చనిపోయిన పందుల కళేబరాలతో కల్తీ నూనె..అదే హోటల్స్‌కు

కల్తీ, కల్తీ, కల్తీ…ఇప్పుడు ప్రపంచమంతా కల్తీతో నిండిపోయింది. తాను బాగుపడితే చాలు..మిగతావారు నాశనమైపోయినా పర్లేదు అనే ఆలోచన సమాజాన్ని కృందీస్తుంది. విచిత్రమేమిటంటే ఇలా మోసాలు చేసేవారు కూడా ఎక్కడో ఓ చోట కల్తీ బారిన పడేవారే. కాడిని తన్నేవాడు ఒకడైతే..వాడి తలను తన్నేవాడు మరొకడు. తాజాగా జంతువుల కళేబరాలతో వంట నూనె తయారు చేస్తోన్న ముఠాను రంగారెడ్డి పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లాలోని కొత్తూరు మండలం తిమ్మాపూర్ పంచాయితీ పరిధిలోని రైల్వేస్టేషన్ దగ్గర..కొందమంది వ్యాపారులు కలిసి హరి […]

చనిపోయిన పందుల కళేబరాలతో కల్తీ నూనె..అదే హోటల్స్‌కు
Follow us
Ram Naramaneni

|

Updated on: Mar 02, 2020 | 6:47 PM

కల్తీ, కల్తీ, కల్తీ…ఇప్పుడు ప్రపంచమంతా కల్తీతో నిండిపోయింది. తాను బాగుపడితే చాలు..మిగతావారు నాశనమైపోయినా పర్లేదు అనే ఆలోచన సమాజాన్ని కృందీస్తుంది. విచిత్రమేమిటంటే ఇలా మోసాలు చేసేవారు కూడా ఎక్కడో ఓ చోట కల్తీ బారిన పడేవారే. కాడిని తన్నేవాడు ఒకడైతే..వాడి తలను తన్నేవాడు మరొకడు.

తాజాగా జంతువుల కళేబరాలతో వంట నూనె తయారు చేస్తోన్న ముఠాను రంగారెడ్డి పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లాలోని కొత్తూరు మండలం తిమ్మాపూర్ పంచాయితీ పరిధిలోని రైల్వేస్టేషన్ దగ్గర..కొందమంది వ్యాపారులు కలిసి హరి ఫీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ (కెడియా) పరిశ్రమను గొప్పగా స్టార్ట్ చేశారు. పేరు గొప్ప..ఊరు దిబ్బ అన్నట్టు వీరు అక్కడ చేసేది కల్తీ నూనె వ్యాపారం. చనిపోయిన పందులు, ఇతర జంతువులు కళేబరాలతో నూనె తయారు చేసి అమ్మడం వీరి వ్యాపారం. కొన్నాళ్లుగా గుట్టుగా నడుస్తోన్న వీరి కల్తీ వ్యాపారం గుట్టు రట్టైంది. సమాచారం అందండంతో..పోలీసులు… రెవిన్యూ అధికారుల సహకారంతో పరిశ్రమలో దాడులు నిర్వహించారు. మొత్తం 8 మందిని అదుపులోకి తీసుకుని పరిశ్రమను మూసివేసిన పోలీసులు.. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఇదొక్కటే కాదు..శివారు ప్రాంతాల్లో చాలామంది ఇదే తరహా దందాలకు పాల్పడుతున్నారు. దీన్ని బట్టే అర్థమైవుంటుంది…మనం బయట తినే ఫుడ్ ఎంత కల్తీనో.