Danam Nagender – HYDRA: స్లమ్‌ల జోలికి వెళ్లకూడదని ముందే చెప్పా.. హైడ్రాపై దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు..

చెరువులు, ఎఫ్‌టీఎల్ పరిధిలో అనధికారిక లే అవుట్లు, నిర్మాణాల కూల్చివేతలు, మూసీ బ్యూటిఫికేషన్‌ పనులతో హైదరాబాద్ లోని అనేక ప్రాంతాల్లో తీవ్ర భయాందోళన నెలకొంది. ముఖ్యంగా మూసి నది పరీవాహక ప్రాంతాల్లో ఉన్న నివాసాలను కూల్చివేయాలని నిర్ణయించడం, ఆ ఇళ్లకు మార్కింగ్‌ చేస్తుండటంతో బాధితుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

Danam Nagender - HYDRA: స్లమ్‌ల జోలికి వెళ్లకూడదని ముందే చెప్పా.. హైడ్రాపై దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు..
Danam Nagender
Follow us

|

Updated on: Sep 29, 2024 | 12:11 PM

చెరువులు, ఎఫ్‌టీఎల్ పరిధిలో అనధికారిక లే అవుట్లు, నిర్మాణాల కూల్చివేతలు, మూసీ బ్యూటిఫికేషన్‌ పనులతో హైదరాబాద్ లోని అనేక ప్రాంతాల్లో తీవ్ర భయాందోళన నెలకొంది. ముఖ్యంగా మూసి నది పరీవాహక ప్రాంతాల్లో ఉన్న నివాసాలను కూల్చివేయాలని నిర్ణయించడం, ఆ ఇళ్లకు మార్కింగ్‌ చేస్తుండటంతో బాధితుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. మూసీ వాసుల్ని ఉన్న పళంగా తరలించడంపై ఆందోళనలు కొనసాగుతున్నాయి.. ఓ వైపు హైడ్రా, మరోవైపు జీహెచ్ఎంసీ బాధితులకు భరోసా ఇస్తూ ప్రకటనలు చేస్తున్నప్పటికీ.. అటు ప్రజలు, ఇటు పలు రాజకీయ పార్టీల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ తరుణంలో ఎమ్మెల్యే దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలు మరోసారి సంచలనంగా మారాయి..

హైడ్రా, మూసీ పరివాహక ప్రాంతాల్లో ఇళ్లను ఖాళీ చేయించడంపై ఎమ్మెల్యే దానం నాగేందర్‌ ఆదివారం కీలక వ్యాఖ్యలు చేశారు. టీవీ9 తో మాట్లాడిన దానం నాగేందర్ స్లమ్‌ల జోలికి హైడ్రా వెళ్లకూడదని ముందే చెప్పానంటూ పేర్కొన్నారు. జలవిహార్‌, ఐమాక్స్‌ లాంటివి చాలా ఉన్నాయి. పేదల ఇళ్లను కూల్చడం సరికాదని.. మూసీ నిర్వాసితులకు కౌన్సిలింగ్ ఇవ్వాల్సిందంటూ తన మనోగతాన్ని మరోసారి వినిపించారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి ఖాళీ చేయించాల్సిందని.. ఇళ్లకు రెడ్‌మార్క్‌, సర్వే తొందరపాటు చర్యలే అంటూ పేర్కొన్నారు. ఎప్పుడో డిసైడ్‌ చేసిన బఫర్‌, ఎఫ్‌టీఎల్‌ పరిధిలో.. ఇప్పుడు ఎలాంటి ఇబ్బందీ లేదన్నారు. కూల్చిన ఇళ్లకు అక్కడే నివాసం ఏర్పాటు చేస్తే మంచిదన్నారు. ఈ అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లామని దానం నాగేందర్ పేర్కొన్నారు.

వీడియో చూడండి..

బీఆర్ఎస్ భరోసా..

ఇదిలాఉంటే.. మూసీ బాధితులకు అండగా ఉంటామని బీఆర్ఎస్ ప్రకటించింది. ఈ క్రమంలో హైదర్ షా కోట్‌కు వచ్చిన బీఆర్ఎస్ నేతలకు తమ గోడు వెల్లబోసుకున్నారు మూసీ బాధితులు. తాతల కాలం నుంచి తాము ఇక్కడే ఉంటున్నామని .. కష్టార్జితంతో ఇల్లు కట్టుకున్నమాన్నారు. ప్రక్షాళన పేరుతో ప్రభుత్వం తమ ఇళ్లను కూల్చాలని చూస్తుందని వాపోయారు. తమకు అండగా ఉండి ఇళ్లను కూల్చకుండా అడ్డుకోవాలని బీఆర్ఎస్‌ నేతలకు విజ్ఞప్తి చేశారు బాధితులు.