CM Revanth: స్కిల్ యూనివర్సిటీకి సీఎం రేవంత్ శంకుస్థాపన.. రూ. 100 కోట్ల నిధులు విడుదల
యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేశారు సీఎం రేవంత్. స్కిల్ వర్సిటీలో 17 కోర్సులను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ఈ ఏడాది మాత్రం 6 కోర్సులను ప్రారంభిస్తామన్నారు. ఏడాదికి యావరేజ్ ఫీజు 50 వేలుగా ఉంటుందన్నారు సీఎం రేవంత్.
రంగారెడ్డి జిల్లా మీర్‌ఖాన్‌పేటలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ స్కిల్ యూనివర్సిటీ కోసం 57 ఎకరాల స్థలం కేటాయించారు. 100 కోట్ల నిధులను విడుదల చేశారు. వచ్చే ఏడాది నుంచి ఇక్కడ అడ్మిషన్స్ ప్రారంభించనున్నారు. అంతకుముందు తెలంగాణ అసెంబ్లీలో స్కిల్ వర్సిటీ బిల్లుపై చర్చ జరిగింది. మహాత్మగాంధీ స్ఫూర్తిగా.. తెలంగాణలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. స్కిల్ వర్సిటీలో మొత్తం 17 కోర్సులను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ఈ ఏడాది 6 కోర్సులు ప్రారంభిస్తామన్నారు. ఏడాదికి యావరేజ్ ఫీజు రూ.50 వేలుగా ఉంటుందన్నారు సీఎం రేవంత్.
తెలంగాణ నిరుద్యోగ యువత కోసం ప్రభుత్వం స్కిల్ యూనివర్శిటీని ఏర్పాటు చేస్తుందన్నారు మంత్రి శ్రీధర్‌బాబు. స్కిల్ యూనివర్శిటీ కోసం శాశ్వత క్యాంపస్‌ను ఏర్పాటు చేయబోతున్నామన్నారు. యువతకు ఉపాధితో పాటు రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి తోడ్పాటు అందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. స్కిల్ యూనివర్సిటీ ద్వారా నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. అందరి సలహాలు, సూచనలు తీసుకున్నామన్నారు. అందరికి మేలు జరిగేలా స్కిల్ యూనివర్సిటీ ఉంటుందని వివరించారు. కొంతమంది వ్యక్తుల కోసమే ప్రైవేటు యూనివర్సిటీలను తీసుకువచ్చారని విమర్శించారు.