Hyderabad: వేణు స్వామిని నమ్ముకున్న మాజీ ప్రధాని కుమారుడు.. కుటుంబంతో సహా హైదరాబాద్‌లో ప్రత్యక్షం

వేణు స్వామి ఆధ్వర్యంలో రాజ్య శ్యామల, భగలాముఖి, తారా, చిన్న మస్తా వమాచార పూజలు చేశారు. కర్ణాటకలో బీజేపీకి మళ్ళీ దగ్గర అవుతుంది జేడిఎస్. లోక్ సభ ఎన్నికల్లో జేడిఎస్-బీజేపీ కలిసి పోటీ చేస్తాయని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే బీజేపీ పొత్తు పై ఏకాభిప్రాయం లేదు. వేణు స్వామి పూజలు ఫలిస్తాయా..కర్ణాటక లో మళ్ళీ జేడిఎస్ చక్రం తిప్పుతుందా అని వేచి చూడాలి. హెచ్ డీ రెవన్నకు ఇలాంటి పూజలు అంటే ప్రగాఢ నమ్మకం. అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం జేడిఎస్ కు 19 సీట్లు మాత్రమే వచ్చాయి. గతంతో పోలిస్తే జేడిఎస్ కు సీట్ల సంఖ్య బాగా తగ్గింది...

Hyderabad: వేణు స్వామిని నమ్ముకున్న మాజీ ప్రధాని కుమారుడు.. కుటుంబంతో సహా హైదరాబాద్‌లో ప్రత్యక్షం
Hd Revanna Meets Venu Swamy
Follow us
Ranjith Muppidi

| Edited By: Narender Vaitla

Updated on: Jul 29, 2023 | 7:15 PM

కర్నాటకలో మాజీ ప్రధాని దేవ గౌడ కుటుంబానికి పూజల విషయంలో ఎంతో పేరు ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘోర పరాభవం కారణంగా మంచి రోజులు రావాలని దేవుళ్లను, జ్యోతిష్యులను దేవెగౌడ కుటుంబం ఆశ్రయిస్తుంది. హైదరాబాద్‌లో దేవెగౌడ పెద్ద కుమారుడు హెచ్.డీ రేవన్న కుటుంబ సభ్యులతో కలిసి సీక్రెట్‌గా పర్యటించారు. ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి ని కలిశారు. వేణు స్వామి ఆధ్వర్యంలో రాజ్య శ్యామల, భగలాముఖి, తారా, చిన్న మస్తా వమాచార పూజలు చేశారు. కర్ణాటకలో బీజేపీకి మళ్ళీ దగ్గర అవుతుంది జేడిఎస్. లోక్ సభ ఎన్నికల్లో జేడిఎస్-బీజేపీ కలిసి పోటీ చేస్తాయని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే బీజేపీ పొత్తు పై ఏకాభిప్రాయం లేదు. వేణు స్వామి పూజలు ఫలిస్తాయా..కర్ణాటక లో మళ్ళీ జేడిఎస్ చక్రం తిప్పుతుందా అని వేచి చూడాలి.

హెచ్ డీ రెవన్నకు ఇలాంటి పూజలు అంటే ప్రగాఢ నమ్మకం. అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం జేడిఎస్ కు 19 సీట్లు మాత్రమే వచ్చాయి. గతంతో పోలిస్తే జేడిఎస్ కు సీట్ల సంఖ్య బాగా తగ్గింది. అందుకే పూర్వ వైభవం కోసం అ పార్టీ నేతలు తపిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్టీలో రెవన్న చాలా సైలెంట్ అయ్యారు. పార్టీ పై తన తమ్ముడు కుమార స్వామి ఆధిపత్యాన్ని తట్టుకోలేక పోతునట్టు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. హసన్ అసెంబ్లీ సీట్ విషయంలో తన భార్యకు సీట్ ఇవ్వకుంటే పార్టీ వదులుతానని తన తండ్రికి అల్టిమేటం ఇచ్చాడు. ప్రస్తుతానికి జేడిఎస్ చీఫ్ గా 91 ఏళ్ల దేవెగౌడ వ్యవహరిస్తున్నాడు. అయితే పార్టీ పై పట్టు కోసం అన్నదమ్ముల మధ్య పోరాటం చాలా రోజుల నుండి నడుస్తుంది. రాజ్య శ్యామల యాగం రెవన్న కు ఏమాత్రం మేలు చేస్తుందో వేచి చూడాలి.

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే