ఏపీ రైతులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్.. వారి ఖాతాల్లోకి వడ్డీ రాయితీ సొమ్ము జమ.!
రోనా కష్టకాలంలో కూడా సంక్షేమ పధకాలను అమలు చేయడంలో జగన్ సర్కార్ ఏమాత్రం వెనుకడుగు వేయట్లేదు. నేడు 'వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాల' పధకాన్ని..

YSR Zero Interest Scheme: కరోనా కష్టకాలంలో కూడా సంక్షేమ పధకాలను అమలు చేయడంలో జగన్ సర్కార్ ఏమాత్రం వెనుకడుగు వేయట్లేదు. నేడు ‘వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాల’ పధకాన్ని సీఎం జగన్ వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. ఇవాళ జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి బటన్ నొక్కి నిధులను విడుదల చేయనున్నారు. 2019 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి సకాలంలో పంట రుణాలు చెల్లించిన 14.58 లక్షల మంది రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి వడ్డీ రాయితీ డబ్బును జమ చేయనున్నారు. ఇందుకు సంబంధించి రూ. 510.32 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. అలాగే అక్టోబర్ నెలలో కురిసిన అకాల వర్షాలకు పంటలు నష్టపోయిన వ్యవసాయ, ఉద్యానవన రైతులకూ ఇన్‌పుట్ సబ్సిడీ కింద రూ. 132 కోట్లు అందించనుంది.
పంట నష్టం జరిగిన సీజన్‌లోనే పెట్టుబడి రాయితీ అందించాలన్న సీఎం జగన్ నిర్ణయం మేరకు.. అక్టోబర్ నెలలో జరిగిన నష్టంపై అధికారులు అంచనా వేసి.. నెల రోజుల వ్యవధిలోనే పెట్టుబడి రాయితీ సొమ్మును రైతుల ఖాతాల్లోకి జమ చేస్తున్నారు. అలాగే పంట రుణాలను సకాలంలో చెల్లిస్తున్న చిన్న, సన్నకారు రైతులకు భరోసా కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అర్హులైన ప్రతీ రైతుకు సున్నావడ్డీ రాయితీని అందించేలా చర్యలు తీసుకుంటోంది.
Also Read:
ఏపీలో మరో రెండు రోజులు వర్షాలు.. ఆ జిల్లాల ప్రజలకు అలెర్ట్..!
ఇంజనీరింగ్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. జేఎన్టీయూహెచ్ కీలక నిర్ణయాలు.. ఈసారి సప్లిలో పాసైతే.!
డిసెంబర్ 1 నుంచి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్.? వైరల్ అవుతున్న ట్వీట్.. వివరణ ఇచ్చిన కేంద్రం..
సీఎస్‌కే ఫ్యాన్స్‌కు షాక్.. ఐపీఎల్ 2021లో కొత్త జట్టుకు కెప్టెన్‌గా సురేష్ రైనా.!
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. సచివాలయాల్లోని ఇంజనీరింగ్ అసిస్టెంట్లలకు మరో బాధ్యత..
సాయం కోరిన సోనూసూద్.. స్పందించిన నెటిజన్లు.. థ్యాంక్యూ చెప్పిన రియల్ హీరో..