#GHMCElections: గ్రేటర్ ఎన్నికలకు మోగిన నగారా.. షెడ్యూల్, నోటిఫికేషన్ విడుదల..
తెలంగాణలో మరో ఎన్నికలకు రంగం సిద్ధమైంది. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు వేగంగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే ఎన్నికల..

GHMC Elections: తెలంగాణలో మరో ఎన్నికలకు రంగం సిద్ధమైంది. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు వేగంగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. ఎన్నికల కమిషన్ ఈరోజు షెడ్యూల్‌తో పాటు నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. రేపటి నుంచి 20 వరకు నామినేషన్ల స్వీకరణ ఉండనుండగా.. ఈ నెల 21న నామినేషన్ల పరిశీలన.. 22న నామినేషన్ల విత్ డ్రాకు అవకాశం ఇచ్చారు. అలాగే డిసెంబర్ 1వ తేదీన ఉదయం 7 గంటల నుంచి రాత్రి 6 గంటల వరకు పోలింగ్ జరగనుండగా.. డిసెంబర్ 4న కౌంటింగ్, ఫలితాలు వెలువడతాయని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారధి స్పష్టం చేశారు.
గత రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలు జరుగుతాయని.. రిజర్వేషన్ల అంశం ప్రభుత్వానికి సంబంధించిందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి తెలిపారు. బ్యాలెట్ పద్దతిలోనే జీహెచ్ఎంసీ ఎన్నికలు జరుగుతాయన్న ఆయన.. అసెంబ్లీ ఎన్నికల నాటి ఓటర్ల జాబితా ప్రకారమే ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. అన్ని రాజకీయ పార్టీలతో చర్చించి ఓటర్ల తుది జాబితా ప్రకటిస్తామన్నారు. ఇక 2016 నాటి రిజర్వేషన్ల ప్రకారం మేయర్ పదవి మహిళకు రిజర్వ్ అయ్యి ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారధి తెలిపారు. కాగా, జీహెచ్ఎంసీ ఎన్నికలకు అన్ని ప్రధాన పార్టీలు సన్నద్ధమయ్యాయి. ఇప్పటికే ఆయా నియోజకవర్గాలకు ఇన్‌చార్జీలను నియమించి బాధ్యతలను అప్పగించాయి. ఇక దుబ్బాక ఓటమి నేపథ్యంలో అధికార టీఆర్ఎస్ పార్టీ జీహెచ్ఎంసీ ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది.
Also Read:
కొత్త జిల్లాల ఏర్పాటుకు జగన్ సర్కార్ మరో ముందడుగు.. ఆ జోన్ల పరిధిలోనే..!
ఏపీలో మరో రెండు రోజులు వర్షాలు.. ఆ జిల్లాల ప్రజలకు అలెర్ట్..!
ఏపీ రైతులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్.. వారి ఖాతాల్లోకి వడ్డీ రాయితీ సొమ్ము జమ.!
ఇంజనీరింగ్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. జేఎన్టీయూహెచ్ కీలక నిర్ణయాలు.. ఈసారి సప్లిలో పాసైతే.!
డిసెంబర్ 1 నుంచి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్.? వైరల్ అవుతున్న ట్వీట్.. వివరణ ఇచ్చిన కేంద్రం..
సీఎస్‌కే ఫ్యాన్స్‌కు షాక్.. ఐపీఎల్ 2021లో కొత్త జట్టుకు కెప్టెన్‌గా సురేష్ రైనా.!
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. సచివాలయాల్లోని ఇంజనీరింగ్ అసిస్టెంట్లలకు మరో బాధ్యత..
సాయం కోరిన సోనూసూద్.. స్పందించిన నెటిజన్లు.. థ్యాంక్యూ చెప్పిన రియల్ హీరో..
