AP New Districts: కొత్త జిల్లాల ఏర్పాటుకు జగన్ సర్కార్ మరో ముందడుగు.. ఆ జోన్ల పరిధిలోనే..!
ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియపై రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు ముందుకేస్తోంది. ఇందులో భాగంగా ట్రెజరీ ద్వారా అధికారులు, ఉద్యోగుల..

AP New Districts: ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియపై రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు ముందుకేస్తోంది. ఇందులో భాగంగా ట్రెజరీ ద్వారా అధికారులు, ఉద్యోగుల వివరాలను సేకరిస్తోంది. ఉద్యోగుల స్వస్థలం, విధుల్లో చేరిన తేదీ, ఎక్స్‌పీరియన్స్, సీనియారిటీ మొదలగున కీలక సమాచారాన్ని పరిగణలోకి తీసుకుంటోంది. కొత్త జిల్లాల ప్రకటన వచ్చిన రెండు వారాల్లోగా సిబ్బంది సర్దుబాటు చేసేలా ప్రణాళికలను రూపొందిస్తోంది.
జిల్లా పరిపాలనకు తగ్గుట్టుగా ఐఏఎస్‌లతో పాటు అధికారులు, సిబ్బందిని సర్దుబాటు చేయనుంది. సీనియారిటీని పరిగణలోకి తీసుకుని ఐఏఎస్‌లు కలెక్టర్లు అవుతారు. ప్రతీ జిల్లాకు ముగ్గురు జేసీలు ఉంటారు.. వారిలో ఇద్దరు ఐఏఎస్‌లు.. మరొకరు నాన్ ఐఏఎస్ కేడర్ అధికారి. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత వీరిని యధాతధంగా కొనసాగిస్తారా.? లేదా.? అన్నది తెలియాల్సి ఉంది.
రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం నాలుగు జోన్లు ఉన్న సంగతి తెలిసిందే. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఒకటో జోన్ కాగా.. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా రెండో జోన్.. ఇక గుంటూరు, ప్రకాశం, నెల్లూరు మూడో జోన్ కాగా.. రాయలసీమలోని నాలుగు జిల్లాలు నాలుగో జోన్ కిందకు వస్తాయి. ఇవి కాకుండా ఇప్పుడు కొత్తగా జోన్లు ఏర్పాటు చేయాలంటే రాష్ట్రపతి ఆమోదం కావాల్సి ఉండగా.. ప్రస్తుతం ఉన్న 4 జోన్ల పరిధిలోనే కొత్త జిల్లాలను చేర్చాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం జిల్లాలలో శాఖలవారీగా అధికారులు ఉన్న సంగతి తెలిసిందే. వారు ఆయా శాఖలను పర్యవేక్షిస్తున్నారు. అయితే కొత్త జిల్లాలు ఏర్పాటైన తర్వాత వీరి తర్వాత స్థానాల్లో ఉన్న అధికారులను ఆయా జిల్లాలకు అధికారులుగా నియమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read:
ఏపీలో మరో రెండు రోజులు వర్షాలు.. ఆ జిల్లాల ప్రజలకు అలెర్ట్..!
ఏపీ రైతులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్.. వారి ఖాతాల్లోకి వడ్డీ రాయితీ సొమ్ము జమ.!
ఇంజనీరింగ్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. జేఎన్టీయూహెచ్ కీలక నిర్ణయాలు.. ఈసారి సప్లిలో పాసైతే.!
డిసెంబర్ 1 నుంచి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్.? వైరల్ అవుతున్న ట్వీట్.. వివరణ ఇచ్చిన కేంద్రం..
సీఎస్‌కే ఫ్యాన్స్‌కు షాక్.. ఐపీఎల్ 2021లో కొత్త జట్టుకు కెప్టెన్‌గా సురేష్ రైనా.!
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. సచివాలయాల్లోని ఇంజనీరింగ్ అసిస్టెంట్లలకు మరో బాధ్యత..
సాయం కోరిన సోనూసూద్.. స్పందించిన నెటిజన్లు.. థ్యాంక్యూ చెప్పిన రియల్ హీరో..