నాని-నజ్రియా మూవీకి టైటిల్‌ ఫిక్స్‌.. భలే ఇంట్రస్టింగ్‌గా ఉందే..!

వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాచురల్ స్టార్ నాని నటించనున్న విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ మూవీ ద్వారా మలయాళ బ్యూటీ

  • Tv9 Telugu
  • Publish Date - 8:55 am, Tue, 17 November 20
నాని-నజ్రియా మూవీకి టైటిల్‌ ఫిక్స్‌.. భలే ఇంట్రస్టింగ్‌గా ఉందే..!

Nani movie title: వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాచురల్ స్టార్ నాని నటించనున్న విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ మూవీ ద్వారా మలయాళ బ్యూటీ నజ్రియా టాలీవుడ్‌కి ఎంట్రీ ఇస్తోంది. ఇటీవలే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రాగా.. ఈ నెల 21న టైటిల్‌ అనౌన్స్‌మెంట్‌ రానుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీకి ‘అంటే సుందరానికి’ అన్న టైటిల్‌ని ఫిక్స్ చేసినట్లు టాలీవుడ్‌లో టాక్ నడుస్తోంది. రొమాంటిక్ ప్రేమ కథగా ఈ మూవీ తెరకెక్కనుందని తెలుస్తోంది. (కరోనా అప్‌డేట్స్‌: తెలంగాణలో 952 కొత్త కేసులు.. ముగ్గురు మృతి.. కోలుకున్న 1,602 మంది)

కాగా ప్రస్తుతం నాని, శివ నిర్వాణ దర్శకత్వంలో టక్ జగదీష్‌లో నటిస్తున్నారు. ఈ మూవీలో నాని సరసన ఐశ్వర్య రాజేష్‌, రీతూ వర్మ నటించనున్నారు. షైన్ స్క్రీన్స్‌ నిర్మిస్తోన్న ఈ మూవీకి థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ తరువాత రాహుల్‌ సంక్రీత్యన్‌ దర్శకత్వంలో శ్యామ్ సింగరాయ్‌లో నటించనున్నారు. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్‌ నిర్మిస్తోన్న ఈ మూవీలో సాయి పల్లవి, కృతి శెట్టి హీరోయిన్లుగా నటించనున్నారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందించనున్న ఈ మూవీ డిసెంబర్‌ నుంచి సెట్స్ మీదకు వెళ్లనుంది. (ఈ వీడియో చూశాక నా కళ్లలో నీళ్లు వచ్చాయి.. పూరీ భావోద్వేగ ట్వీట్‌)