ఈ వీడియో చూశాక నా కళ్లలో నీళ్లు వచ్చాయి.. పూరీ జగన్నాథ్ భావోద్వేగ ట్వీట్
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే డేరింగ్ అండ్ డ్యాషింగ్ దర్శకుడు పూరీ జగన్నాథ్.. తాజాగా ఓ వీడియోను అభిమానులతో షేర్ చేసుకున్నారు.

Puri Jagannadh video: సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే డేరింగ్ అండ్ డ్యాషింగ్ దర్శకుడు పూరీ జగన్నాథ్.. తాజాగా ఓ వీడియోను అభిమానులతో షేర్ చేసుకున్నారు. అందులో ఓ ధియేటర్ యజమాని థియేటర్‌ని ఓపెన్ చేయడం, లోపల కార్మికులు దాన్ని శుభ్రం చేస్తుండటం, థియేటర్‌ని తెరిచే సమయంలో ఆ రోజులు మళ్లీ వస్తాయా..? దేవుడికే తెలుసు అని యజమాని అనుకోవడం.. లోపలికి వెళ్లి సీట్లు, ప్రొజెక్టర్ అన్నింటిని చూడటం, నిదానంగా జనాలు థియేటర్‌లోపలికి వస్తుండటం చూపించారు. థియేటర్‌లోకి మళ్లీ రండి అంటూ కన్నడ సినీ పరిశ్రమ ప్రముఖులు పునీత్ రాజ్‌కుమార్, దర్శన్ పలువురు ఈ వీడియోలో ప్రేక్షకులకు పిలుపునిచ్చారు. (Bigg Boss 4: అభి-అఖిల్ మధ్య మాటల యుద్ధం.. హారికపై సొహైల్ బాడీ షేమింగ్ కామెంట్లు)
ఇక దీన్ని షేర్ చేసిన పూరీ.. ఈ వీడియోను చూశాక నా కళ్లలో నీళ్లు వచ్చాయి. మళ్లీ ఆ రోజులు రావాలి. విజిల్స్ వేయాలి. పేపర్లు ఎగరాలి. చొక్కాలు చిరగాలి. సినిమా థియేటర్. మన అమ్మ అని కామెంట్ పెట్టారు. ఇక పూరీ ట్వీట్‌ని హరీష్ శంకర్ కూడా రీట్వీట్ చేశారు. కాగా గత నెల 15 నుంచే థియేటర్‌లను తెరిచేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానీ కరోనా కేసుల సంఖ్య తగ్గని నేపథ్యంలో ఇంకా చాలా రాష్ట్రాల్లో థియేటర్లు తెరుచుకోలేదు. (Bigg Boss 4: హాట్ హాట్‌గా నామినేషన్ల ప్రక్రియ.. ఆ ఐదుగురిలో ఈసారి ఎవరు బయటికి..!)
— Harish Shankar .S (@harish2you) November 16, 2020