించి వివరించారు. యోగా మతపరమైనది కాదని.. ఆధ్యాత్మికమైనదిగా పేర్కొన్నారు.

  • 21 Jun 2022 10:28 AM (IST)

    దేశ వ్యాప్తంగా కొనసాగుతోన్న అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమలు..

    ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా పలు చోట్ల ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.. ప్రధాని నుంచి సాధారణ ప్రజల వరకు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.. యోగా దినోత్సవంలో దేశప్రజలంతా భాగస్వాములై విజయవంతం చేయాలని ప్రధాని మోదీ ట్విటర్‌ ద్వారా కోరారు. దేశవ్యాప్తంగా 75 నగరాల్లో యోగా వేడుకలు జరుగుతున్నాయి.

  • 21 Jun 2022 09:17 AM (IST)

    రోగాల బారిన పడిన తర్వాత యోగా చేద్దామనుకోవద్దు: మంత్రి హరీష్ రావు

    అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాలు దేశవ్యాప్తంగా సాగుతున్నాయి. ఈ క్రమంలోనే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మంత్రి హరీష్‌ రావు సిద్ధిపేటలో యోగా కార్యక్రమంలో పాల్గొని యోగాసనాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘యోగా నిత్య జీవితంలో భాగమైందని మంత్రి హరీష్ రావు అన్నారు. కొంత మంది రోగాల బారిన పడ్డాక యోగా చేద్దామని అనుకుంటున్నారని, అలా కాకుండా నిత్యం యోగా చేయడం వాళ్ళ పూర్తి ఆయుష్‌తో నిండు నూరేళ్లు బతుకుతారని తెలిపారు.

  • 21 Jun 2022 07:49 AM (IST)

    యోగాసనాలు చేస్తోన్న ప్రధాని మోడీ..

    మైసూర్‌లో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ ప్రజలతో కలిసి యోగాసనాలు చేస్తున్నారు.

    Pm Modi 8

  • 21 Jun 2022 07:25 AM (IST)

    యోగా అంటే ఏకాగ్రత సాధించడం – ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

    యోగా అంటే ఏకాగ్రత సాధించడమని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తెలిపారు. యోగా ఆత్మవిశ్వాసం కల్పిస్తుందని.. కాలతీతమైనది, ఆచరణయోగ్యమైంది యోగా అంటూ వెంకయ్యనాయుడు చెప్పారు.

  • 21 Jun 2022 07:05 AM (IST)

    యోగా ఫర్ హ్యుమానిటీ.. ఈ ఏడాది నినాదం: ప్రధాని మోదీ

    యోగా మనల్ని బలవంతులుగా మారుస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. యోగా ప్రజలను, దేశాలను కలుపుతుందని తెలిపారు. యోగాతో మొదలైతే ఆ రోజు ఎంతో అద్భుతంగా ఉంటుందన్నారు. ఈ ఏడాది థీమ్ మానవత్వం కోసం యోగా అని ప్రధాని మోడీ పేర్కొన్నారు. యోగాతో శాంతి వస్తుందని మహర్షులు, ఆచార్యులు చెప్పారని మోడీ అన్నారు. 75 చారిత్రిక ప్రాంతాల్లో యోగా కార్యక్రమాన్ని జరుపుకుంటున్నామని ప్రధాని స్పష్టం చేశారు. యోగా ఫర్ హ్యుమానిటీ.. ఈ ఏడాది నినాదమని అన్నారు. యోగా మనందరిదీ.. ఏ ఒక్కరిదీ కాదని తెలిపారు. యోగాతో శారీరిక, మానసిక వ్యాధులు నయం అవుతాయన్నారు.

  • 21 Jun 2022 06:54 AM (IST)

    పరేడ్ గ్రౌండ్స్ యోగా కార్యక్రమంలో పాల్గొన్న వెంకయ్యనాయుడు, కిషన్ రెడ్డి

    సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లోని యోగా కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు.

  • 21 Jun 2022 06:46 AM (IST)

    మైసూర్ ప్యాలస్ చేరుకున్న ప్రధాని మోడీ..

    యోగా కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోడీ, కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై, కేంద్ర మంత్రి సర్బానందా సోనోవాలా మైసూర్ ప్యాలస్‌ చేరుకున్నారు.

  • 21 Jun 2022 06:42 AM (IST)

    14 వేల అడుగుల ఎత్తులో యోగా సాధన

    ఇండో-టిబెటన్ సరిహద్దు పోలీసు సిబ్బంది 14,500 అడుగుల ఎత్తులో యోగా చేస్తున్నారు.

  • 21 Jun 2022 06:42 AM (IST)

    ఐటీబీపీ యోగా సాధన

    అరుణాచల్ ప్రదేశ్‌లోని లోహిత్‌పూర్‌లో ఇండో-టిబిట్‌న్ పోలీస్ యోగా సాధన చేస్తోన్న దృశ్యాలు.

  • 21 Jun 2022 06:41 AM (IST)

    బ్రహ్మపుత్ర నది ఒడ్డున యోగా సాధనా చేస్తోన్న సైనికులు

    అస్సాం రాజధాని గౌహతిలో బ్రహ్మపుత్ర నది ఒడ్డున సైనికులు యోగా సాధన చేస్తున్నారు.

Published On - Jun 21,2022 6:30 AM

Follow us