Hyderabad: ప్రమాదవశాత్తు బావిలో పడిపోయిన ఐదేళ్ల బాలుడు.. కొనసాగుతున్న రెస్క్యూ!
రంగారెడ్డి జిల్లాలోని మైలార్‌దేవ్‌పల్లిలో తీవ్ర విషాదం వెలుగు చూసింది. ఇంటి ముందు ఆడుకుంటున్న ఐదేళ్ల బాలుడు ప్రమాదవశాత్తు బావిలో పడిపోడి ప్రాణాలు కోల్పోయాడు. సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, డీఆర్ఎఫ్ సిబ్బంది మృతదేహాన్ని బయటకు తీసేందుకు సహాయక చర్యలు చేపట్టారు. కాగా మృతుడు బిహార్‌కు చెందిన ప్రిన్స్‌గా పోలీసులు గుర్తించారు.

రంగారెడ్డి జిల్లాలోని మైలార్‌దేవ్‌పల్లిలో తీవ్ర విషాదం వెలుగు చూసింది. ఇంటిముందుకు ఆడుకుంటున్న ఓ బాలుడు ప్రమాదవశాత్తు బావిలో పడిపోడి ప్రాణాలు కోల్పోయాడు. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు డీఆర్ఎఫ్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఇక వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, డీఆర్ఎస్ సిబ్బంది బాలుడి మృతదేహాన్ని బయటకు తీసేందుకు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. మోటర్ల సహాయంలో భావిలోని నీటిని బయటకు తోడుతున్నారు.
ఇదిలా ఉండగా మరికొంత మంది డీఆర్ఎఫ్ సిబ్బంది బావికి దిగి బాలుడు మృతదేహాం కోసం గాలింపు చేపట్టారు. రాత్రి సమయం కావడంతో బాలుడి ఆచూకీని కనిపెట్టడం డీఆర్ఎఫ్ సిబ్బంది, పోలీసులకు సవాల్‌గా మారింది. అయినా పోలీసులు ఫ్లెడ్ లైట్ల సహాయంలో బాలుడి ఆచూకీ కోసం గాలిస్తున్నారు.
కాగా మృతి చెందిన బాలుడు బీహార్ రాష్ట్రానికి చెందిన ఐదేళ్ల ప్రిన్స్‌గా పోలీసులు గుర్తించారు. బాలుడు ఆడుకుంటూ ప్రమాదవశాత్తు బావిలో పడిపోయినట్టు స్థానికులు చెబుతున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..