ఓయూ ఫ్రొఫెసర్ ఇంట్లో కుక్కల మృతి కలకలం.. వరుస మరణాలపై అనుమానాలు.. ఆ బంగ్లాలో ఏం జరుగుతోంది..?
ఉన్నట్టుండి మూగజీవాలు మృత్యువాత పడుతుండటం కలవరం రేపుతోంది. హైదరాబాద్ లోని అంబర్ పెట్ సోమసుందర్ నగర్ లో ఒక ఇంట్లో ఎదో తెలియని ఒక వైరస్ స్థానికులను భయ బ్రాంతులకు గురిచేస్తోంది.
Dogs Mystery deaths : అసలే కరోనా మహమ్మారి విజృంభిస్తున్నవేళ కొత్త సంఘటనలు ప్రజల్ని మరింత భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఉన్నట్టుండి మూగజీవాలు మృత్యువాత పడుతుండటం కలవరం రేపుతోంది. హైదరాబాద్ లోని అంబర్ పెట్ సోమసుందర్ నగర్ లో ఒక ఇంట్లో ఎదో తెలియని ఒక వైరస్ స్థానికులను భయ బ్రాంతులకు గురిచేస్తోంది. గత కొద్దిరోజులుగా ఓ ఇంట్లో నుంచి విపరీతమైన దుర్గంధం రావడంతో ఒక్కసారిగా భయపడ్డారు. ఏంటని అరా తీస్తే.. పేరో వైరస్‌తో పెంపుడు కుక్కలు చనిపోతున్నట్లు బయటపడింది. అయితే దీనంతటికీ కారణం ఓ ఫ్రొఫెసర్ తన బంగ్లాలో పెంచుకుంటున్న కుక్కలే అంటున్నారు స్థానికులు. .
హైదరాబాద్ మహానగరంలోని అంబర్‌పేట్ ప్రాంతానికి చెందిన సోమసుందర్‌నగర్‌లో సుష్మ అనే ఉస్మానియా యూనివర్సిటీ ఫ్రొఫెసర్ గత కొన్ని ఏళ్లుగా నివాసముంటున్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో జంతుశాస్త్రంలో అధ్యాపకురాలిగా పనిచేస్తున్నారు. స్రంఅయితే ఆమెకు కుక్కలంటే మహా ఇష్టం. దీంతో ఆమె వీధి కుక్కలను చేరదీసి పెంచుకుంటున్నారు. ఇలా దాదాపు 12 కుక్కలను ఎలాంటి పరిమిషన్ లేకుండా ఇంట్లో సాకుతున్నారు. దీంతో రాత్రుల్లో కుక్కల అరుపులకు స్థానికులకు తీవ్ర అసౌకర్యం కలిగిస్తున్నాయి. గతంలో స్థానికులు పలుమార్లు మునిసిపల్ అధికారులకు, స్థానిక నేతలకు పిర్యాదు చేసారు. కానీ ఫలితం లేదు.
ఇదిలావుంటే, నాలుగు రోజుల కిందట పెంపుడు కుక్కల్లోని మూడు కుక్కలు చనిపోయాయి. అయితే వీటిని మున్సిపల్ అధికారులకు అప్పగించకుండా ఇంటిలోనే ఉంచడంతో ఒక్కసారి దుర్వాసన ఆ ప్రాంతమంతా వ్యాపించింది. దీనిపై ఆగ్రహించిన స్థానికులు ఆమె ఇంటి ఎదుట ఆందోళనకు దిగారు.
మాములుగా కుక్కలను పెంచుకోవాలంటే మున్సిపల్ అధికారులను నుండి ఎన్ఓసీ సర్టిఫికెట్ తీసుకోవాలి. అది కేవలం ఇంటికి ఒక కుక్కను మాత్రమే పెంచుకొనే అవకాశం ఉంటుంది. కానీ ఈ ఫ్రొఫెసర్ ఎలాంటి అనుమతి లేకుండా పన్నెండు కుక్కలను పెంచుతూ తన ఇంట్లో ఉంచడం అందరిని ఆశ్చర్య పరుస్తుంది. విధి కుక్కల మీద ఆమె చట్టవిరుద్ధంగా ప్రయోగాలు చేస్తూ రాత్రుల్లో కుక్కలను హింసిస్తున్నరని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించిన ప్రయోగ పరికరాలు ఆమె ఇంట్లో ఉండటం చూస్తుంటే నిజమనే అనుమానాలు కలిగిస్తున్నాయని చెప్తున్నారు స్థానికులు.
అయితే, స్థానికులు ఫ్రొఫెసర్‌కు మతిస్థిమితం సరిగా లేకపోవడం కారణంగానే ఇలా ప్రవర్తిస్తుందని చెప్తున్నారు. స్థానికులు చేస్తున్న విమర్శలను తిప్పి కొడుతున్నారు ఫ్రొఫెసర్. తనో వర్కింగ్ ఉమెన్ అని.. తనకు కుక్కలను పెంచడం హాబీ అని చెప్తున్నారు. అయితే తన ఇంట్లో కుక్కలకు సామాన్యంగా వచ్చే ఫెరో వైరస్ సోకిందని అందుకోసమే అవి చనిపోయానని చెప్తుంది. వాటిపై తాను ఎలాంటి ప్రయోగాలు చేయలేదని చెప్తున్నారు. డయేరియా కారణంగా కుక్కలు రక్తం కక్కుకొని చనిపోయాయే తప్ప ఇందులో తాను ఎం చేయలేదని చెప్తున్నారు.
ఇదిలావుంటే, ఫ్రొఫెసర్ ఇంట్లో జరిగిన సంఘటనపై గతంలో చాలాసార్లు తమకు ఫిర్యాదులు వచ్చాయని.. దీనిపై ఆమెను నిలదీసిన ప్రయోజనం లేదని చెప్తున్నారు జీహెచ్ఎంసి వెటర్నరీ అధికారులు. కుక్కలు చనిపోయి నాలుగు రోజులు గడుస్తున్నా తమకు సమాచారం ఇవ్వలేదని చెప్పారు. గతంలో సుష్మా పై ఫిర్యాదు ఆధారంగా నోటీసులు జారీ చేసిన తన వైఖరిలో మార్పు రాలేదని మరోసారి నోటిసులు జారీ చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెబున్నారు.
గత కొన్ని ఏళ్లుగా తమకు ఇదే పరిస్థితి ఎదురవుతుందని చెప్తున్నారు స్థానికులు. చుట్టుపక్కల ఉండే వాళ్లకు నిత్యం ఆ ఇంటినుంచి వచ్చే వాసన నరకంగా ఉందని అంటున్నారు. భయంకరమైన వైరస్ కారణంగా మనుషులకు ఏదైనా జరిగితే తమ పరిస్థితి ఏంటని ప్రశిస్తున్నారు. అనుమతి లేకుండా కుక్కలను పెంచడంతో పాటు రాత్రుల్లో వాటిని హింసించడం వల్ల అరుపులతో చుట్టుపక్కల వాళ్ళు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటు ఒకవైపు కరోనా భయంతో ఉంటే ఇప్పుడు ఈ ఫ్రొఫెసర్ కారణంగా లేనిపోని రోగాలు వచ్చి అంబర్ పెట్ ప్రాంతం కొత్త వ్యాధుల బారినపడే ప్రమాదం ఉందని తక్షణమే ఆమెపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇదీ చదవండి…. Sandesh APP Video: కొత్త మెసేజింగ్ యాప్ తీసుకొస్తున్న కేంద్ర ప్రభుత్వం… వాట్సాప్‌కు పోటీగానేనా..?